న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

హారిస్ నెక్ట్స్ టైమ్ కొంచెం స్లోగా వేయబ్బా.. ఔట్ చేసి దండం పెట్టడంపై అఫ్రిది ట్వీట్

PSL 2020: Shahid Afridi reacts to his dismissal by Haris Rauf in Eliminator 2

కరాచీ: పాకిస్థాన్‌ సూపర్‌ లీగ్‌ (పీఎస్ఎల్‌)లో లాహోర్ ఖలాండర్స్ పేసర్ హారిస్ రౌఫ్ తనను ఔట్ చేసి దండం పెట్టడంపై ముల్తాన్ సుల్తాన్స్ ఆల్‌రౌండర్ షాహిద్ అఫ్రిది తనదైన శైలిలో స్పందించాడు. అద్భుత బంతని కొనియాడిన ఈ పాకిస్థాన్ ఆల్‌రౌండర్.. నెక్ట్స్‌ టైమ్ తనకు బంతిని నెమ్మదిగా వేయమని వేడుకున్నాడు. పీఎస్‌ఎల్ రెండో ఎలిమినేటర్‌లో భాగంగా ఆదివారం రాత్రి లాహోర్‌ క్వాలాండర్స్‌-ముల్తాన్‌ సుల్తాన్స్‌ జట్ల మధ్య మ్యాచ్‌ జరిగింది.

సుల్తాన్స్‌ తరఫున బరిలోకి దిగిన వెటరన్‌ ఆల్‌రౌండర్‌ షాహిద్‌ అఫ్రిదిని పేసర్‌ హారిస్‌ రౌఫ్‌ అద్భుత ఇన్‌స్వింగర్‌ యార్కర్‌తో గోల్డెన్ డకౌట్‌‌గా పెవిలియన్ చేర్చాడు. ఆ వెంటనే అఫ్రిదిపై ఉన్న గౌరవంతో అతను రెండు చేతులూ జోడించి దండం పెడుతూ క్షమాపణలు కోరాడు. ఈ వీడియోను 'లాలా.. ఐయామ్‌ సారీ' అనే క్యాప్షన్‌తో పీఎస్ఎల్‌ సోషల్ మీడియా వేదికగా పంచుకోగా వైరల్‌ అయింది.

క్షమాపణలు చెప్పలేదు..

ఈ ఆసక్తికర సన్నివేశంపై హారిస్ రౌఫ్ ఈఎస్‌పీఎన్ క్రిక్ ఇన్‌ఫోతో మాట్లాడుతూ.. దేశానికి ఎన్నో విజయాలందించిన అఫ్రిదికి తాను గౌరవం ఇవ్వడం చాలా ముఖ్యమని పేర్కొన్నాడు. వికెట్ తీసినందుకు తాను క్షమాపణలు చెప్పలేదని, గౌరవ సూచకంగా దండం పెట్టాడనని తెలిపాడు. ‘అఫ్రిది బాయ్ పాకిస్థాన్ తరఫున ఎన్నో అద్భుత ప్రదర్శనలు చేశాడు. మరెన్నో విజయాలందించాడు. అలాంటి ఆటగాడికి మర్యాద ఇవ్వడం చాలా ముఖ్యం. సాధారణంగా వికెట్ తీయగానే నేను చాలా దూకుడుగా ఉంటా. కానీ అఫ్రిది బాయ్‌ను ఔట్ చేసిన తర్వాత నా శైలికి భిన్నంగా ప్రవర్తించా.

అతను పాకిస్థాన్ సూపర్ స్టార్. తన అసాధారణ ఆటతో పాకిస్థాన్‌కు ఎన్నో అద్భుత విజయాలందించాడు. అలాంటి ఆటగాడికి నేను గౌరవం ఇవ్వాల్సిందే. వాస్తవానికి అఫ్రిదికి క్షమాపణలు చెప్పలేదు. గౌరవ సూచకంగా అలా చేశాను. అది నా మనసులో నుంచి వచ్చినది. గౌరవ సూచకంగా దండం పెట్టడం నా శైలి'అని హారిస్ రౌఫ్ చెప్పుకొచ్చాడు.

ఇంకోసారి స్లోగా వేయి..

హారిస్ రౌఫ్ మాట్లాడిన వీడియోను ఈఎస్‌పీఎన్ క్రిక్‌ఇన్ ఫో ట్వీట్ చేయగా.. అఫ్రిది స్పందించాడు. ఈ ట్వీట్‌ను రీట్వీట్ చేస్తూ.. హారిస్ రౌఫ్ బౌలింగ్‌ను కొనియాడాడు. ‘అది ఏమాత్రం ఆడలేని గొప్ప యార్కర్. హారిస్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. దయచేసి నెక్ట్స్ టైమ్ నాకు కొంచెం స్లోగా బౌలింగ్ చేయి. ఫైనల్ బెర్త్ దక్కించుకున్న లాహోర్ ఖలాండర్స్‌కు అభినందనలు. రేపటి(నవంబర్ 17) ఫైనల్ మ్యాచ్ కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తున్నా. సీజన్ మొత్తం మద్దతు తెలిపిన ముల్తాన్ సుల్తాన్స్ అభిమానులకు ధన్యవాదాలు'అని అఫ్రిది ట్వీ ట్ చేశాడు.

కరాచీ vs లాహోర్..

కరాచీ vs లాహోర్..

కరోనాతో ఆగిపోయిన పాకిస్థాన్ సూపర్ లీగ్( పీఎస్‌ఎల్) 2020 సీజన్ ఎట్టకేలకు తుది దశకు చేరుకుంది. ప్రాణాంతక వైరస్ కారణంగా ఈ పాక్ టీ20 లీగ్ ప్లే ఆఫ్స్ మ్యాచ్‌లు ఆగిపోగా.. ఆ తర్వాత ఐపీఎల్ 2020 సీజన్‌తో ఆటంకం ఏర్పడింది. దాంతో ఐపీఎల్ ముగిసే వరకు వేచి చూసిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) భారత క్యాష్ రిచ్ లీగ్ దిగ్విజయంగా పూర్తవడంతో పీఎస్ఎల్ తదుపరి ఘట్టాన్ని షురూ చేసింది.ఈ క్రమంలోనే శనివారం ముల్తాన్ సుల్తాన్స్‌తో జరిగిన క్వాలిఫయర్ 1‌లో గెలుపొందిన కరాచీ కింగ్స్ నేరుగా ఫైనల్ చేరగా.. లాహోర్ ఖలాండర్స్‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఓడిన పెష్వార్ జల్మీ ఇంటిదారిపట్టింది. ఆదివారం జరిగిన క్వాలిఫయర్-2లో ముల్తాన్ సుల్తాన్స్‌పై ఖలాండర్స్ 25 పరుగులతో గెలుపొంది టైటిల్ ఫైట్‌కు సిద్దమైంది. నేడు(మంగళవారం) కరాచీ కింగ్స్‌తో ఖలాండర్స్ అమీతుమీ తేల్చుకోనుంది.

అఫ్రిది ఫ్లాఫ్ షో..

అఫ్రిది ఫ్లాఫ్ షో..

ఇక అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన అఫ్రిది కేవలం టీ20 లీగ్‌లు మాత్రమే ఆడుతున్న విషయం తెలిసిందే. దాంతో చాలా రోజుల తర్వాత మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టిన అఫ్రిది.. దారుణంగా విఫలమయ్యాడు. రెండు మ్యాచ్‌ల్లో 12, 0తో అభిమానులను తీవ్రంగా నిరాపరిచాడు. దాంతో అఫ్రిది బ్యాటింగ్‌పై అభిమానులు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. ఇక కరోనా టైమ్‌లో పేద ప్రజలందరికి రేషన్, సరకులు అందజేసిన అఫ్రిది.. కరోనా బారిన పడి కోలుకున్న విషయం తెలిసిందే.

Big Bash New Rules 2020: ఇక పవర్ ప్లే 4 ఓవర్లే.. కొత్తగా బోనస్ పాయింట్‌తో సబ్‌స్టిట్యూడ్‌కు చాన్స్!

Story first published: Tuesday, November 17, 2020, 9:59 [IST]
Other articles published on Nov 17, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X