Big Bash New Rules 2020: ఇక పవర్ ప్లే 4 ఓవర్లే.. కొత్తగా బోనస్ పాయింట్‌తో సబ్‌స్టిట్యూడ్‌కు చాన్స్!

సిడ్నీ: అది ఉత్కంఠగా సాగుతున్న టీ20 మ్యాచ్.. చివరి ఓవర్‌లో విజయానికి 20 పరుగులు కావాలి. క్రీజులో ఉన్నదేమో టెయిలెండర్లు, కానీ తుది జట్టులో లేని డేవిడ్ వార్నర్ బరిలోకి దిగాడు. భారీ సిక్సర్లతో మ్యాచ్‌ను గెలిపించాడు. మరో మ్యాచ్‌లో ఆఖరి ఓవర్‌లో విజయానికి 10 పరుగులు కావాలి. కానీ తుది జట్టులో లేని అప్పటి వరకు డగౌట్‌కే పరిమితమైన వరల్డ్ క్లాస్ బౌలర్ కమిన్స్ సబ్‌స్టిట్యూట్‌గా వచ్చి అద్భుత బౌలింగ్‌తో ప్రత్యర్థిని కట్టడి చేసి విజయాన్నందించాడు. నమ్మశక్యంగా లేదు కదా.. వినడానికి ఆశ్చర్యకరంగా ఉంది కదా..! ఆస్ట్రేలియా వేదికగా జరిగే ఈ సీజన్ బిగ్‌బాష్ లీగ్‌లో ఇవన్నీ మనం చూడబోతున్నాం.!
ప్రస్తుత టీ20 ఫార్మాట్‌కు భిన్నంగా ఈ ధనాధన్ లీగ్‌ను నిర్వహించేందుకు బీబీఎల్ ఆర్గనైజర్లు సమాయత్తం అవుతున్నారు. ముచ్చటైన మూడు మార్పులతో అభిమానులను అలరించేందుకు సిద్దమవుతున్నారు. క్రికెట్‌లో మరిన్ని మార్పులు తెచ్చేందుకు తమ ఈ ప్రయత్నం దోహదపడుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న నిబంధనలనే కొంచెం సవరించిన బీబీఎల్ ఆర్గనైజర్స్.. పవర్ సర్జ్, బాష్ బూస్ట్, ఎక్స్ ఫ్యాక్టర్ అనే కొత్త నిబంధనలు ప్రవేశపెట్టబోతున్నారు.

పవర్ సర్జ్..
టీ20 ఫార్మాట్‌లో ప్రస్తుతం ఉన్న 6 ఓవర్ల పవర్ ప్లేను బిగ్‌బాష్ లీగ్ ఆర్గనైజర్లు ‘పవర్ సర్జ్’ పేరిట నాలుగు ఓవర్లకు తగ్గించారు. మిగతా రెండు ఓవర్ల పవర్ ప్లే విషయాన్ని బ్యాట్స్‌మెన్‌కు వదిలేశారు. ఇన్నింగ్స్ 11 ఓవర్లు పూర్తయిన తర్వాత బ్యాట్స్‌మెన్ ఈ రెండు ఓవర్ల పవర్ ప్లేను ఎప్పుడైనా తీసుకోవచ్చు. ఇక పవర్ ప్లేలో ఫిల్డింగ్ రిస్ట్రిక్షన్ ఉంటాయన్న విషయం తెలిసిందే. పవర్ ప్లే సమయంలో 30 యార్డ్ సర్కిల్ బయట ఇద్దరు ఫీల్డర్లు మాత్రమే ఉంటారు.

బాష్ బూస్ట్..
ఇక పాయింట్ల విధానంలో కూడా బిగ్ బాష్ లీగ్ నిర్వాహకులు మార్పులు తెచ్చారు. ప్రస్తుత ఫార్మాట్ ప్రకారమైతే గెలిచిన జట్టుకు 2 పాయింట్లు ఇస్తున్నారు. కానీ ఈ సీజన్‌లో కొత్తగా 4 పాయింట్లు ఇవ్వనున్నారు. అయితే ఇందులో గెలిచిన జట్టు నేరుగా 3 పాయింట్లు దక్కించుకోనుండగా.. మరో పాయింట్ బోనస్‌గా లభించనుంది.
ఉదాహరణకి.. ఓ జట్టు 120 పరుగుల లక్ష్యాన్ని 10 ఓవర్లలోనే ఛేదిస్తుంది. మరో జట్టు 19వ ఓవర్ వరకు శ్రమించి సాధిస్తుంది. అంతిమంగా గెలిచిన ఇరు జట్లకు సమానమైన పాయింట్లు వస్తాయి. కానీ బిగ్ బాష్‌లో ఈ నిబంధనలు మారాయి. ప్రతి విజయానికి జట్టుకు మూడు పాయింట్లు కేటాయిస్తారు. పది ఓవర్లలోపే ప్రత్యర్థిని చిత్తు చేస్తే అదనంగా మరోపాయింట్ దక్కుతుంది. 10 ఓవర్లకు స్కోరు సమమైతే 0.5 పాయింట్ వస్తుంది.

X ఫ్యాక్టర్ ప్లేయర్..
11 మంది సభ్యుల తుది జట్టులో లేని ఆటగాడికి సబ్‌స్టిట్యూడ్‌కు అవకాశం కల్పించడమే ఈ రూల్ ఉద్దేశం. అయితే ఈ నిబంధనకు షరతులు వర్తిస్తాయి. మ్యాచ్‌కు ముందే ఇరు జట్లు 13 మందితో కూడిన టీమ్స్‌ను ప్రకటించాలి. పరిస్థితులకు తగ్గట్టు తమ 12, 13వ ఆటగాడిలో ఒకరిని ఫస్ట్ ఇన్నింగ్స్ 10 ఓవర్ నుంచి ఎప్పుడైనా ఆడించవచ్చు. ఎవరికైతే రిప్లేస్ చేయాలనుకుంటున్నారో ఆ ఆటగాడు ఒక ఓవర్ కంటే ఎక్కువగా బౌలింగ్, బ్యాటింగ్ చేయకూడదు.

అందుకే ఈ మార్పులు..
అభిమానులు, ఆటగాళ్లను మరింత ఉత్సాహ పరిచేందుకే ఈ వినూత్న మార్పులు తీసుకొస్తున్నామని బీబీఎల్ హెడ్ అలిస్టెయిర్ డాబ్‌సన్ తెలిపాడు. తమ ఈ మార్పులు అభిమానులకు నచ్చుతాయని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఈ ఆస్ట్రేలియా టీ20 లీగ్ డిసెంబర్ 10 నుంచి ప్రారంభం కానుంది. ఐపీఎల్ తర్వాత అంతని ప్రాధాన్యత, ఆధరణ ఉన్న లీగ్ బిగ్‌బాష్. ఈ మార్పులు ఇక్కడ సక్సెస్ అయితే ఇది ఇతర లీగ్‌లు, అంతర్జాతీయ క్రికెట్‌లోకి కూడా ప్రవేశిస్తాయి.
కళ్లు చెదిరే యార్కర్‌తో బ్యాట్స్‌మన్‌ను గోల్డెన్ డక్ చేసి క్షమాపణలు చెప్పిన బౌలర్ (వీడియో)
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications