PSL 2020 చాంపియన్ కరాచీ కింగ్స్.. టైటిల్ ముద్దాడిన పాక్ కోహ్లీ!

కరాచీ: కరోనా విపత్కర పరిస్థితుల నడుమ పాకిస్థాన్ సూపర్ లీగ్(పీఎస్‌ఎల్) దిగ్విజయంగా పూర్తయింది. మార్చిలో పూర్తవ్వాల్సిన ఈ టీ20 లీగ్ ప్లే ఆఫ్స్ మ్యాచ్‌లు మహమ్మారి కారణంగా నిలిచిపోయాయి. ఆ తర్వాత ఐపీఎల్ 2020 సీజన్ అడ్డంకిగా నిలిచింది. చివరకు భారత క్యాష్ రిచ్ లీగ్ ముగియడంతో పీఎస్‌ఎల్‌కు లైన్ క్లియర్ అవ్వగా.. మంగళవారం రాత్రి జరిగిన ఫైనల్‌తో పీఎస్‌ఎల్ 2020 సీజన్‌కు సక్సెస్‌ఫుల్‌గా ఎండ్ కార్డ్ పడింది.
లాహోర్ ఖలండర్స్‌తో జరిగిన ఈ టైటిల్ ఫైట్‌లో 5 వికెట్ల తేడాతో నెగ్గిన కరాచీ కింగ్స్ తొలి సారి పీఎస్‌ఎల్ టైటిల్ ముద్దాడింది. హాఫ్ సెంచరీతో కరాచీ విజయంలో కీలక పాత్ర పోషించిన బాబర్ ఆజామ్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ లభించింది. ఇక బాబర్‌ను ముద్దుగా పాకిస్థాన్ కోహ్లీగా పిలుస్తారన్న విషయం తెలిసిందే.

8 బంతులు మిగిలుండగానే..
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన లాహోర్ ఖలందర్స్ టీమ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసింది. ఆ జట్టులో ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ (38 బంతుల్లో 4 ఫోర్లు, సిక్సర్‌తో 35) టాప్ స్కోరర్‌కాగా.. కరాచీ బౌలర్లలో మక్సూద్, అర్షద్, ఆసిఫ్ తలో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన కరాచీ కింగ్స్ 18.4 ఓవర్లలో 5 వికెట్లకు 135 పరుగులు చేసి 8 బంతులు మిగిలుండగానే విజయాన్నందుకుంది.

అజేయ హాఫ్ సెంచరీ..
చేజింగ్‌లో కరాచీ కింగ్స్ టాపార్డర్ షర్జీల్ (13), అలెక్స్ హేల్స్ (11), ఇఫ్తికర్ అహ్మద్ (4), రూథర్‌ఫర్డ్ (0) విఫలమైనా.. ఒంటరి పోరాటం చేసిన బాబర్ అజామ్ (49 బంతుల్లో 7 ఫోర్లతో 63 నాటౌట్) చివరి వరకూ క్రీజులో నిలిచి అద్భుత విజయాన్నందించాడు. బాబర్‌కు అండగా వాల్టన్(22) నిలిచాడు. ప్రత్యర్థి బౌలర్లలో హారిస్ రౌఫ్, దిల్‌బార్ హుస్సెన్ రెండేసి వికెట్లు తీయగా.. సమిత్ పటేల్ ఓ వికెట్ తీశాడు.

ఎట్టకేలకు ముగిసింది..
ఈ ఏడాది ఫిబ్రవరి 20న ప్రారంభమైన ఈ సీజన్ మార్చి మూడో వారంలోనే ముగియాల్సింది. కానీ.. మార్చి 17 నాటికి ఆ దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి పెరిగిపోగా.. టోర్నీలో ఆడుతున్న కొంత మంది క్రికెటర్లలో వైరస్ లక్షణాలు కనిపించాయి. దాంతో.. టోర్నీని నిరవధికంగా వాయిదావేశారు. అయితే.. ఐపీఎల్ 2020 సీజన్ నవంబరు 10న యూఏఈ వేదికగా ముగియగా.. ఆ వెంటనే టోర్నీని కొనసాగించిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ).. మంగళవారం రాత్రి ఫైనల్‌తో లాంఛనాన్ని పూర్తి చేసింది.
India vs Australia: పరిమిత ఓవర్ల సిరీస్‌ల నుంచి ఆసీస్ పేసర్ ఔట్!
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications