సారీ వార్నర్.. నీ రెండో కూతురికి విరాట్ కోహ్లీ అంటేనే ఇష్టం: క్యాండీస్ వార్నర్

సిడ్నీ: ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్‌కు అతని సతీమణి క్యాండీస్ వార్నర్ క్షమాపణలు చెప్పింది. తమ రెండో కూతురికి క్రికెటర్‌గా తన తండ్రి కన్నా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అంటేనే ఇష్టమని తెలిపింది. తను చాలా మొండిదని చెప్పుకొచ్చింది. ట్రిపుల్ ఎం సిడ్నీ 104.9 అనే ఎఫ్ఎం రేడియో ఛానెల్‌కు తాజాగా ఇంటర్వ్యూ ఇచ్చిన క్యాండీస్.. ఆసక్తికర విషయాలను పంచుకుంది. వార్నర్‌తో కలిసి తామంతా ఇంట్లో క్రికెట్ ఆడుతామని తెలిపింది. ఈ నేపథ్యంలోనే తమ నడిపి కూతురు విరాట్ కోహ్లీకి వీరాభిమానని చెప్పుకొచ్చింది.

మా నడిపిది మొండిది..
‘ఇంట్లో అప్పుడప్పుడు క్రికెట్ ఆడుతాం. వార్నర్ బౌన్సర్లు వేస్తుంటే.. మా పిల్లలు బౌన్సర్లు వద్దు. స్పిన్ వేయమంటారు. కొన్నిసార్లు డాడీలా అవుతామని చెబితే.. మరికొన్నిసార్లు ఫించ్‌లా అవుతామంటారు. కానీ మా రెండో కూతురు అయితే విరాట్ కోహ్లీలా అవుతానని చెబుతుంది. ఆమె చాలా మొండిది. అతనే తన ఫేవరేట్ అని తెగేసి చెబుతుంది. తండ్రీ కూతుళ్లు ఒకరినొకరు స్లెడ్జింగ్ చేసుకుంటారు.'అని క్యాండిస్ నవ్వుతూ చెప్పుకొచ్చింది.

సారీ వార్నర్
ఈ వీడియోను ట్రిపుల్ ఎం సిడ్నీ ట్వీట్ చేయగా.. సారీ డేవిడ్ వార్నర్ అంటూ క్యాండీస్ దాన్ని రీట్వీట్ చేసింది. ఇక వార్నర్-క్యాండిస్ దంపతులకు మొత్తం ముగ్గురు కూతుళ్లుకాగా.. పెద్దామె పేరు ఇవీమే.. రెండో కూతురు ఇండీ రే, చిన్నామె ఇస్లా రోస్. ఇస్లా రోస్ గతేడాది వన్డే ప్రపంచకప్ సందర్భంగా జన్మించింది. ఈ ముగ్గురు చిన్నారులు తమ తండ్రితో లాక్‌డౌన్‌లో హల్‌చల్ చేశారు. భారత్‌పై ఉన్న అభిమానంతోనే వార్నర్ తన రెండో కూతురుకు ఇండీ రే అని పేరు పెట్టుకున్నాడు. ఇక ఇక క్యాండిస్ ఈ ట్వీట్ ఇప్పుడు నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఈ ట్వీట్‌కు ఫ్యాన్స్ స్పందిస్తూ.. టీ20ల్లో వార్నర్ విధ్వంసకర బ్యాట్స్‌మెన్ అని.. టీ20 చరిత్రలోనే అతను దిగ్గజ క్రికెటర్ అని తమ అభిమాన క్రికెటర్‌ను ప్రశంసిస్తున్నారు. టీ20ల్లో వార్నర్‌కు తిరుగులేదని క్యాండీస్ ట్వీట్‌కు బదులిస్తున్నారు.

లైంగిక జీవితంపై బోల్డ్ కామెంట్స్..
ఇటీవల ఓ రేడియో షోలో పాల్గొన్న క్యాండిస్ తన లైంగిక జీవితంపై బోల్డ్ కామెంట్స్ చేసింది. ‘ది కైల్ అండ్ జాకీ ఓ' షోలో పాల్గొన్న ఆమెను హోస్ట్ కిస్ కైల్.. లైంగిక జీవితంపై కొన్ని ప్రశ్నలు అడిగాడు. ‘ఫుట్ బాల్ ప్లేయర్లు మ్యాచ్‌కు ముందు సెక్స్ చేయరు. క్రికెటర్లు కూడా ఇలానే ఉంటారా? వార్నర్ తన మ్యాచ్‌కు ముందు సెక్స్ చేస్తాడా?'అని ప్రశ్నించాడు. దీనికి క్యాండిస్ అది డేవిడ్ వార్నర్ ఇష్టంపై ఆధారపడి ఉంటుందని, అతను కావాలనుకుంటే చేస్తాడని, లేకుంటే లేదని తెలిపింది. అంతేకానీ చేయకుండా ఉండవద్దనే నిబంధనతో అయితే ఏమి ఉండడని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా తన భర్త ఈ విషయంలో చాలా సమర్థుడని బోల్డ్ కామెంట్స్ కూడా చేసింది.

సూపర్ వార్నర్..
ఐపీఎల్ 2020 సీజన్‌లో డేవిడ్ వార్నర్ అద్భుత ప్రదర్శన కనబర్చాడు. 16 మ్యాచ్‌ల్లో 134.64 స్ట్రైక్‌రేట్‌తో 548 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు హాఫ్ సెంచరీలున్నాయి. ఇక జట్టును క్వాలిఫయర్-2 వరకు తీసుకెళ్లాడు. కానీ ఢిల్లీ చేతిలో ఓడిన హైదరాబాద్.. టైటిల్ ఫైట్‌కు వెళ్లే అవకాశాన్ని తృటిలో చేజార్చుకుంది. ఇక హైదరాబాద్ ఓడినా.. అభిమానుల మనసులను గెలుచుకుంది. గాయాలతో స్టార్ ఆటగాళ్లు దూరమైనా వార్నర్ జట్టును నడిపిన తీరు ప్రతీ ఒక్కరిని ఆకట్టుకుంది. అంతేకాకుండా ఐపీఎల్‌లో 5వేల పరుగుల క్లబ్‌లో చేరిన తొలి విదేశీ ఆటగాడు కూడా వార్నరే కావడం గమనార్హం.
నట్టూ.. యార్కర్లే కాదు బౌన్సర్లూ వేయగలడు..చాన్స్ ఇస్తే టీ20 ప్రపంచకప్‌లో చెలరేగుతాడు: వీవీఎస్
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications