Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రాంచీలో ముగించేస్తారా?: న్యూజిలాండ్ ఆశలన్నీ నాలుగో వన్డేపైనే

రాంచీ: ఐదు వన్డేల సిరిస్‌లో భాగంగా భారత్-న్యూజిలాండ్ మధ్య జరగనున్న నాలుగో వన్డేకి రాంచీ సిద్ధమైంది. మూడో వన్డేలో విజయం సాధించి 2-1తో ముందంజలో ఉన్న ధోని సేన సిరిస్ గెలుపుపై దృష్టి సారించింది. సిరిస్ ఫలితాన్ని విశాఖలో జరిగే వన్డే వరకూ పొగిడించకుండా రాంచీలోనే ముగించాలని కసరత్తులు చేస్తోంది.

ఇప్పటికే ధోని సేన రాంచీ మ్యాచ్ కోసం జార్ఖండ్‌‌కు చేరుకుంది. ఐదు వన్డేల సిరిస్‌లో తొలి వన్డేలో గెలిచిన టీమిండియా.. ఢిల్లీలో జరిగిన రెండో వన్డేలో న్యూజిలాండ్‌ చేతిలో అనూహ్యాంగా ఆరు పరుగులు తేడాతో ఓటమి పాలైంది. దీంతో సిరిస్ 1-1తో సమమైంది.

రాంచీలో 4వ వన్డే: కోహ్లీ మెరుగైన రికార్డు, గెలుపు భారత్‌దే!
ఆశలన్నీ కోహ్లీ-ధోనిపైనే
ఇక కీలకమైన మూడో వన్డేలో ధోని 80 పరుగులతో రాణించగా, కోహ్లీ (154 నాటౌట్) పరుగులు చేసి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో సిరిస్‌లో భారత్ 2-1 ఆధిక్యంలో నిలిపారు. ఈ క్రమంలో నాలుగో వన్డేలో కూడా అదే జోరుని కొనసాగించాలని టీమిండియా భావిస్తోంది.

ఇందు కోసం జట్టులో కూడా ఎటువంటి మార్పులు చేయడం లేదు. మూడు వన్డేలకు గాను ఏదైతే జట్టు బరిలోకి దిగిందో అదే జట్టుని చివరి రెండు వన్డేలకు కూడా యాధాతథంగా ఉంచతూ జాతీయ సెలక్టర్లు సోమవారం నిర్ణయం తీసుకున్నారు. ఇక న్యూజిలాండ్ మాత్రం నాలుగో వన్డేలో విజయం సాధించి బరిలో నిలవాలని చూస్తోంది.

నాలుగో వన్డేలో గెలుపు భారత్ కంటే న్యూజిలాండ్‌కు ఎంతో అవసరం. ఇప్పటికే జరిగిన టెస్టు సిరిస్‌లో న్యూజిలాండ్ జట్టు భారత్ చేతిలో వైట్ వాష్ అయింది. వన్డేల్లో గెలిచి సగర్వంగా ఇంటికి వెళ్లాలని విలియమ్సన్ సేన భావిస్తోంది. కాబట్టి నాలుగో వన్డేలో న్యూజిలాండ్ జట్టుకు గెలుపు అవసరం.

మూడో వన్డేలో సచిన్ రికార్డుని బద్దలు కొట్టిన ధోని
ప్రతిష్టాత్మకంగా నాలుగో వన్డే
దీంతో బుధవారం జార్ఖండ్‌ స్టేట్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (జేఎస్‌సీఏ) స్టేడియంలో జరిగే మ్యాచ్‌ని న్యూజిలాండ్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. నాలుగో వన్డేలో విజయం సాధించి ఇక్కడే సిరిస్ గెలవాలనే పట్టుదలతో టీమిండియా ఉంటే, ఈ మ్యాచ్‌‌లో గెలిచి సిరిస్‌పై ఆశలను సజీవంగా ఉంచుకోవాలనే న్యూజిలాండ్ భావిస్తోంది.

ఈ క్రమంలో ఇరుజట్లు వ్యూహాలకు పదను పెడుతున్నాయి. మూడో వన్డేలో కేవలం ఒక్క మార్పుతో మాత్రమే బరిలోకి దిగిన న్యూజిలాండ్ నాలుగో వన్డేలో ఎటువంటి మార్పులు లేకుండా మ్యాచ్‌కి సన్నద్దమయ్యే అవకాశం ఉంది. మూడో వన్డేలో ఆల్ రౌండర్ జేమ్స్ నీషమ్ జట్టులోకి రావడంతో జట్టు కాస్తంత బలంగా కనిపిస్తోంది.

మొహాలిలో ఆదివారం జరిగిన మూడో వన్డేలో జేమ్స్ నీషమ్-హెన్రీల జోడి సరికొత్త భాగస్వామ్యాన్ని నమోదు చేసింది. మూడో వన్డేలో తొమ్మిది వికెట్‌కు 84 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించ‌ారు. దీంతో తొమ్మిదో వికెట్‌కు అత్యధిక పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసిన న్యూజిలాండ్ జోడిగా అవతరించింది.

ఈ భాగస్వామ్యంతో 2009లో భారత్‌పై 9వ వికెట్‌కు కివీస్ జోడి మిల్స్-సౌథీలు నమోదు చేసిన 83 పరుగుల భాగస్వామ్యాన్ని అధిగమించారు. దీంతో న్యూజిలాండ్ జట్టులో దాదాపు మార్పులు ఉండకపోవచ్చని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక భారత్ విషయానికి వస్తే తుది జట్టులో ఎటువంటి మార్పులు ఉండవు.

 ఓపెనర్లు విఫలం

ఓపెనర్లు విఫలం

కాగా, న్యూజిలాండ్‌తో జరుగుతున్న వన్డే సిరిస్‌లో టీమిండియా ఓపెనర్లు రోహిత్ శర్మ, రహానేలు ఇప్పటి వరకు మంచి భాగస్వామ్యాని నెలకొల్పలేదు. శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్‌లు గాయం కారణంగా ఈ సిరిస్‌కు దూరమవ్వడంతో ఓపెనర్లుగా రోహిత్ శర్మ, రహానే బరిలోకి దిగుతున్నారు. నాలుగో వన్డేలోనైనా భారత ఓపెనర్లు మంచి భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేస్తారో లేదో చూడాలి.

 రాంచీలో టీమిండియాకు రికార్డు

రాంచీలో టీమిండియాకు రికార్డు

ఇదిలా ఉంటే నాలుగో వన్డే జరగనున్న రాంచీలో టీమిండియాకు మంచి రికార్డు ఉంది. ఇప్పటివరకు రాంచీలో టీమిండియా మూడు మ్యాచ్‌లు ఆడగా రెండింటిలో గెలిచింది. ఈ సిరిస్‌లో ఎంతో కీలకం కానున్న రాంచీ మ్యాచ్ ధోనిసేనకు కలిసొచ్చేలాగా ఉంది. అంతేకాదు రాంచీలో కోహ్లీకి మెరుగైన రికార్డు ఉంది.

 తొలి వన్డే

తొలి వన్డే

జనవరి 19, 2013లో భారత్-ఇంగ్లండ్‌ మధ్య రాంచీలో తొలి మ్యాచ్‌ జరిగింది. ధోని నేతృత్వంలోని టీమిండియా 7 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్‌పై విజయం సాధించింది. తొలుత జడేజా (3/19), ఇషాంత్ (2/29), అశ్విన్‌ (2/37) వికెట్లు తీయడంతో ఇంగ్లాండ్ 42.2 ఓవర్లలో 155 పరుగులకే ఆలౌటైంది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన విరాట్‌ కోహ్లీ (77 నాటౌట్‌) చెలరేగడంతో భారత్ 3 వికెట్లు కోల్పోయి 28.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది.

రెండో వన్డేకి వర్షం అడ్డంకి

రెండో వన్డేకి వర్షం అడ్డంకి

ఇక అక్టోబర్‌ 23, 2013లో భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన మ్యాచ్‌కి వర్షం అడ్డింకిగా మారింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌ చేసిన ఆసీస్‌ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 295 పరుగులు చేసింది. కెప్టెన్‌ జార్జ్‌ బెయిలీ (98), మాక్స్‌వెల్‌ (92) అర్ధ సెంచరీలతో రాణించారు. 296 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 4.1 ఓవర్లలో 27/0 పరుగులు చేయగా వర్షం అడ్డంకిగా మారింది. దీంతో అంఫైర్లు మ్యాచ్‌ను రద్దు చేశారు.

 మూడో వన్డే:

మూడో వన్డే:

నవంబర్‌ 16, 2014లో కోహ్లీ నేతృత్వంలోని భారత్ 3 వికెట్ల తేడాతో లంకపై విజయం సాధించింది. ఐదు మ్యాచ్‌ల వన్డే సిరిస్‌ను ఈ మ్యాచ్‌తో క్లీన్‌స్వీప్‌ చేసింది. లంక 286/8 స్కోరు చేయగా.. కెప్టెన్‌ కోహ్లీ (139) సెంచరీతో రాణించడంతో భారత్ 7 వికెట్లు కోల్పోయి మరో 8 బంతులు మిగిలి ఉండగానే గెలిచింది.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+