Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రాంచీ వన్డే: కోహ్లీ మెరుగైన రికార్డు, గెలుపు భారత్‌దే!

జార్ఖండ్: ఐదు వన్డేల సిరిస్‌లో భాగంగా భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య నాలుగో వన్డే రాంచీలో బుధవారం జరగనుంది. మూడో వన్డేలో కోహ్లీ అజేయ సెంచరీతో చెలరేగడంతో ఈ సిరిస్‌లో 2-1తేడాతో భారత్ ముందంజలో ఉంది. జార్ఖండ్‌ స్టేట్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (జేఎస్‌సీఏ) స్టేడియంలో ఇదే జోరుని కొనసాగించాలని టీమిండియా ఊవిళ్లూరుతుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

నాలుగో వన్డే జరగనున్న రాంచీలో టీమిండియాకు మంచి రికార్డు ఉంది. ఇప్పటివరకు రాంచీలో టీమిండియా మూడు మ్యాచ్‌లు ఆడగా రెండింటిలో గెలిచింది. ఈ సిరిస్‌లో ఎంతో కీలకం కానున్న రాంచీ మ్యాచ్ ధోనిసేనకు కలిసొచ్చేలాగా ఉంది. అంతేకాదు రాంచీలో కోహ్లీకి మెరుగైన రికార్డు ఉంది.

తొలి వన్డే
జనవరి 19, 2013లో భారత్-ఇంగ్లండ్‌ మధ్య రాంచీలో తొలి మ్యాచ్‌ జరిగింది. ధోని నేతృత్వంలోని టీమిండియా 7 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్‌పై విజయం సాధించింది. తొలుత జడేజా (3/19), ఇషాంత్ (2/29), అశ్విన్‌ (2/37) వికెట్లు తీయడంతో ఇంగ్లాండ్ 42.2 ఓవర్లలో 155 పరుగులకే ఆలౌటైంది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన విరాట్‌ కోహ్లీ (77 నాటౌట్‌) చెలరేగడంతో భారత్ 3 వికెట్లు కోల్పోయి 28.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది.

India v New Zealand, 4th ODI: Ranchi ODI ticket details

మూడో వన్డేలో సచిన్ రికార్డుని బద్దలు కొట్టిన ధోని

రెండో వన్డేకి వర్షం అడ్డంకి
ఇక అక్టోబర్‌ 23, 2013లో భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన మ్యాచ్‌కి వర్షం అడ్డింకిగా మారింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌ చేసిన ఆసీస్‌ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 295 పరుగులు చేసింది. కెప్టెన్‌ జార్జ్‌ బెయిలీ (98), మాక్స్‌వెల్‌ (92) అర్ధ సెంచరీలతో రాణించారు. 296 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 4.1 ఓవర్లలో 27/0 పరుగులు చేయగా వర్షం అడ్డంకిగా మారింది. దీంతో అంఫైర్లు మ్యాచ్‌ను రద్దు చేశారు.

మూడో వన్డే:
నవంబర్‌ 16, 2014లో కోహ్లీ నేతృత్వంలోని భారత్ 3 వికెట్ల తేడాతో లంకపై విజయం సాధించింది. ఐదు మ్యాచ్‌ల వన్డే సిరిస్‌ను ఈ మ్యాచ్‌తో క్లీన్‌స్వీప్‌ చేసింది. లంక 286/8 స్కోరు చేయగా.. కెప్టెన్‌ కోహ్లీ (139) సెంచరీతో రాణించడంతో భారత్ 7 వికెట్లు కోల్పోయి మరో 8 బంతులు మిగిలి ఉండగానే గెలిచింది.

India v New Zealand, 4th ODI: Ranchi ODI ticket details

రాంచీలో కోహ్లికి మెరుగైన రికార్డు:
రాంచీలో ఆడిన మూడు వన్డేల్లో ఈ మ్యాచ్ అత్యధికంగా 216 పరుగులు సాధించాడు. అందులో ఒక సెంచరీ, అర్ధ సెంచరీ ఉన్నాయి.ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ బెయిలీ-మాక్స్‌వెల్‌ ఐదో వికెట్‌కు 153 పరుగులు నెలకొల్పారు. ఇక్కడ ఇదే అత్యుత్తమ భాగస్వామ్యం.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+