For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మూడో వన్డేలో సచిన్ రికార్డుని బద్దలు కొట్టిన ధోని

By Nageshwara Rao

హైదరాబాద్: మొహాలి వేదికగా భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న మూడో వన్డేలో పరిమిత ఓవర్ల కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని రికార్డుల మీద రికార్డులు సృష్టించాడు. ఇప్పటికే ఈ మ్యాచ్‌లో ధోని 9000వేల పరుగుల మైలురాయిని చేరుకున్న సంగతి తెలిసిందే.

9000: ధోని ఖాతాలో మరో రికార్డు, 5వ ఆటగాడిగా గుర్తింపు

న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఈ వన్డేలో 91 బంతులను ఎదుర్కొన్న ధోని 80 పరుగులు (6 ఫోర్లు, 3 సిక్సులు) చేసి పెవిలియన్‌కు చేరాడు. ఈ మ్యాచ్‌లో ధోని మూడు భారీ సిక్స్‌లు కొట్టి అరుదైన రికార్డుని నమోదు చేశాడు. వన్డేల్లో భారత్ తరుపున అత్యధిక సిక్సులు కొట్టిన బ్యాట్స్‌మెన్‌గా సరికొత్త రికార్డు సృష్టించాడు.

MS Dhoni surpasses Sachin Tendulkar in hitting most ODI sixes

అంతకుముందు వన్డేల్లో క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న 195 సిక్స్‌ల రికార్డును ఈ మ్యాచ్‌లో ధోనీ అధిగమించాడు. ఈ మ్యాచ్‌లో ధోని మూడు సిక్స్‌లతో 196 సిక్స్‌లు నమోదు చేశాడు. కాగా, అంతర్జాతీయ క్రికెట్‌లో అందరికంటే ఎక్కువగా పాకిస్థాన్ ఆటగాడు షాహిద్ అఫ్రిదీ 351 సిక్స్‌లతో నెంబర్ వన్ స్థానంలో ఉన్నాడు.

ఎవరికి అందనంత ఎత్తులో: ధోని ఖాతాలో మరో వరల్డ్ రికార్డు

270 సిక్సులతో రెండో స్థానంలో శ్రీలంక మాజీ ఆటగాడు సనత్ జయసూర్య ఉన్నాడు. ఆ తర్వాతి స్థానంలో 238 సిక్సులతో వెస్టిండిస్ క్రికెటర్ క్రిస్ గేల్ ఉన్నాడు. ఇక భారత్ తరుపున అత్యధిక సిక్సులు కొట్టి ఆటగాళ్లలో ధోని తర్వాత సచిన్ టెండూల్కర్ ఉండగా, ఆ తర్వాతి స్థానంలో సౌరభ్ గంగూలీ (189) ఉన్నారు.

Most sixes in ODIs (Top 6, as on October 23, 2016)


351 - Shahid Afridi (Pakistan)
270 - Sanath Jayasuriya (Sri Lanka)
238 - Chris Gayle (West Indies)
200 - Brendon McCullum (New Zealand)
196 - MS Dhoni (India)
195 - Sachin Tendulkar (India)

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+