Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐపీఎల్ అంకుల్‌పై బీసీసీఐ వేటు!

Pravin Tambe disqualified to take part in IPL 2020

న్యూఢిల్లీ: అప్‌కమింగ్ ఇండియన్‌ ప్రీమియర్ లీగ్‌(ఐపీఎల్‌) 2020 సీజన్ ఆడకుండా వెటరన్ స్పిన్నర్ ప్రవీణ్ తాంబే (48)పై అనర్హత వేటుపడింది. 48 ఏళ్ల వయసులో కూడా వేలంలో అమ్ముడుపోయి ఐపీఎల్ అంకుల్‌గా అందరి దృష్టిని ఆకర్షించిన ఈ ముంబై స్పిన్నర్ ఆశలపై బీసీసీఐ నీళ్లు చల్లింది.

వారికే అనుమతి..

వారికే అనుమతి..

బోర్డు నిబంధనలను ఉల్లంఘించాడనే అతడిపై ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్‌ చైర్మన్‌ బ్రిజేశ్‌ పటేల్‌ కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించినట్టు ఓ జాతీయ చానెల్ పేర్కొంది. ‘ప్రవీణ్ తాంబేను ఐపీఎల్‌లో ఆడేందుకు అనుమతించం. వన్డే, త్రీడే, ఫోర్ డే, దేశవాళీ క్రికెట్ ఆడిన ఆటగాళ్లను మాత్రమే అనుమతిస్తాం. అలాగే బీసీసీఐ, ఆయా రాష్ట్రాల క్రికెట్‌ అసోసియేషన్‌ల నుంచి నిరంభ్యంతర సర్టిఫికెట్‌ తీసుకువచ్చిన ప్లేయర్లకే ఐపీఎల్‌లో ఆడే అవకాశం ఉంటుంది'అని ఆయన స్పష్టం చేశారు.

టీ-10 లీగే కొంపముంచింది..

టీ-10 లీగే కొంపముంచింది..

గతేడాది యూఏఈలో జరిగిన టీ10 లీగే ప్రవీణ్ తాంబే కొంప ముంచింది. ఆ లీగ్ కోసం ఇంటర్నేషనల్ క్రికెట్ గుడ్ ‌బై చెప్పిన ప్రవీణ్.. సింధీస్ జట్టు తరఫున బరిలోకి దిగాడు. అయితే ఈ టోర్నీ ముగుస్తుందనగా.. తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కు తీసుకొని ముంబై టీ20 లీగ్ ఆడాడు. అనంతరం ఐపీఎల్ వేలంలో పాల్గొన్నాడు. బీసీసీఐ నిబంధనల ప్రకారం ఐపీఎల్ ఆడాలనుకునే భారత క్రికెటర్లు ఎవరైనా ప్రపంచవ్యాప్తంగా జరిగే ఇతర లీగ్‌లు ఆడవద్దు. కానీ తాంబే టీ10 లీగ్‌లో ఆడాడు. అందుకే అతనిపై బీసీసీఐ అనర్హత వేటు వేసింది.

నాతో ఆడిన అబ్బాయిలకు థ్యాంక్స్ : లేడీ సెహ్వాగ్

రూ.20 లక్షలకు కొన్న కోల్‌కతా..

రూ.20 లక్షలకు కొన్న కోల్‌కతా..

48 ఏళ్ల ప్రవీణ్‌ తాంబే‌ను ఈ సీజన్‌కు సంబంధించి జరిగిన ఐపీఎల్‌ 2020 వేలంలో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ రూ. 20 లక్షల కనీస ధరకు దక్కించుకుంది. 2013-16 మధ్య కాలంలో 33 ఐపీఎల్‌ మ్యాచ్‌లు ఆడిన తాంబే 28 వికెట్లు పడగొట్టాడు. 2014లో రాజస్థాన్‌ రాయల్స్‌ తరపున బరిలోకి దిగి 15 వికెట్లు దక్కించుకుని అందరి దృష్టిని ఆకర్షించాడు. గుజరాత్‌ లయన్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ టీమ్‌ తరపున కూడా ఆడాడు.

42 ఏళ్ల వయసులో హ్యాట్రిక్..

42 ఏళ్ల వయసులో హ్యాట్రిక్..

2014లో కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టుపై హ్యాట్రిక్ సాధించాడు. తనను తాను 20 ఏళ్ల యువకుడిగా భావించుకుంటానని గత డిసెంబర్‌లో జరిగిన ఐపీఎల్‌ వేలం తర్వాత తాంబే తెలిపాడు. యువకుడిగా మైదానంలోకి దిగుతానని.. తన అనుభవం, ఎనర్జీ కేకేఆర్‌ జట్టుకు ఉపయోగపడుతుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశాడు. తుది జట్టులోకి తీసుకోకపోయినా, తనకు ఎటువంటి బాధ్యతలు అప్పగించినా సమర్థవంతంగా నిర్వహించేందుకు సిద్ధమని ప్రకటించాడు. అయితే తాంబే స్థానంలో కేకేఆర్‌ ఎవరినీ తీసుకుంటుందో ఇంకా వెల్లడి కాలేదు.

Story first published: Thursday, February 27, 2020, 19:40 [IST]
Other articles published on Feb 27, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+