ఆ విషయంలో ధోనీ స్మార్ట్.. కోహ్లీకి ఆ ఆలోచనే లేదు: ప్రజ్ఞాన్ ఓజా

న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) చరిత్రలో చెన్నై సూపర్ కింగ్స్ సక్సెస్ ఫుల్ టీమ్ అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఆ జట్టు సాధించిన విజయాలే ఈ విషయాన్ని స్పష్టం చేస్తాయి. ఇప్పటి వరకు మూడు టైటిళ్లు(2010, 2011, 2018) నెగ్గిన ఆ జట్టు ఐదు సార్లు రన్నరప్‌గా నిలిచింది. అంతేకాకుండా ప్రతీ సీజన్‌లో ప్లే ఆఫ్‌కు చేరింది. అయితే సీఎస్‌కే ఇంతటి సక్సెస్ సాధించడానికి ఆ జట్టు సారథి మహేంద్ర సింగ్ ధోనీ మాస్టర్ మైండే కారణమని టీమిండియా మాజీ స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా తెలిపాడు.
ఐపీఎల్‌లో నెట్ రన్ రేట్‌ను మెయింటెన్ చేయడంలో ధోనీ తర్వాతే ఎవరైనా అని ఈ మాజీ స్పిన్నర్ చెప్పుకొచ్చాడు. మ్యాచ్‌లో గెలవడం సాధ్యం కాదని తెలిసినప్పుడు.. ధోనీ టార్గెట్‌కు చేరువ కావడానికి ప్రయత్నిస్తాడన్నాడు. ఇక రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) కెప్టెన్ విరాట్ కోహ్లీకి కనీసం ఈ ఆలోచన కూడా తట్టలేదని విమర్శించాడు. ప్లే ఆఫ్ చేరేందుకు నెట్ రన్‌రేట్ కీలకం అవుతుందని, ఇతర కెప్టెన్లు ధోనీని చూసి నేర్చుకోవాలని బుధవారం ఇండియా టుడేతో మాట్లాడుతూ సూచించాడు.

ఇప్పుడు తెలియదు..
‘నెట్ రన్‌రేట్ మెయింటేన్ చేయడంలో ధోనీకి సాటిలేరు. ఈ విషయంలో అతను చాలా స్మార్ట్‌గా ఉంటాడు. మ్యాచ్‌లో ఓడిపోతున్నామనిపించినప్పుడు.. గెలవడం సాధ్యం కాదని అర్థమైనప్పుడు.. టార్గెట్‌కు చేరువయ్యేందుకు ప్రయత్నించమని ఎప్పుడూ ధోనీ చెబుతుంటాడు. నెటరన్‌రేట్ ప్రభావం వెంటనే జట్టుపై పడదు. కానీ టోర్నీ కీలక దశకు చేరుకుంటున్న సమయంలో దాని ప్రభావం కచ్చితంగా తెలుస్తుంది. ఆరంభ మ్యాచ్‌ల్లో మెరుగ్గా ఆడితే బాగుండని అప్పుడు అనిపిస్తుంది.'అని ఓజా చెప్పుకొచ్చాడు.

కోహ్లీ తొందరపడ్డాడు..
ఇక సోమవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 57 రన్స్ తేడాతో చిత్తుగా ఓడిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌పై ఓజా స్పందిస్తూ ముందు ఆలోచన లేకుండా విరాట్ తొందరపడ్డాడని విమర్శించాడు. భారీ షాట్లు ఆడాలనే కోరికను పక్కనబెట్టి.. జట్టును లక్ష్యానికి చేరువ చేయడానికి కోహ్లీ ప్రయత్నించి ఉండాల్సిందని అభిప్రాయపడ్డాడు. కోహ్లీ స్థానంలో తాను ఉండి ఉంటే.. రిస్కీ షాట్లు ఆడకుండా ఉండేవాడినని ఓజా చెప్పుకొచ్చాడు.

రబడా, అశ్విన్ బౌలింగ్‌లో..
‘నేనే విరాట్ కోహ్లీ స్థానంలో ఉంటే మాములగా బ్యాటింగ్ చేసేవాడిని. రిస్కీ షాట్స్ ఆడేవాడిని కాదు. ఎందుకంటే ఆ మ్యాచ్‌లో గెలవడం అసాధ్యమని తెలిసిపోయింది. అప్పటికే పవర్ ప్లేలో మూడు వికెట్లు పడ్డాయి. రబడాకు మూడు ఓవర్లు ఉన్నాయి. అశ్విన్ రెండు ఓవర్లు వేయాల్సి ఉంది. ఈ దశలో ప్రతి ఓవర్‌కు 15 రన్స్ చేయడం అసాధ్యం. కాబట్టి చివరి వరకూ క్రీజ్‌లో ఉండి నెట్ రన్ రేట్ పెంచడానికి పెంచడానికి ప్రయత్నించే వాడిని.'అని ఓజా చెప్పుకొచ్చాడు.

గత సీజన్‌లో హైదరాబాద్..
ఇక గతేడాది 18 పాయింట్లు సాధించిన సీఎస్‌కే, ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించాయి. కానీ 12 పాయింట్లతో హైదరాబాద్, కోల్‌కతా, పంజాబ్ జట్లు నాలుగో స్థానం కోసం పోటీ పడ్డాయి. మెరుగైన నెట్ రన్ రేట్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేఆఫ్‌కు చేరుకుంది. దీన్ని బట్టే ఐపీఎల్‌లో నెట్ రన్ రేట్ ప్రభావాన్ని అర్థం చేసుకోవచ్చు. అందుకే మ్యాచ్ ఓడిపోతామని తెలిసినప్పుడు ధోనీ నెట్‌రన్‌రేట్ కోసం ప్రయత్నిస్తుంటాడని ఓజా తెలిపాడు. రాజస్థాన్ రాయల్స్‌పై ధోనీ ఆటతీరు వెనుక కారణం కూడా అదేనన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications
అదే మా కొంపముంచింది.. ఆ ఇద్దరి ఆట అదుర్స్: జోస్ బట్లర్