
మూడు మ్యాచ్‌ల్లో..
పవర్ ప్లేలో వికెట్లు కోల్పోవడమే గత మూడు మ్యాచ్‌ల్లో తమ ఓటమికి కారణమని బట్లర్ అన్నాడు. ‘గత మూడు మ్యాచ్‌ల్లో మా టాపార్డర్ విఫలమైంది. పవర్ ప్లేలోనే మూడు కీలక వికెట్లు కోల్పోయాం. ఇలాంటి పరిస్థితులతో టీ20 మ్యాచ్‌లు గెలవడం కష్టం. ఫీల్డింగ్ రిస్ట్రిక్షన్స్ కారణంగా పరుగులు రాబట్టడానికి పవర్‌ప్లేను ఉపయోగించుకోవాలి. కానీ మేం విఫలయ్యాం. టీ20 క్రికెట్‌లో ఇలాంటివి జరగడం సహజమే. ముంబైతో మ్యాచ్‌లో ఓవైపు వికెట్లు పడుతున్నా మరోవైపు నా వంతు ప్రయత్నం చేద్దామనుకున్నా. టచ్‌లోకి రావాలనుకున్నా. మిడిల్ ఓవర్లలో నిలబడటంతో పరిస్థితులు నాకు అనుకూలంగా మారాయి. ఈ ఇన్నింగ్స్‌తో నా ఆత్మవిశ్వాసం రెట్టింపు అయింది. ఈ ఉత్సాహాన్ని టోర్నీ ఆసాంతం కొనసాగిస్తా.

టాపార్డర్ చెలరేగాల్సిందే..
టోర్నీలో రాణించాలంటే టాపార్డ్ చెలరేగాలి. తొలి రెండు మ్యాచ్‌ల్లో మా టాపార్డర్ సంచలన ప్రదర్శన కనబర్చింది. అదే ప్రదర్శనను పునరావృతం చేయాల్సిన అవసరం ఉంది. తాజా మ్యాచ్‌లో ముంబై బౌలింగ్ అద్భుతంగా ఉంది. వారి బౌలింగ్‌కుక నిలబడలేకపోయాం. మా తప్పిదాలు తెలుసుకొని సరిదిద్దుకుంటాం. టాపార్డర్ రాణించి.. ఎక్కువ ఓవర్లపాటు క్రీజులో ఉంటే ఎంతటి జట్టు బౌలింగ్‌ను అయినా ఎదుర్కొవచ్చు. అలా చేస్తే బౌలర్లు కూడా ఒత్తిడికి లోనవుతారు.

కార్తీక్ త్యాగి, సూర్య సూపరో సూపర్..
యువ పేసర్ కార్తిక్ త్యాగి అపార నైపుణ్యం ఉంది. ఐపీఎల్ ఎప్పుడూ భారత్‌లోని ఇలాంటి అద్భుత ఆటగాళ్లను వెలికితీస్తుంది. అతను నెట్స్‌లోనే ఆకట్టుకున్నాడు. అరంగేట్రం కోసం చాలా కష్టపడ్డాడు. అతని ప్రదర్శన పట్ల జట్టులో ప్రతి ఒక్కరు సంతోషంగా ఉన్నారు. ఐపీఎల్‌లో అతను ఫస్ట్ వికెట్ తీయడం అద్భుతమైన క్షణం. ముంబై బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ ఫెంటాస్టిక్‌గా ఉంది. అతను ఆడే తీరు అమోఘం. మా ప్రణాళికలను అతనిపై అమలు పరచలేకపోయాం. ఈ క్రెడిట్ అంతా అతనిదే. అద్భుతంగా ఆడాడు'అని బట్లర్ చెప్పుకొచ్చాడు.

సూర్య ప్రతాపం..
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ముంబై 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' సూర్య కుమార్ యాదవ్ (47 బంతుల్లో 79 నాటౌట్; 11 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధసెంచరీతో చెలరేగగా... రోహిత్ శర్మ (23 బంతుల్లో 35; 2 ఫోర్లు, 3 సిక్సర్లు), హార్దిక్ పాండ్యా (19 బంతుల్లో 30 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. అనంతరం రాజస్తాన్ 18.1 ఓవర్లలో 136 పరుగులకే ఆలౌటైంది. జాస్ బట్లర్ (44 బంతుల్లో 70; 4 ఫోర్లు, 5 సిక్సర్లు) ఒక్కడే మెరుగైన ప్రదర్శన కనబర్చాడు. బుమ్రా (4/20) పదునైన బౌలింగ్‌లో దెబ్బ తీయగా... ప్యాటిన్సన్, బౌల్ట్‌లకు చెరో 2 వికెట్లు దక్కాయి.
సంజూ శాంసన్‌ది మళ్లీ అదే కథనా? ఈ సీజన్‌లో కూడా అదే రిపీట్ అవుతుందా?


Click it and Unblock the Notifications












