Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రోహిత్ శర్మకు బిగ్ రిలీఫ్.. 2027 వన్డే ప్రపంచ కప్‌లో హిట్ మ్యాన్ ఖాయమేనా?

టీమిండియాలో గత కొంతకాలంగా నెలకొన్న అనిశ్చితి మేఘాలు ఇప్పుడు తొలగిపోయాయి. బీసీసీఐ తీసుకున్న ఓ వ్యూహాత్మక నిర్ణయం భారత మాజీ కెప్టెన్, హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ అభిమానుల్లో సరికొత్త ఆశలను చిగురింపజేసింది. బీసీసీఐ నూతన చీఫ్ సెలెక్టర్‌గా మాజీ స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓఝాను సోమవారం అధికారికంగా ఖరారు చేసింది. ప్రజ్ఞాన్ ఓఝా రాకతో రాబోయే 2027 వన్డే ప్రపంచ కప్‌లో రోహిత్ శర్మ ఆడటం దాదాపు ఖాయమైందనే చర్చ క్రికెట్ వర్గాల్లో ఊపందుకుంది. ప్రజ్ఞాన్ ఓఝా, రోహిత్ శర్మల మధ్య దశాబ్ధ కాలానికి పైగా ఉన్న అత్యంత సన్నిహిత సంబంధాలే ఇందుకు ప్రధాన కారణం.

Asian Para Games 2026: భారత్‌కు డబుల్ ధమాకా.. ఒకే ఈవెంట్‌లో స్వర్ణం, రజతం!

Asian Para Games 2026: భారత్‌కు డబుల్ ధమాకా.. ఒకే ఈవెంట్‌లో స్వర్ణం, రజతం!

ఐపీఎల్ నుంచి అనుబంధం
రోహిత్ శర్మ, ప్రజ్ఞాన్ ఓఝా తమ ఐపీఎల్ ప్రయాణాన్ని డెక్కన్ ఛార్జర్స్ జట్టు తరఫున కలిసి ప్రారంభించి తొలిసారిగా ఆ జట్టును ఛాంపియన్‌గా నిలబెట్టడంలో కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత వీరిద్దరూ కలిసి సుదీర్ఘకాలం ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీకి ప్రాతినిధ్యం వహించి పలు ట్రోఫీలను అందించారు. మాజీ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ హయాంలో రోహిత్ శర్మ కెప్టెన్సీ నుంచి తప్పుకోవాల్సి రావడం, ఛాంపియన్స్ ట్రోఫీ విజయం తర్వాత కూడా వన్డే జట్టులో హిట్ మ్యాన్ స్థానంపై అనుమానాలు తలెత్తడం అభిమానులను ఆందోళనకు గురిచేసింది. గతంలో రోహిత్ శర్మ రిటైర్మెంట్ వార్తలు గుప్పుమన్నా, లార్డ్స్ స్టేడియంలో సెంచరీ బాది తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు.

Pragyan Ojha as BCCI Chief Selector Big Boost for Rohit Sharma 2027 ODI World Cup Hopes Full Details

అగార్కర్ కాలం ముగిసి.. ఓఝా అధ్యాయం ప్రారంభం
అజిత్ అగార్కర్ పదవీకాలం సెప్టెంబర్ 2026తో ముగియడంతో రోహిత్ శర్మ భవిష్యత్తుపై ఉన్న సగం ఆందోళనలు తీరిపోయాయి. 2027 ప్రపంచ కప్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల భాగస్వామ్యంపై గతంలో ప్రశ్నలు ఎదురైనప్పుడు అగార్కర్ వాటిని దాటవేసేవారు. అయితే ఇప్పుడు ప్రజ్ఞాన్ ఓఝా నేతృత్వంలో సెలక్షన్ కమిటీ నిర్ణయాలు తీసుకోనుంది. క్రికెట్ మైదానంలో రోహిత్ శర్మ తన ఫిట్‌నెస్‌ను కాపాడుకుంటూ ఫామ్‌ను కొనసాగించినంత కాలం 2027 ప్రపంచ కప్‌లో అతని సెలెక్షన్‌కు ఎలాంటి విఘాతం కలగదని క్రీడా విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.

IND vs ZIM: మేం గెలిచినా.. ఆ విషయంలో మెరుగవ్వాలి: స్మృతి మంధాన

Also Read

IND vs ZIM: మేం గెలిచినా.. ఆ విషయంలో మెరుగవ్వాలి: స్మృతి మంధాన

రికార్డుల రారాజు రోహిత్ శర్మ
2007లో ఐర్లాండ్‌పై వన్డే అరంగేట్రం చేసిన రోహిత్ శర్మ, సచిన్, సెహ్వాగ్, గంభీర్ వంటి దిగ్గజాల రిటైర్మెంట్ తర్వాత శాశ్వత ఓపెనర్ గా మారి భారత క్రికెట్ చరిత్రలో తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకున్నాడు. ఇప్పటివరకు 291 వన్డేలు ఆడిన రోహిత్ శర్మ 49.27 సగటుతో 12,120 పరుగులు సాధించాడు. అందులో 35 శతకాలు, 63 అర్థ శతకాలు ఉన్నాయి. వన్డేల్లో ఏకంగా 3 డబుల్ సెంచరీలు బాదడంతో పాటు అత్యధికంగా 381 సిక్సర్లు కొట్టిన రికార్డు కూడా రోహిత్ శర్మ పేరిటే ఉంది. రోహిత్ శర్మ కెప్టెన్సీలో భారత్ టీ20 ప్రపంచ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ, ఆసియా కప్ లలో విజేతగా నిలవడమే కాకుండా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్, 2023 ప్రపంచ కప్ ఫైనల్స్ కు చేరుకున్న సంగతి తెలిసిందే.

Story first published: Monday, October 19, 2026, 20:36 [IST]
Other articles published on Oct 19, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+