Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సచిన్‌ చేసిన ఆ సెంచరీకి విలువ ఉండదా? అని సెలెక్టర్‌ దుమ్ము దులిపా: మాజీ స్పిన్నర్

Piyush Chawla recalls conversation with selector criticised him for always picking wickets with googly delivery

ముంబై: ఇప్పటికే సీనియర్ ఆటగాళ్ల పట్ల సెలెక్టర్లు ప్రవర్తించే తీరుపై భారత వెటరన్ క్రికెటర్లు సురేశ్ రైనా, హర్భజన్ సింగ్, అమిత్ మిశ్రా విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. జట్టు నుంచి తొలిగించేటప్పుడు కనీసం కారణం కూడా చెప్పకపోవడం సరైన పద్దతి కాదని మండిపడ్డారు. తాజాగా ఆ జాబితాలో భారత వెటరన్ స్పిన్నర్ పియూష్ చావ్లా చేరాడు. అసలు భారత జట్టు నుంచి తనను ఎందుకు తప్పించారో కూడా అర్థం కాలేదన్నాడు.

ముఖం మీదే అనేసా..

ముఖం మీదే అనేసా..

మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా యూట్యూబ్ షో ‘ఆకాశ్ వాణీ'‌లో మాట్లాడిన ఈ వెటరన్ స్పిన్నర్ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ఈ సందర్భంగా తాను ఎక్కువగా గూగ్లీ బంతులతోనే వికెట్లు తీస్తున్నానని ఓ సెలెక్టర్ విమర్శించాడని గుర్తు చేసుకున్నాడు.

‘ఓ సెలక్టర్‌తో నేను అన్న మాటలు నాకింకా గుర్తున్నాయి. అతను నేను తీసిన వికెట్లన్నీ గూగ్లీ బంతులకే వచ్చాయని విమర్శించాడు. దీంతో కొంచెం హర్ట్ అయిన నేను..‘సచిన్ పాజీ సెంచరీ చేస్తే అందులో 60 పరుగులు స్టేట్‌డ్రైవ్‌లతో వస్తే దానికి విలువ లేకుండ పోతుందా? లేక అది సెంచరీ కాదా?'అని ఆ సెలెక్టర్ ముఖం మీదే అనేసాను. నా మాటలు అతనికి నచ్చలేదు. కానీ వికెట్ ఎలా తీసిన వికెటే కదా'అని చావ్లా చెప్పుకొచ్చాడు.

కారణం కూడా చెప్పలేదు..

కారణం కూడా చెప్పలేదు..

‘నిజాయితీగా చెప్పాలంటే నా తొలి రెండు మ్యాచ్‌(2006లో ఇంగ్లండ్‌పై, 2008లో సౌతాఫ్రికాపై)ల్లో నేను అంత బాగా రాణించలేదు. అది నాకు కూడా తెలుసు. దీంతో జట్టులో చోటు కోల్పోయినా పశ్చాత్తాపపడలేదు. కానీ నా మూడో టెస్ట్(2012 ఇంగ్లండ్‌తో)లో మాత్రం బాగా ఆడాను. అయినా నన్ను జట్టులో నుంచి తీసేయడం, కనీసం కారణం కూడా చెప్పకపోవడం బాధను కలిగించింది. ఆ తర్వాత దాని గురించి ఆలోచించడమే మానేసా. అలా చేస్తే మన ఆటను ఆస్వాదించలేం.'అని చావ్లా తెలిపాడు.

అలా ఫీలవ్వలేదు..

అలా ఫీలవ్వలేదు..

ఇక భారత్ గెలిచిన 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే వరల్డ్‌కప్ జట్లలో ఉన్న చావ్లా.. ఆ టోర్నీల్లో మాత్రం ఎక్కువగా ఆడలేదు. సీనియర్ స్పిన్నర్ హర్భజన్ సింగ్‌తో తుది జట్టులో అవకాశం దక్కలేదు. అయితే తానెప్పుడు ఈ జనరేషన్‌లో పుట్టాల్సింది కాదని బాధపడలేదని చావ్లా స్పష్టం చేశాడు.

‘నేనెప్పుడు కుంబ్లే బాయ్, భజ్జు పాతో పోల్చుకోలేదు. ఈ జనరేషన్‌లో పుట్టాల్సింది కాదని బాధపడింది కూడా లేదు. నేను జట్టులోకి వచ్చిన తర్వాత వాళ్లు కూడా ఎక్కువ రోజులు ఆడలేదు. అనిల్ బాయ్ రిటైర్ కాగా.. భజ్జు పా జట్టుకు దూరమయ్యాడు. నేను చాలా త్వరగా భారత్ తరఫున బరిలో దిగా. అలాగే సరైన జనరేషన్‌లోనే పుట్టా.

అదే నా కొంపముంచింది..

అదే నా కొంపముంచింది..

ఎలాంటి ప్రణాళికలు లేకుండానే ఆటను ప్రారంభించా. నా తొలి రంజీ సీజన్‌లో ఏడు మ్యాచ్‌ల్లోనే 35-36 వికెట్లు తీసాను. ఇలా ప్రతీ సీజన్‌లో వికెట్లు తీస్తుండటంతో నా తప్పులు తెలియలేదు. అంతర్జాతీయ స్థాయి బ్యాట్స్‌మెన్ ఆట వేరు గనుక వారిపై నా ప్రభావం చూపలేకపోయాను. వారి వికెట్లు పడగొట్టడానికి అవసరమైన ప్రణాళికలు కూడా రచించలేకపోయాను.'అని తన వైఫల్యానికి గల కారణాన్ని చావ్లా చెప్పుకొచ్చాడు.

నన్ను తేడాగా చూసినా.. గే అన్నా పట్టించుకోను: ద్యుతీ చంద్

Story first published: Thursday, July 2, 2020, 15:10 [IST]
Other articles published on Jul 2, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+