Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆసియా కప్ రద్దయిందని చెప్పడానికి గుంగూలీ ఎవరు: పాకిస్థాన్

PCB Counters Sourav Ganguly’s statement regarding Asia Cup holds no weight

న్యూఢిల్లీ: ఆసియా కప్ రద్దయిందంటూ భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ చేసిన వ్యాఖ్యల పాకిస్థాన్ క్రికెట్ బోర్డు మీడియా డైరెక్టర్ శామియుల్ హసన్ బర్నీ ఆగ్రహం వ్యక్తం చేశారు. దాదా చేసిన వ్యాఖ్యలకు ఎలాంటి విలువ లేదన్నాడు. ఆసియా కప్ భవిత్యాన్ని చెప్పాల్సింది గంగూలీ కాదని, ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) అని స్పష్టం చేశాడు. ఇలాంటి ముఖ్యమైన ప్రకటనను కేవలం ఏసీసీ అధ్యక్షుడు మాత్రమే చేయాల్సి ఉంటుందని పేర్కొన్నాడు.

దాదా మాటలకు విలువ లేదు

దాదా మాటలకు విలువ లేదు

‘గంగూలీ చేసిన వ్యాఖ్యలు ప్రొసీడింగ్స్‌పై ఎలాంటి ప్రభావం చూపవు. అతడు ప్రతీవారం ఇలాంటి వ్యాఖ్యలే చేసినా వాటికి ఏమాత్రం విలువ, యోగ్యత ఉండదు. ఆసియా కప్‌పై ఎటువంటి నిర్ణయమైనా ఏసీసీ తీసుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి ప్రకటనను ఏసీసీ అధ్యక్షుడు నజ్ముల్ హసన్ మాత్రమే చేయాలి. నాకు తెలిసినంత వరకు ఏసీసీ తదుపరి సమావేశం గురించి ఇంకా ప్రకటించాల్సి ఉంది'అని హసన్ చెప్పుకొచ్చాడు.

పీసీబీ కూడా..

పీసీబీ కూడా..

ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే గంగూలీ చేసిన ప్రకటనను పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) చీఫ్ ఎహ్‌సాన్‌ మణి కూడా అంగీకరించడం.‘వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఈ ఏడాది జరగాల్సిన ఆసియాకప్‌ 2020ని వచ్చే ఏడాదికి వాయిదా వేయాలని ఏసీసీ భావిస్తోంది. ఈ నిర్ణయం వెనుక ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేదు. ఆటగాళ్ల భద్రతను దృష్టిలో ఉంచుకొనే ఈ నిర్ణయం తీసుకున్నాం. తొలుత టోర్నీ నిర్వహించాలనుకున్నాం కానీ యూఏఈ, పాకిస్థాన్ మరియు ఇతర దక్షిణాసియా దేశాలలో వైరస్ వ్యాప్తి చాలా ఉంది. శ్రీలంక క్రికెట్ బోర్డుతో చర్చలు జరిపాం. స్వాప్ ప్రతిపాదనను ఆసియా క్రికెట్ కౌన్సిల్ అనుమతించింది. పాకిస్థాన్ 2022లో ఆసియా కప్‌కి ఆతిథ్యమిస్తుంది' అని ఎహ్‌సాన్‌ మణి తెలిపారు.

ఆసియాకప్ లేదు

ఆసియాకప్ లేదు

ఈ ఏడాది సెప్టెంబర్‌లో జరగాల్సిన ఆసియా కప్ రద్దయిందని గంగూలీ బుధవారం ప్రకటించాడు. ‘ఇప్పుడున్న పరిస్థితుల్లో భారత్ తొలుత ఏ సిరీస్ ఆడుతుందని చెప్పడం కష్టం. కరోనా వైరస్ ఎప్పుడు అంతం అవుతుందో ఎవ్వరికీ తెలియదు. కాబట్టి మనం వేచి చూడక తప్పదు. ఇప్పటికే స్టేడియాలు ఓపెన్ అయినా వైరస్ భయంతో క్రికెటర్లు వెళ్లడం లేదు. కాబట్టి భారత్‌లో క్రికెట్ రీస్టార్ట్ విషయంలో మాకు తొందరలేదు. సెప్టెంబర్‌లో జరరగాల్సిన ఆసియాకప్ రద్దయింది. కాబట్టి భారత్‌లో క్రికెట్ ఎప్పుడు మొదలవుతుందో ఇప్పుడే చెప్పలేం'అని దాదా పేర్కొన్నాడు.

ధోనీ భాయ్.. ఆ క్షణమే నీలో ఓ అన్నయ్యను చూసుకున్నా.. భావోద్వేగ లేఖతో కేదార్ విషెస్!

Story first published: Thursday, July 9, 2020, 18:46 [IST]
Other articles published on Jul 9, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+