
జాదవ్ వినూత్న విషెస్..
భారత సీనియర్ క్రికెటర్ కేదార్ జాదవ్ మాత్రం వినూత్నంగా తెలియజేసిన విషెస్.. తన సువర్ణక్షరాలతో రాసిన భావోద్వేగ లేఖ ప్రస్తుతం ధోనీ అభిమానులు ఆకట్టుకుంటుంది. ప్రతీ ఒక్కరి మనసులను కదిలిస్తుంది. సుదీర్ఘంగా ఉన్న ఆ లేఖలో ధోనీ భాయ్‌లో ఓ అన్నయ్యను చూసుకున్నానని రాసిన అక్షరాలు ప్రతీ ఒక్కరిని ఆక్షరిస్తున్నాయి.
గత కొన్నేళ్లుగా ప్రతీ సంవత్సరం కలిసే జన్మదిన వేడుకుల జరుపుకున్నామని, కరోనా కారణంగా తొలిసారి కలవలేకపోతున్నామని మొదలుపెట్టిన జాదవ్.. ఈ బర్త్‌డేకు మహీ భాయ్‌కు ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలనుకున్నాననీ తెలిపాడు.

నీ ముందు ఏది సాటి రాదు..
కానీ రెండు ప్రపంచకప్‌లు, చాంపియన్స్ ట్రోఫీ, టెస్ట్ క్రికెట్‌లో నెంబర్ వన్ స్థానాన్ని అందించిన మహీభాయ్‌కు తానేమి ఇవ్వగలనన్నాడు. ఈ ప్రపంచంలో ఎంత పెద్ద వస్తువైనా.. ధోనీ భాయ్ విలువలకు, గొప్పతనానికి సాటి రావని అనుకుంటుండగా తనకు ఓ ఆలచోన తట్టిందన్నాడు. తనతో పాటు అతని ఫ్యాన్స్ అందరి తరఫున మహీ భాయ్ మీదున్న గౌరవాన్ని ప్రేమను వ్యక్తపరిచే విధంగా ఒక లేఖ రాయాలనిపించిందన్నాడు. దీనికి మించిన బహుమతి లేదనిపించిదని రాసుకొచ్చాడు.

మనసులో పదిలంగా..
‘మహి భాయ్, నేను నా జీవితాన్ని నిన్ను మొదటి సారి టీవీలో చూసినప్పటి క్షణం నుంచి నీతో మైదానంలో ఆడే నిమిషం వరకు మొత్తం గుర్తుతెచ్చుకొలేకపోవచ్చు. కానీ నా మనసులో మాత్రం ఒక సంఘటన అలా పదిలంగా నిలిచిపోయింది. అప్పుడు 2017లో మనం మ్యాచ్ తరువాత ప్రయాణిస్తున్నాం. ఫ్లైట్‌లో నాది నీ పక్క సీట్. బాగా అలసిపోయి ఉన్నందువల్ల నేను డిన్నర్ కూడా చేయకుండానే నిద్రలోకి జారిపోయాను.

ఈ సంఘటన గుర్తు చేసుకున్న ప్రతీసారి..
నాకు మెలకువ వచ్చి చూసే సరికి నా ఎదురుగా రెండు డిన్నర్ ప్లేట్లు చూసాను. నువ్వు నిద్ర లేవడం మంచిది అయింది. నువ్వు లేచాక కలిసి తిందాం అని నీకోసమే వెయిట్ చేస్తున్నాను అని నవ్వుతూ సమాధానం ఇచ్చావ్. అప్పటి వరకు ఎప్పుడూ నాకు ఒక అన్నయ్య ఉంటే బావుండేది కదా అని అనుకునే నేను ఆ క్షణంలో నీలో ఒక అన్నయ్యను చూసుకున్నాను. నేటి వరకు ఈ సంఘటనను గుర్తు చేసుకున్న ప్రతీసారి నాకు ఒక పాట గుర్తుకొస్తుంది. మేరీ జింగీ సవారీ..'అని జాదవ్ రాసుకొచ్చాడు.
అలాగే ధోనీ గొప్పతనాన్ని వివరిస్తూ.. మరోసారి బరిలోకి దిగడం కంటే ఆనందించే విషయం మరొకటి ఉండదన్నాడు. గత పదిహేనున్నళ్లుగా మహీ భాయ్ ఆట చూశామని, అది తమక సరిపోలేదన్నాడు. తనతో సహా దేశమంతా.. మహీ బాయ్ మరొకసారి బౌండరీలు బాదడం చూడాలని కోరుకుంటుందని పేర్కొంటూ ఈ భావోద్వేగపు లేఖను కేదార్ ముగించాడు.
ఎవడ్రా అక్కడ మ్యాచ్ పెట్టింది.. ఇంగ్లండ్-వెస్టిండీస్ తొలి టెస్ట్‌పై పేలుతున్నజోకులు, మీమ్స్.!


Click it and Unblock the Notifications












