Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అందుకోసం బీసీసీఐ వెంట పరిగెత్తం: పాక్ క్రికెట్ బోర్డు

PCB chairman Ehsan Mani Says Not going to be running after BCCI to play cricket

కరాచీ: భారత్‌తో ద్వైపాక్షిక సిరీస్ ఆడేందకు తాము సిద్దంగా ఉన్నామని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) చైర్మన్ ఎహ్‌సన్ మణి తెలిపారు. అయితే ఇరు జట్ల మధ్య క్రికెట్‌ సంబంధాలు బలపడడానికి తాము బీసీసీఐ వెంట పరిగెత్తమని స్పష్టం చేశాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. పాకిస్థాన్‌ క్రికెట్‌కు సంబంధించిన అనేక విషయాలపై చర్చించాడు. పాకిస్థాన్‌ జట్టు ప్రస్తుత ఇంగ్లండ్‌ పర్యటన నుంచి భారత్‌-పాక్‌ ద్వైపాక్షిక క్రికెట్‌పైనా స్పందించాడు. ఈ సందర్భంగా పాక్‌ యువ పేసర్‌ నసీమ్‌ షాను ప్రశంసించాడు. అతడు బాగా ఆడుతున్నాడని, శ్రీలంకపై మంచి ప్రదర్శన చేశాడని మెచ్చుకున్నాడు.

మేం బతిమాలం..

మేం బతిమాలం..

ఇక భారత్‌-పాక్‌ క్రికెట్‌ గురించి మాట్లాడిన ఎహ్‌సన్‌.. 2003లో తాను ఐసీసీ ఛైర్మన్‌గా ఉన్నప్పుడు ఇరు దేశాల మధ్య క్రికెట్‌ సంబంధాలు బలపడడానికి భారత దేశ మంత్రులతో చర్చించానని చెప్పాడు. ఆ పదవిలో కూర్చున్నాక తన తొలి సమావేశం ముంబైలో జరిగిందని, అప్పుడు భారత్‌-పాక్‌ మధ్య క్రికెట్‌ గురించి ప్రస్తావిస్తే వారి నుంచి సరైన సమాధానం రాలేదని చెప్పాడు. టీమిండియాతో ఆడడానికి తామెప్పుడూ సిద్ధంగా ఉన్నామని, ఇదే విషయాన్ని బీసీసీఐ దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు తెలిపాడు. ఇప్పుడీ విషయంపై బీసీసీఐ వెనుక పరిగెత్తమని, వాళ్లెప్పుడు ఆడాలని ముందుకు వస్తే అప్పుడు సిద్ధంగా ఉంటామని పేర్కొన్నాడు. కాగా, కొద్ది రోజుల క్రితమే మణి ఓ మీడియాతో మాట్లాడుతూ భారత్‌-పాక్‌ మధ్య ద్వైపాక్షిక క్రికెట్‌ జరిగితే అది ప్రపంచ క్రికెట్‌కు మంచిదని తెలిపాడు.

శశాంక్ కుట్ర అది..

శశాంక్ కుట్ర అది..

ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2020 సీజన్ నిర్వహణ కోసం టీ20 ప్రపంచకప్ వాయిదా వేసారని పాకిస్థాన్ మాజీ క్రికెటర్లు షోయబ్ అక్తర్, రషీద్ లతీఫ్ చేసిన వ్యాఖ్యలను ఆ దేశ మాజీ ఆటగాడు బసిత్ అలీ తప్పుపట్టాడు.‘టీ20 ప్రపంచకప్ వాయిదా విషయంలో బీసీసీఐ పాత్ర లేదు. ఐసీసీ మాజీ ఛైర్మన్ శశాంక్ మనోహర్ కారణంగా వాయిదా ప్రకటన ఆలస్యమైంది. టీ20 ప్రపంచకప్ ప్రారంభ తేదిలకు ఒక నెలముందు వాయిదా ప్రకటన చేయాలని ప్రణాళికలు రచించాడు. అలా చేస్తే బీసీసీఐ ఐపీఎల్ నిర్వహించలేదని కుట్ర పన్నాడు. భారత అభిమానులకు ఇది నచ్చకపోవచ్చు. కానీ ఇదే సత్యం.'అని తెలిపాడు

అండగా నిలిచింది బీసీసీఐ..

అండగా నిలిచింది బీసీసీఐ..

ఇక వచ్చే ఏడాది జరగాల్సిన టీ20 ప్రపంచకప్ విండో మారడానికి పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు అండగా నిలిచింది బీసీసీఐనే అని బసిల్ తెలిపాడు. ‘గత సోమవారం జరిగిన ఐసీసీ కార్యవర్గ సమావేశంలో టీ20 ప్రపంచకప్ వాయిదా పడితే వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చి విండోలా నిర్వహించాలనుకున్నారు. అయితే దీనికి పీసీబీ అంగీకరించలేదు. ఆ సమయంలో తమకు పీఎస్ఎల్ ఉంటుందని తాము ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోమని చెప్పింది.

ఆ సమయంలో పీసీబీకి అండగా బీసీసీఐ వాదించింది. ఓ లీగ్‌ను విత్‌డ్రా చేసుకోవడం ఆశమాషి వ్యవహారం కాదని తెలిపింది. ఆ తర్వాత ఈసీబీ కూడా పాక్ బోర్డుకు ఫేవర్‌గా మాట్లాడింది. దీంతో వెనక్కు తగ్గిన ఐసీసీ అక్టోబర్-నవంబర్ విండోకు మార్చింది. అయితే ఆస్ట్రేలియా-న్యూజిలాండ్‌లలో ఈ మెగాటోర్నీని నిర్వహించాలనే ఉద్దేశంతో ఐసీసీ ఫిబ్రవరి-మార్చిలో నిర్వహించాలనుకుంది.'అని బసిత్ అలీ చెప్పుకొచ్చాడు. అయితే పీసీబీకి బీసీసీఐ సాయం చేయడం చూస్తుంటే త్వరలో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు జరిగే అవకాశం ఉందని మాజీ క్రికెటర్లు, అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

నేను బొద్దుగా లేకుంటే మా అమ్మ నాకేదో అయిందనుకుంటది: విరాట్ కోహ్లీ

Story first published: Friday, July 24, 2020, 17:26 [IST]
Other articles published on Jul 24, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+