
తుది నిర్ణయం తీసుకోలేదు..
‘నేనింకా తుది నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుత అనిశ్చితిలో చాలా మంది ఎక్కువ సమయాన్ని బయో బబుల్స్‌లోనే గడుపుతున్నారు. అందువల్ల మేమంతా ఒక్క చోటుకి చేరినప్పుడు అన్ని విషయాలపై ఓపెన్‌గా మాట్లాడుకుంటున్నాం. రాబోయే రెండు మూడు నెలల్లో ప్లేయర్లంతా చాలా బిజీగా ఉంటారు. కాబట్టి ఈ సమ్మర్‌లో వాళ్లకు తగిన విశ్రాంతి లభించదు. ఆ తర్వాత సౌతాఫ్రికా (ఫిబ్రవరి-మార్చి) టూర్ సహా వచ్చే ఏడాది మరికొన్ని ఫారిన్ టూర్స్ ఉంటాయి'అని కమిన్స్ చెప్పాడు.

మేం పట్టించుకోవడం లేదు..
సుదీర్ఘ పర్యటనలో భాగంగా ఇప్పటికే ఆసీస్ చేరుకున్న భారత ఆటగాళ్లు కఠోర సాధన చేయడం మొదలుపెట్టారు. అయితే పర్యటన మొత్తం ఒక ఎత్తైతే తొలి టెస్టు తర్వాత భారత్‌కు తిరిగి రానున్న టీమిండియా కెప్టెన్ విరాట్‌కోహ్లీపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. కోహ్లీ ఇలా పెటర్నిటీ సెలవులు తీసుకొని మిగతా మూడు టెస్టులకు గైర్హాజరవడం జట్టుకు ప్రతికూలంగా మారుతుందని పలువురు మాజీలు అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే రెండు జట్లలోని ఆటగాళ్లు విజయం తమదంటే తమదని మాటలతో మైండ్‌గేమ్ మొదలెట్టేశారు. ఈ విషయంపై తాము దృష్టి పెట్టడం లేదని కమిన్స్ స్పష్టం చేశాడు.

మాకు కలిసొచ్చేదేం లేదు..
'నిజం చెప్పాలంటే కోహ్లీ గురించి ఇప్పటికే చాలా మాట్లాడేశాం. ఫస్ట్ టెస్టు తర్వాత కోహ్లీ అందుబాటులో ఉండకపోవడం వల్ల మా విజయాల్లో పెద్దగా మార్పులు ఉండవు. అయితే టీమిండియా కోహ్లీకి బదులుగా మరో అద్భుతమైన బ్యాట్స్‌మన్‌ని ఎంచుకోవాల్సి ఉంటుంది. తుది జట్టులోకి రావడానికి ప్రయత్నిస్తున్న వారికి ఇది అవకాశంగా మారొచ్చు. ఇది మరో క్రికెటర్ కెరీర్ ప్రారంభించడానికి ఉపయోగపడొచ్చు' అని కమిన్స్ పేర్కొన్నాడు.

రెండేళ్ల కిందట అదరగొట్టారు..
రెండేళ్ల కిందట ఆసీస్ పర్యటనకు వచ్చిన భారత్ అద్భుతంగా రాణించిందని కమిన్స్ గుర్తు చేశాడు. టెస్ట్ ఛాంపియన్‌షిప్‌కు సంబంధించి రెండు జట్లకు ఈ టెస్టు సీరిస్ చాలా ముఖ్యమైనదని పేర్కొన్నాడు. ఈ సుదీర్ఘ పర్యటనలో ఆతిథ్య ఆసీస్‌తో భారత్ మూడు వన్డేలు, మూడు టీ20లు, నాలుగు టెస్టుల్లో తలపడనుంది. నవంబర్ 27న వన్డే మ్యాచ్‌తో ఈ లాంగ్ టూర్ షురూ కానుంది.
IPL 2021: కొత్త జట్టు రేసులో ఆ ముగ్గురు.. మెగా వేలం ఎప్పుడంటే..?


Click it and Unblock the Notifications












