IPL 2021: కొత్త జట్టు రేసులో అదానీ, గోయెంకా, మోహన్‌లాల్.. మెగా వేలం ఎప్పుడంటే..?

హైదరాబాద్: విపత్కర పరిస్థితుల నడుమ దుబాయ్ వేదికగా ఐపీఎల్ 2020 సీజన్‌ను నిర్వహించడంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) గ్రాండ్‌సక్సెస్ అయింది. లీగ్ ఆరంభానికి ముందు కరోనా కలవర పెట్టినా.. ఆ తర్వాత అంతా సాఫీగా సాగిపోయింది. ఢిల్లీతో జరిగిన తుది పోరులో నెగ్గిన ముంబై ఇండియన్స్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఈ విజయోత్సాహంతో వచ్చే ఏడాది ఐపీఎల్ కోసం బీసీసీఐ సన్నద్ధమవుతుంది. ఐపీఎల్ బ్రాండ్ విలువను మరింత పెంచేందుకు లీగ్‌లో తొమ్మిదో జట్టుకు చోటు కల్పించాలని బీసీసీఐ దాదాపు ఓ నిర్ణయానికి వచ్చింది.
ఈ నేపథ్యంలో కొత్త ఫ్రాంచైజీని ఎవరు దక్కించుకుంటారనే విషయమై చర్చలు ఊపందుకున్నాయి. లక్నో, కాన్పూర్, పుణే సిటీల పేర్లూ వినిపిస్తున్నా.. ఏదైనా అనూహ్య పరిణామాలు సంభవిస్తే తప్ప కాబోయే కొత్త ఫ్రాంచైజీ అహ్మదాబాద్ అనేది దాదాపు ఖాయమే.

ప్రధాన పోటీ ఇద్దరి మధ్యే..
గౌతమ్ అదానీకి చెందిన అదానీ గ్రూప్, సంజీవ్ గోయెంకా ఆధ్వర్యంలోని ఆర్‌పీఎస్‌జీ కొత్త ఐపీఎల్ జట్టు రేస్‌లో ప్రధానంగా ఉన్నాయి. ఐపీఎల్‌లో జట్టును సొంతం చేసుకోవాలన్న ఆకాంక్షను అదానీ గతంలో బహిరంగంగానే ప్రకటించారు. ప్రపంచంలో అతిపెద్ద క్రికెట్ స్టేడియం అహ్మదాబాద్‌లో ఉండడం.. ఆ నగరం ప్రధాన కేంద్రంగా ఉన్న అదానీ గ్రూప్‌నకు కలిసి రానుంది. ఇక గతంలో రెండేళ్లపాటు ఐపీఎల్‌లో ఉన్న రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్ జట్టుకు సంజీవ్ గోయెంకా యజమాని. దాంతో ఆయన కూడా కొత్త జట్టు రేస్‌లో బలంగా పోటీపడుతున్నారు.

సౌత్ స్టార్ కూడా..
వీరిద్దరుగాక.. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కూడా బరిలో ఉన్నారని ప్రచారం జరుగుతుంది. దక్షిణాదికి చెందిన బైజూస్ సంస్థతో కలిసి ఆయన రేసులో ఉండనున్నట్టు తెలుస్తోంది. దుబాయ్‌లో జరిగిన ఐపీఎల్ ఫైనల్‌కు హాజరవడం.. బీసీసీఐ అధికారులతో మోహన్‌లాల్ సన్నిహితంగా మెలగడం.. లీగ్‌లో జట్టును కొనుగోలు చేసే ప్రయత్నాల్లో ఆయన ఉన్నారన్న వార్తలకు బలం చేకూర్చింది. అలాగే కేరళకు చెందిన ఓ రిపోర్టర్ మోహన్‌లాల్ కొత్త టీమ్ కొనుగోలు చేయనున్నాడని ట్వీట్ చేయడం కూడా చర్చనీయాంశమైంది.

డిసెంబర్‌లో నిర్ణయం..
అసలు కొత్త జట్టు ఆలోచన గురించే బీసీసీఐ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఈ ఆలోచనను బోర్డు అమలు చేయాలంటే.. 2021 సీజన్ మెగా వేలానికి కూడా బీసీసీఐ సన్నద్ధం కావాల్సి ఉంటుంది. కొత్త జట్టుతోపాటు పూర్తిస్థాయి వేలానికి సంబంధించి డిసెంబర్ రెండో వారంలో నిర్ణయం తీసుకోనున్నట్టు ప్రస్తుత ఫ్రాంచైజీలకు బీసీసీఐ ఇప్పటికే సమాచారం అందించినట్టు తెలుస్తోంది. ‘సమయం తక్కువగానే ఉంది. కానీ లీగ్‌లోని అందరి ప్రయోజనాలు పరిగణనలోకి తీసుకొని మెగా వేలానికి వెళ్లాల్సి ఉంటుంది'అని బోర్డు అధికారి ఒకరు తెలిపారు. అనుకున్నది అనుకున్నట్టు జరిగితే డిసెంబరు చివరి వారం లేదా జనవరిలో మెగా వేలం జరిగే అవకాశం ఉంది.

సీఎస్‌కేకు ఊరట..
13వ ఐపీఎల్‌లో తీవ్రంగా నిరాశ పరిచిన చెన్నై సూపర్ కింగ్స్ మెగా వేలానికి ఎదురు చూస్తోంది. జట్టును పునర్నిర్మించాలని భావిస్తున్న ఆ ఫ్రాంచైజీకి పూర్తిస్థాయి వేలం అత్యంత కీలకం. తదుపరి వేలంపై బీసీసీఐ తీసుకొనే నిర్ణయంపై తమ జట్టు ప్రక్షాళన ఆధారపడి ఉంటుందని లీగ్ చివరి మ్యాచ్ అనంతరం సీఎస్‌కే కెప్టెన్ ధోనీ చెప్పడం గమనార్హం. ఒక్క చెన్నైయే కాదు..పంజాబ్, రాజస్థాన్, బెంగళూరు, హైదరాబాద్ జట్లు కూడా మెగా వేలంకోసం ఆసక్తిగా చూస్తున్నాయి. మరోవైపు ఈ మెగా వేలంపై ఫ్రాంచైజీలలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, రాజస్థాన్ జట్లు పూర్తిస్థాయి వేలాన్ని ఆహ్వానిస్తుండగా.. ముంబై, ఢిల్లీ యాజమాన్యాలు వ్యతిరేకిస్తున్నాయి.
ఓరి నీ ఏశాలో.. ఐపీఎల్ 2020లో కూర్చొని ఇమ్రాన్ తాహిర్‌కు అలువాటైనట్లుందిగా!
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications