ధోనీ వంటి ఫినిషర్ కోసం చూస్తున్నాం.. అలాంటి ఆటగాడుంటే ఇంగ్లండ్‌పై గెలిచేవాళ్లం: ప్యాట్ కమిన్స్

సౌతాంప్టన్ : టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీపై ఆస్ట్రేలియా స్టార్ పేసర్ పాట్ కమిన్స్ ప్రశంసల జల్లు కురిపించాడు. ప్రపంచంలోనే మహీ అత్యుత్తమ ఫినీషర్ అని కొనియాడాడు. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా శుక్రవారం జరిగిన ఫస్ట్ టీ20లో ఆస్ట్రేలియా రెండు పరుగులతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. ఆ జట్టు గెలిచే అవకాశమున్నా ప్రధాన బ్యాట్స్‌మెన్ విఫలమయ్యారు. 18 బంతుల్లో 27 పరుగులు చేయలేక ఓటమికి తలవంచారు. మార్కస్ స్టోయినిస్ వంటి మేటి బ్యాట్స్‌మన్ క్రీజులో ఉన్నా జట్టును గెలిపించలేకపోయాడు.
ఈ నేపథ్యంలోనే సిడ్నీ మార్నింగ్ హెరెల్డ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కమిన్స్ ఈ ఓటమిపై స్పందిస్తూ.. ధోనీని గుర్తు చేసుకున్నాడు. మహీ ప్రపంచంలోనే అత్యుత్తమ ఫినీషరని, అతడికున్న అనుభవంతో ఆ స్థాయికి చేరాడని చెప్పాడు. తాము కూడా మహీ లాంటి ఫినీషర్ కోసం చూస్తున్నామని, అలాంటి ఆటగాడు జట్టులో ఉంటే ఇంగ్లండ్‌తో గెలిచేవాళ్లమన్నాడు.

మాకొక ధోనీ కావాలి...
‘జట్టులో ఈ విషయంపై చర్చించాము. ప్రాక్టీస్ సెషన్‌లోనూ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌పై శ్రద్ధ తీసుకున్నాం. అక్కడ రాణించడం అంత తేలికైన పని కాదు, ఏ జట్టుకైనా కష్టతరమే. ధోనీలాంటి ఆటగాడు అవసరం. అతను ప్రపంచంలోనే అత్యుత్తమ ఫినీషర్. ఎందుకంటే మహీకి 300-400 వన్డే మ్యాచ్‌లు ఆడిన అనుభవం ఉంది. ఈ విషయంపై మా సెలెక్టర్లు, కెప్టెన్ కూడా చర్చించారు. మిడిల్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేసే ఆటగాళ్లపై ప్రత్యేక దృష్టి సారించాం. అయితే, ఫలితాలు ఇప్పుడే రావు. మాకు మంచి జట్టే ఉంది. సరైన ఆటగాళ్లు ఉన్నారు. అందరూ తగినన్ని మ్యాచ్‌లు ఆడాల్సిన అవసరం ఉంది' అని పేర్కొన్నాడు.

కొత్త కొత్తగా ఉందిలే..
ఇక ఆరు నెలల తర్వాత మళ్లీ క్రికెట్ ఆడటంపై మాట్లాడుతూ కమిన్స్.. తమ ప్రదర్శనలో ఎటువంటి మార్పు రాలేదని, కాకపోత కాస్త కొత్తగా ఉందన్నాడు. ‘మా పెర్ఫామెన్స్‌లో తేడా ఉందని మాత్రం నేను అనుకోవడం లేదు. కానీ అనభవం కొత్తగా ఉంది. ప్రేక్షకులు లేకుండా ఆడటం వల్ల స్టేడియంలో సందడి లేదు. ఇది కాస్త కొత్తగా అనిపించినా కొన్ని ఓవర్ల తర్వాత అలవాటైంది. ఇంగ్లండ్ వంటి దేశంలో ఇలా క్రికెట్ అభిమానులు లేక వారు పాడే పాటలు వినకుండా ఆడటం గమ్మత్తుగా అనిపించింది.'అని కమిన్స్ చెప్పుకొచ్చాడు.
మరోవైపు ఈ సిరీస్‌లో ఇంగ్లండ్ ఇప్పటికే శుభారంభం చేయగా నేడు జరిగే రెండో టీ20లో ఆస్ట్రేలియా కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. లేదంటే సిరీస్ కోల్పోయే ప్రమాదం ఉంది. ఒకవేళ ఆ జట్టు గెలిస్తే ఇక మంగళవారం చివరి మ్యాచ్‌పై ఉత్కంఠ నెలకొంటుంది. అప్పుడు ఎవరు గెలిస్తే వారిదే సిరీస్ అవుతుంది.

నాకెలాంటి ఆందోళన లేదు..
ఇక ఐపీఎల్ 2020 సీజన్‌పై స్పందించిన ఈ ఆసీస్ పేసర్.. కరోనా నేపథ్యంలో నిర్వాహకుల ఏర్పాట్లపై ఎలాంటి ఆందోళన లేదన్నాడు. వారి ఏర్పాట్లపై పూర్తి విశ్వాసం ఉందని తెలిపాడు. ‘భద్రతా విషయంలో నాకు ఎలాంటి ఆందోళన లేదు. టోర్నీకోసం నిర్వాహకులు తీసుకుంటున్న జాగ్రత్తల గురించి విన్నాను. ఇక్కడ ఇంగ్లండ్‌లో కూడా అదే చేస్తున్నారు. ఎలాంటి ఇబ్బందులేవు. ఇక్కడున్న పరిస్థితులే యూఏఈలో ఉంటాయనుకుంటున్నా'అని కమిన్స్ అన్నాడు. ఇక కమిన్స్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్ రూ.15 కోట్లకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఈ సీజన్ కోసం జరిగిన వేలంలో భారీ ధర పలికన ఆటగాడు అతనే కావడం విశేషం.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications
Suresh Raina రీఎంట్రీ ఇవ్వనున్నాడా..? బీసీసీఐ ఏమంటోంది..?