Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

క్లార్క్ కామెంట్స్ కరెక్టే.. మాలో కొంతమందికి వర్తిస్తాయి: కమిన్స్

Pat Cummins responds on Michael Clarkes sucking up to Virat Kohli comment, It might have been a factor

హోబర్ట్: ఐపీఎల్ కాంట్రాక్టుల కోసం టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని స్లెడ్జింగ్ చేసేందుకు తమ క్రికెటర్లు భయపడ్డారన్న మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ వ్యాఖ్యల్లో కొంత నిజముందని ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తెలిపాడు. కాకపోతే ఈ కామెంట్స్ జట్టులోని ఆటగాళ్లందరికి కాకుండా కొంత మందికి మాత్రమే వర్తిస్తాయని చెప్పుకొచ్చాడు. ఇక ఆస్ట్రేలియా క్రికెట్‌లో దుమారం రేపిన క్లార్క్ వ్యాఖ్యలను ఆస్ట్రేలియా టెస్ట్ టీమ్ కెప్టెన్ టిమ్ పైన్ ఖండించగా.. వాటిలో నిజముందని కమిన్స్ తెలపడం చర్చనీయాంశమైంది.

వాస్తవమే కానీ..

వాస్తవమే కానీ..

ఐపీఎల్‌లో అత్యధిక ధర పలికిన విదేశీ క్రికెటర్ అయిన కమిన్స్ ఈ వ్యవహారంపై బీబీసీతో మాట్లాడుతూ.. ‘క్లార్క్ చెప్పిన దాంట్లో సగం నిజం ఉంది. భారత క్రికెటర్లతో, విరాట్ కోహ్లీతో దూకుడుగా వ్యవహించకపోవడం.. స్లెడ్జింగ్‌కు దూరంగా ఉండటం నిజమే. అయితే కేవలం కొందరు ఆటగాళ్లు మాత్రమే ఐపీఎల్‌లో తమకు అవకాశాలు దక్కవని భారత క్రికెటర్లతో దూకుగా ఉండలేదు. బాల్ ట్యాంపరింగ్ వివాదం తర్వాత స్లెడ్జింగ్‌తో పాటు దూకుడును తగ్గించాలని నిర్ణయం తీసుకున్నాం.

భారత్-పాక్ సిరీస్ ప్రభుత్వం నిర్ణయించాలి.. అక్తర్ కాదు: మాజీ క్రికెటర్

కోహ్లీకి మాత్రం భయపడలేదు..

కోహ్లీకి మాత్రం భయపడలేదు..

మైదానంలో విజయం ఎంత ముఖ్యమో.. ఆటలో స్నేహితులను కోల్పోకుండా ప్రవర్తించడం కూడా అవసరమే. అయితే క్లార్క్ చెప్పినట్లుగా భారత క్రికెటర్లు, ముఖ్యంగా విరాట్ కోహ్లీకి తాము భయపడటం లాంటి వ్యాఖ్యల్లో నిజం లేదు. మరోవైపు బాల్ ట్యాంపరింగ్ వివాదంలో చిక్కుకుని ప్రధాన ఆటగాళ్లు స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్ జట్టుకు దూరం కావడంతో భారత్‌ చేతిలో సొంతగడ్డపై సిరీస్‌ ఓడిపోయాం'అని కమిన్స్ గుర్తుచేశాడు. ఈ సీజన్ ఐపీఎల్ వేలంలో కోల్‌కతా నైట్ రైడర్స్ ఫ్రాంచైజీ రూ.15.5 కోట్లకు కమిన్స్‌ను దక్కించుకున్న విషయం తెలిసిందే.

అది మాస్ట్రాటజీ..

అది మాస్ట్రాటజీ..

ఇక క్లార్క్ వ్యాఖ్యలను టీమ్ పైన్ ఖండించాడు. కోహ్లీని రెచ్చగొట్టద్దనే స్ట్రాటజీతోనే అతనిపై స్లెడ్జింగ్‌కు దిగలేదన్నాడు. అంతే తప్ప ఐపీఎల్ గురించి కాదని స్పష్టం చేశాడు. ఐపీఎల్ కోసం తమ ఆటగాళ్ల విరాట్‌ను ఔట్ చేయకూడదని గానీ, అతడితో మర్యాదగా ఉన్న సందర్భాలు గానీ తన దృష్టికి రాలేదన్నాడు.

'ఐపీఎల్‌ టోర్నీతో నాకైతే పెద్దగా ప్రయోజనాలేమీ లేవు. నేను కోల్పోయేదేమీ లేదు. కానీ.. ఎప్పుడు ఆస్ట్రేలియా తరఫున టెస్టు మ్యాచ్‌ ఆడినా మా ఆటగాళ్లు అత్యుత్తమ ప్రదర్శన చేయడానికి ప్రయత్నిస్తారు. విరాట్ కోహ్లీకి బౌలింగ్‌ చేసేటప్పుడు మా బౌలర్లు ఐపీఎల్‌ కాంట్రాక్టుల గురించి ఆలోచిస్తారని నేను అనుకోను. అతని వికెట్ త్వరగా తీయడానికి ప్రయత్నిస్తారు. అందరికి వేసినట్టే బౌలింగ్ చేస్తారు' అని పైన్‌ చెప్పుకొచ్చాడు.

స్లెడ్జింగ్‌ చేయడానికి భయపడుతున్నారు..

స్లెడ్జింగ్‌ చేయడానికి భయపడుతున్నారు..

అంతర్జాతీయ క్రికెట్‌లోనే కాదు ఐపీఎల్ టోర్నీలోనూ భారత్ బలమేంటో అందరికీ తెలుసని, ఆసీస్ ఆటగాళ్లే కాకుండా దాదాపు అన్ని జట్ల ప్లేయర్లు టీమిండియాకు వ్యతిరేకంగా ఉండటానికి ఇస్టపడరని ఇటీవల క్లార్క్ వ్యాఖ్యానించాడు. భారత క్రికెటర్లపై స్లెడ్జింగ్‌కి దిగితే.. తమ ఐపీఎల్ కెరీర్ ప్రమాదంలో పడుతుందని ఆస్ట్రేలియా క్రికెటర్లు భయపడుతున్నారని, మరీ ముఖ్యంగా విరాట్ కోహ్లీ విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారని ఈ ఆసీస్ మాజీ కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.

Story first published: Friday, April 10, 2020, 15:30 [IST]
Other articles published on Apr 10, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+