అప్పుడు ఫామ్‌లో ఉన్నా సెలెక్ట్ చేయలేదు: పార్దివ్ పటేల్

న్యూఢిల్లీ: 2008 ఆస్ట్రేలియా పర్యటనకు తనను ఎంపిక చేయని సమయంలో తీవ్ర నిరాశ చెందానని భారత వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ పార్థివ్ పటేల్ తెలిపాడు. రెండో వికెట్ కీపర్ స్థానం కోసం తాను పోటీలో ఉన్నానని, అయినా ఫామ్‌లో ఉన్న తనను జట్టులోకి తీసుకోలేదన్నాడు. మాజీ పేసర్ ఆర్పీ సింగ్‌తో మంగళవారం ఇన్స్టాగ్రామ్ లైవ్‌లో పార్థివ్ మాట్లాడాడు.

చాలా నిరాశకు గురయ్యా..
‘సరైన సమయంలో జట్టులో చోటు దక్కించుకోవడం చాలా ముఖ్యం. 2008 ఆస్ట్రేలియా టూర్‌కు జట్టును ఎంపిక చేసే సమయంలో తొలి వికెట్ కీపర్‌గా ధోనీ తన స్థానాన్ని పదిలం చేసుకోవడంతో నేను రెండో వికెట్ కీపర్ స్థానానికి పోటీలో నిలిచా. అయితే ఆ సమయంలో ఎంపిక కాకపోవడంతో తీవ్ర నిరాశకు గురయ్యా. అప్పటి చీఫ్ సెలెక్టర్ దిలీప్ వెంగ్‌సర్కార్.. నాకు కాల్ చేసి.. నువ్వు మంచి ప్రదర్శన చేస్తున్నావు.. ఇలాగే కొనసాగించు అన్నారు. ఆ తర్వాత ఆస్ట్రేలియా పర్యటన కోసం నిన్ను ఎంపిక చేయడం లేదని పేర్కొన్నారని ' పార్థివ్ తెలిపాడు.
నా ఫేవరేట్ హీరో ప్రభాస్: స్టార్ క్రికెటర్

వివాదాల సిరీస్ భారత్ ఓటమి..
ఇక ఈ టూర్‌లో భారత్ 1-2 తేడాతో ఆతిథ్య జట్టు చేతిలో ఓడి సిరీస్ సమర్పించుకుంది. అయితే ఈ సిరీస్ మొత్తం వివాదాలతోనే జరిగింది. సిడ్నీ వేదికగా జరిగిన రెండో టెస్టులో హర్బజన్ సింగ్, ఆండ్రూ సైమండ్స్‌ల మధ్య చోటుచేసుకున్న మంకీ గేట్ వివాదం తీవ్ర దుమారం రేపింది.

ఆ రికార్డు పార్థీవ్‌దే..
2002లో టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన పార్థివ్ పటేల్ తన కెరీర్‌లో 25 టెస్టులు, 38 వన్డేలు ఆడాడు. అంతర్జాతీయ మ్యాచ్ బరిలోకి దిగిన పిన్న వికెట్ కీపర్‌గా (17ఏండ్ల 153రోజులు) రికార్డు సృష్టించాడు. అంతకు ముందు ఈ రికార్డు పాకిస్తాన్ వికెట్ కీపర్ హనీఫ్ మహ్మద్(17 ఏళ్ల 300 రోజులు) పేరిట ఉండేది. దీన్ని పార్థీవ్ అధిగమించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications