For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ధోనీపై నిందలేయకండి.. అతని వల్ల నాకే నష్టం జరగలేదు: పార్థివ్ పటేల్

Parthiv Patel Says It will be wrong if I seek sympathy by saying that my career was shortened because of MS Dhoni

న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్, సీనియర్ వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీ వల్ల తన క్రికెట్ కెరీర్‌కు జరిగిన నష్టం ఏం లేదని మరో సీనియర్ వికెట్ కీపర్ పార్థివ్ పటేల్ అన్నాడు. తన వైఫల్యాన్ని కప్పిపుచ్చేందుకు ధోనీని నిందించడం సరికాదన్నాడు. 35 ఏళ్ల పార్థీవ్.. 17 ఏళ్లకే అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసినా.. బ్యాటింగ్, కీపింగ్‌లో ఆశించిన స్థాయిలో రాణించలేక అంతే తొందరగా భారత జట్టులో చోటు కోల్పోయాడు. అనంతరం మహేంద్ర సింగ్ ధోనీ ఎంట్రీతో 15 ఏళ్లపాటు మరో అవకాశాన్ని అందుకోలేకపోయాడు.

ధోనీ శకంలో పుట్టాల్సింది కాదు..

ధోనీ శకంలో పుట్టాల్సింది కాదు..

ఈ నేపథ్యంలో అతని అభిమానులు, కొందరు విశ్లేషకులు ధోనీ వల్లే పార్థీవ్‌కు అవకాశాలు దక్కలేదని, అతను లేకుంటే ఈ గుజరాత్ ప్లేయర్‌కే భారత జట్టులో సుదీర్ఘకాలం ఆడే అవకాశం ఉండేదని అభిప్రాయపడుతుంటారు. అసలు ధోనీ శకంలో పార్థీవ్ పుట్టాల్సింది కూడా కాదంటారు. అయితే ఈ మాటల్లో ఏమాత్రం వాస్తవం లేదని ఇప్పటికే చాలాసార్లు చెప్పిన పార్థీవ్.. తాజాగా మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా స్పష్టం చేశాడు.

అది చాలా తప్పు..

అది చాలా తప్పు..

‘చాలా మంది నేను ధోనీ శకంలో పుట్టాల్సింది కాదని అంటుంటారు. కానీ ఈ విషయంపై ఇప్పటికే నేను చాలా సార్లు క్లారిటీ ఇచ్చా. మరోసారి చెబుతున్నా. ధోనీ కంటే ముందే నేను అంతర్జాతీయ అరంగేట్రం చేసా. అతని వల్లే సుదీర్ఘ కాలం కొనసాగాల్సిన నా అంతర్జాతీయ కెరీర్‌‌కు బ్రేక్ పడిందనడంలో ఎలాంటి అర్థం లేదు. నా వైఫల్యాన్ని కప్పిపుచ్చుకొని మహీని నిందిస్తూ సానుభూతి పొందాలనుకోవడం చాలా పెద్ద తప్పు.

 నా వల్లే ధోనీకి అవకాశం..

నా వల్లే ధోనీకి అవకాశం..

నా ప్రదర్శన టీమ్‌మేనేజ్‌మెంట్ మార్క్‌ను అందుకోలేకపోయింది అందుకే నా స్థానంలో మొదట దినేశ్ కార్తీక్, ఆతర్వాత ధోనీకి అవకాశం లభించింది. నేనే గనుక అద్భుతంగా రాణిస్తే నా స్థానాన్ని వారు భర్తీ చేసేవారేకాదు. ధోనీ శకంలో పుట్టినందుకే భారత జట్టుకు సుదీర్ఘకాలం ఆడలేకపోయాననే సానుభూతి నాకొద్దు.'అని పార్థీవ్ పటేల్ స్పష్టం చేశాడు.

టెన్నిస్ బాల్‌ను కూడా పట్టలేనా?

టెన్నిస్ బాల్‌ను కూడా పట్టలేనా?

ఇక భారత జట్టులో అవకాశం కోల్పోయినప్పుడు తనపై మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు, జర్నలిస్టులు చేసిన విమర్శలు, రాసిన రాతలతో చాలా భయపడ్డానని ఈ గుజరాత్ ఆటగాడు తెలిపాడు. చివరకు టెన్నిస్ బాల్‌ను కూడా పట్టలేనా అనే సందేహం కలిగిందన్నాడు. ‘భారత జట్టు నుంచి తప్పించినప్పుడు చాలా భయపడ్డా. ఎందుకంటే మాజీ క్రికెటర్లు, జర్నలిస్ట్‌లు నా గురించి చాలా రాసారు. వాటన్నిటిని చదివిన నాకు టెన్నిస్ బాల్‌ను కూడా అందుకోలేనా? అనే సందేహం కలిగింది. తరచూ అవే ఆలోచనలతో గడిపేవాడిని. అండర్-16 ఆటగాళ్లతో ఆడిన తర్వాత నా ఆత్మవిశ్వాసం పెరిగింది. నేను మళ్లీ క్రికెట్ ఆడగలనా? లేదా? అని తెలుసుకునేందుకే వారితో తరుచూ ఆడుతూ.. కీపింగ్, బ్యాటింగ్ చేసేవాడిని.

జీరో నుంచి స్టార్ట్ చేసా..

జీరో నుంచి స్టార్ట్ చేసా..

2004లో జట్టు నుంచి తప్పుకున్న తర్వాత.. మళ్లీ సున్నా నుంచి మొదలుపెట్టా. నా ఆటను పున:ప్రారంభించే క్రమంలో ఏ స్థాయిలో ఆడినా.. అది డిస్ట్రిక్ అయినా, క్లబ్ మ్యాచ్‌లైనా సరే క్రికెట్‌ను ఆస్వాదించాలని నా ఆంతరత్మకు ఒట్టేసి చెప్పుకున్నా.'అని పార్థీవ్ చెప్పుకొచ్చాడు. ఇక 2018 దేశవాళి క్రికెట్‌లో రాణించిన పార్దీవ్.. ఆ ఏడాది సౌతాఫ్రికా టూర్‌లో మరోసారి భారత్ తరపున బరిలోకి దిగాడు. ఇప్పటి వరకు భారత్ తరఫున 25 టెస్ట్‌లు, 38 వన్డేలు, రెండు టీ20లు ఆడిన పార్దీవ్.. టెస్ట్‌ల్లో 934, వన్డేల్లో 736, టీ20ల్లో 36 పరుగులు చేశాడు.

ఏయ్ కోహ్లీ.. నీ బౌలింగ్ చితక్కొడుతా: చహల్

Story first published: Monday, June 29, 2020, 13:26 [IST]
Other articles published on Jun 29, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+