Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఇన్నాళ్లు తొమ్మిది వేళ్లతోనే కీపింగ్ చేశా: పార్దీవ్ పటేల్

Parthiv Patel Says Feels good to represent India as keeper with nine fingers

న్యూఢిల్లీ: ఆరేళ్ల వయసులోనే తన చిటికెను వేలు కోల్పోయానని, తొమ్మిది వేళ్లతోనే కీపర్‌గా జాతీయ జట్టుకు ప్రాతినిథ్యంవహించానని భారత వెటరన్ వికెట్ కీపర్ పార్దీవ్ పటేల్ తెలిపాడు. చిన్న‌ప్పుడే త‌లుపు సందులో ఇరుక్కొని చిటికెన వేలు కట్ అయ్యిందని ఓ సిరీస్ ఇంటర్వ్యూలో ఈ వెటరన్ వికెట్ కీపర్ తాజాగా చెప్పుకొచ్చాడు. కెరీర్ ప్రారంభంలో తన చేతి వేళ్లు గ్లౌజ్‌లో సరిగ్గా సెట్ అవ్వక ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు తెలిపాడు.

టేప్ చుట్టుకొని..

టేప్ చుట్టుకొని..

‘నాకు ఆరేళ్ల వ‌య‌సున్న‌ప్పుడు ఇంటి వ‌ద్ద ఆడుకుంటున్న స‌మ‌యంలో త‌లుపు సందులో ఇరుక్కొని చిటికెన వేలు కట్ అయ్యింది. ఇక క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకున్న తొలినాళ్ల‌లో గ్లౌజ్‌లో నా విరిగిన ఫింగర్ సరిగ్గా ఫిట్ కాకపోయేది. దీంతో నా రింగ్ ఫింగర్‌కు టేప్ చుట్టి నా వేలు సెట్ అయ్యేలా చేసేవాడిని. ప్రారంభంలో కాస్త ఇబ్బందిగా అనిపించినా ఆ త‌ర్వాత అల‌వాటైపోయింది. అయితే నాకు అన్ని ఫింగర్స్ ఉంటే ఎలా ఉండేదో తెలియదు. కానీ తొమ్మిది వేళ్లతోనే భారత్‌కు ఆడ‌టం మాత్రం సంతోషంగా ఉంది.'అని పార్థివ్ అన్నాడు.

ఫామ్‌లో ఉన్న ఎంపిక చేయలేదు..

ఫామ్‌లో ఉన్న ఎంపిక చేయలేదు..

2008 ఆస్ట్రేలియా పర్యటనకు తనను ఎంపిక చేయని సమయంలో తీవ్ర నిరాశ‌కు గురయ్యానని ఈ వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్​మన్ ఇటీవల వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. మాజీ పేసర్ ఆర్పీ సింగ్​తో ఇన్​స్టాగ్రామ్ లైవ్​లో మాట్లాడుతూ.. రెండో వికెట్ కీపర్ స్థానం కోసం తాను పోటీలో ఉన్నానని, అయినా ఫామ్​లో ఉన్న తనను జట్టులోకి తీసుకోలేదన్నాడు.

సరైన సమయంలో జట్టులో చోటు దక్కించుకోవడం చాలా ముఖ్యం. 2008 ఆస్ట్రేలియా ‌టూర్‌కు జట్టును ఎంపిక చేసే సమయంలో తొలి వికెట్ కీపర్​గా ధోనీ తన స్థానాన్ని పదిలం చేసుకోవడంతో నేను రెండో వికెట్ కీపర్ స్థానానికి పోటీలో నిలిచా. అయితే ఆ సమయంలో ఎంపిక కాకపోవడంతో తీవ్ర నిరాశకు గురయ్యా. అప్పటి చీఫ్ సెలెక్టర్ దిలీప్ వెంగ్​సర్కార్.. ​నాకు కాల్ చేసి.. నువ్వు మంచి ప్రదర్శన చేస్తున్నావు.. ఇలాగే కొనసాగించు అన్నారు. ఆ తర్వాత ఆస్ట్రేలియా పర్యటన కోసం నిన్ను ఎంపిక చేయడం లేదని పేర్కొన్నారని ' పార్థివ్ గుర్తు చేసుకున్నాడు.

క్రికెట్ చరిత్రలోనే అత్యంత వివాదాస్పద మ్యాచ్.. గ్లౌజులో బంతి పెట్టుకుని..

ఆ రికార్డు పార్థీవ్‌దే..

ఆ రికార్డు పార్థీవ్‌దే..

మాజీ కెప్టెన్, సీనియర్ వికెట్ కీపర్ మ‌హేంద్ర సింగ్ ధోనీ వెలుగులోకి రాక‌ముందే పాల బుగ్గ‌ల పసిప్రాయంలో జట్టు త‌ర‌ఫున బ‌రిలో దిగిన పార్థివ్.. 25 వ‌న్డేలు, 38 టెస్టుల్లో బ‌రిలో దిగాడు. 2002లో టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన పార్థివ్ పటేల్ అంతర్జాతీయ మ్యాచ్ బరిలోకి దిగిన పిన్న వికెట్ కీపర్‌గా (17ఏండ్ల 153రోజులు) రికార్డు సృష్టించాడు. అంతకు ముందు ఈ రికార్డు పాకిస్తాన్‌ వికెట్‌ కీపర్‌ హనీఫ్‌ మహ్మద్‌(17 ఏళ్ల 300 రోజులు) పేరిట ఉండేది. దీన్ని పార్థీవ్ అధిగమించాడు. ఇక 2018-19లో ఆస్ట్రేలియాపై చారిత్ర‌క టెస్టు సిరీస్ గెలిచిన కోహ్లీసేనలో పార్థివ్ స‌భ్యుడుగా ఉన్నాడు.

Story first published: Tuesday, April 28, 2020, 14:54 [IST]
Other articles published on Apr 28, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+