Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ధోనీ vs గంగూలీ బెస్ట్ కెప్టెన్ ఎవరో చెప్పిన పార్ధీవ్ పటేల్!

Parthiv Patel Says difference between MS Dhoni and Sourav Ganguly as captains

న్యూఢిల్లీ: సౌరవ్ గంగూలీ, మహేంద్ర సింగ్ ధోనీ భారత క్రికెట్ చరిత్రలో అత్యంత విజయవంతమైన సారథులు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. గంగూలీ భారత క్రికెట్‌లో ఓ విప్లవాన్ని తీసుకురాగా.. మహీ 28 ఏళ్ల భారత చిరకాల స్వప్నాన్ని నేరవర్చడంతో పాటు ఐసీసీ టైటిళ్లన్నీ అందించాడు. తద్వార ఈ ఘనతను అందుకున్న ఏకైక కెప్టెన్‌గా చరిత్రకెక్కాడు.

అయితే ఈ ఇద్దరిలో భారత క్రికెట్‌పై అత్యంత ప్రభావం చూపిన కెప్టెన్ ఎవరనేది గత కొన్ని రోజులుగా నడుస్తున్న డిబేట్. ఇప్పటికే మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ దాదానే అత్యుత్తమ కెప్టెన్ అని తేల్చేసాడు. అంతేకాకుండా ధోనీ సారథ్యంపై విమర్శలు గుప్పించాడు. గంగూలీ కష్టపడితే ధోనీ ప్రతిఫలాలు అందుకున్నాడన్నాడు. ధోనీకి దాదా ఎక్కువ సంఖ్యలో మ్యాచ్ విన్నర్లను అందిస్తే ధోనీ మాత్రం కోహ్లీకి అలాంటి ఆటగాళ్లను అందించలేకపోయాడన్నాడు. అయితే గంభీర్ వ్యాఖ్యలపై మాజీ క్రికెటర్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. అసలు వారిద్దరికీ పోలీకే అనవసరమని ఆకాశ్ చోప్రా వంటి ఆటగాళ్లు అభిప్రాయపడ్డారు.

ఇద్దరు బెస్టే..కానీ..

ఇద్దరు బెస్టే..కానీ..

ఇక ఇదే ప్రశ్నను స్టార్ స్పోర్ట్స్ క్రికెట్ కనెక్టెడ్ షోలో పాల్గొన్న వెటరన్ వికెట్ కీపర్ పార్థీవ్ పటేల్‌ను ప్రశ్నించగా తనదైన శైలిలో బదులిచ్చాడు.‘ఈ విషయంలో ఇద్దరి కెప్టెన్ల మధ్య తీవ్ర పోటీ ఉంటుంది. ఒకరు ఐసీసీ ట్రోఫీలు అందిస్తే.. మరొకరు అద్భుతమైన జట్టును తయారు చేశారు. క్లిష్ట పరిస్థితుల్లో గంగూలీ జట్టు సారథ్యబాధ్యతలు అందుకున్నాడు. అద్భుతమైన కెప్టెన్సీతో విదేశాల్లో విజయాలందుకునే జట్టును సిద్దం చేశాడు. అంతకుముందు గెలవలేదని కాదు. కానీ ఆస్ట్రేలియాలో హెడింగ్లీ వంటి బిగ్ టెస్ట్ విజయంతో పాటు పాకిస్థాన్ గడ్డపై టెస్ట్ సిరీస్ గెలిపించాడు.

దాదాకే నా ఓటు..

దాదాకే నా ఓటు..

‘ఇక సౌతాఫ్రికా వేదికగా జరిగిన 2003 ప్రపంకప్ గురించి మాట్లాడితే.. అసలు భారత జట్టు ఫైనల్‌కు చేరుతుందని ఎవరూ కూడా ఊహించలేదు.'అని దాదా సారథ్యంలోనే అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన పార్దీవ్ చెప్పుకొచ్చాడు. ‘ఇక ధోనీ విషయానికొస్తే అతను చాలా ట్రోఫీలు అందించాడు. ఈ ఘనత సాధించిన ఏకైక సారథి కూడా మహీనే. కానీ ఈ ఇద్దరిలో ఎవరినో ఒకరిని ఎంచుకోమంటే మాత్రం దాదాకే నా ఓటు. ఎందుకంటే క్లిష్ట స్థితి నుంచి అద్భుత మైన జట్టును తయారు చేశాడు.'అని పార్దీవ్ చెప్పుకొచ్చాడు.

ధోనీ అత్యుత్తమ ప్లేయర్..

ధోనీ అత్యుత్తమ ప్లేయర్..

ఇక పాకిస్థాన్ వికెట్ కీపర్ కమ్రాన్ అక్మల్ మాత్రం భారత్ తరఫున ఆడిన అత్యుత్తమ వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ ధోనీ అని కొనియాడాడు. మహీ పెర్ఫామెన్స్, మ్యాచ్‌ను గెలిపించే సామర్థ్యం, స్థిరంగా రాణించడం అద్భుతమన్నాడు. ‘భారత జట్టు తరఫున బరిలోకి దిగిన అత్యుత్తమ బెస్ట్ వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్‌మన్ ధోనీ. భారత క్రికెట్‌కు అతను ఎన్నో సేవలందించాడు. తన ఎంటైర్ వన్డే కెరీర్‌లో 50 ప్లస్ యావరేజ్ మెయింటేన్ చేశాడు. అలాగే మ్యాచ్ విన్నింగ్ పెర్ఫామెన్స్‌తో స్థిరంగా రాణించడం చాలా కఠినం'అని ఓ యూట్యూబ్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపాడు.

నా తప్పిదాలతోనే అత్యంత వివాదాస్పదమైన టెస్ట్‌లో భారత్ ఓడింది: దిగ్గజ అంపైర్

Story first published: Sunday, July 19, 2020, 18:29 [IST]
Other articles published on Jul 19, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+