మాస్క్ తీసేసి పాక్ క్రికెటర్‌తో సెల్ఫీ.. అతనికి కరోనా అని తెలియడంతో నెత్తిపట్టుకున్న అభిమాని!

కరాచీ: చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు ఉంది ఓ పాకిస్థాన్ అభిమాని తీరు. తమ దేశానికి చెందిన క్రికెటర్‌పై ఉన్న అభిమానం అతన్ని ప్రమాదంలో పడేసింది. సదరు క్రికెటర్ నిర్లక్ష్యం ఆ అభిమాని ప్రాణాల మీదకు తెచ్చింది. ఈ విషయాన్ని సదరు అభిమానే సోషల్ మీడియా వేదికగా వెల్లడించడంతో ప్రపంచానికి తెలిసింది. ఇంతకీ విషయం ఏంటంటే.. ఇంగ్లండ్ పర్యటనకు ముందు గత జూన్‌లో పాకిస్థాన్ జట్టుకు కరోనా పరీక్షలు నిర్వహించగా.. ఏకంగా 10 మందికి కరోనా పాజిటివ్‌గా తేలిన విషయం తెలిసిందే. అందులో ఒకడైన ఫాస్ట్ బౌలర్ హారీస్ రౌఫ్ ఇప్పటికీ చికిత్స తీసుకుంటున్నా.. అతడ్ని వైరస్ మాత్రం వీడటం లేదు.

ఐదు సార్లు పాజిటివ్..
ఎంతలా అంటే..? ఇప్పటి వరకూ రౌఫ్‌కి ఆరుసార్లు కరోనా వైరస్ పరీక్షలు చేయగా ఏకంగా ఐదు సార్లు పాజిటివ్‌గా తేలింది. ఐదో సారి టెస్టులో నెగటివ్ వచ్చినా రోజుల వ్యవధిలోనే మళ్లీ పాజిటివ్‌గా వచ్చింది. దాంతో తల పట్టుకున్న పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అతని స్థానంలో గత వారం మరో ఫాస్ట్ బౌలర్ మహ్మద్ అమీర్‌ని ఇంగ్లండ్ టూర్‌కు పంపారు.
అయితే కరోనా వైరస్‌కి చికిత్స తీసుకుంటున్నా.. క్వారంటైన్ రూల్స్‌ను పదే పదే బ్రేక్ చేస్తున్నాడని హారీస్ రౌఫ్‌పై ఇటీవల ఆరోపణలు వినిపించాయి. అయితే హారీస్ రౌఫ్‌కు కరోనా పాజిటివ్ అని తెలియక తాను అతనితో సెల్ఫీ తీసుకున్నట్లు ఆ అభిమాని ట్వీట్ చేయడం ఈ ఆరోపణలకు బలం చేకూర్చింది.

వామ్మో నేను సెల్ఫీ దిగా..
హారీస్ రౌఫ్‌తో దిగిన సెల్ఫీని షేర్ చేసిన ఆ అభిమాని‘F-6లో హారీస్ రౌఫ్ కనిపించడంతో అతనితో కలిసి సెల్ఫీ దిగాను. ఆ తర్వాత అతను ఎందుకు ఇంగ్లండ్ టూర్‌కు వెళ్లలేదా? అని గూగుల్‌లో సర్చ్ చేశా. అప్పుడు తెలిసింది.. అతనికి కరోనా పాజిటివ్ అని'క్యాప్షన్‌గా పేర్కొన్నాడు. దీంతో హారిస్ రౌఫ్ తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
అయితే ఆ అభిమాని కరోనా టెస్టులు చేయించుకున్నాడా..? లేదా అనే విషయంపై మాత్రం స్పష్టత లేదు.

ఆగస్టు 5 నుంచి..
ఆగస్టు 5 నుంచి ఇంగ్లండ్, పాకిస్థాన్ మధ్య మూడు టెస్టులు, మూడు టీ20ల సిరీస్ ప్రారంభంకానుండగా.. ఈ సిరీస్ కోసం మొత్తం 29 మందితో కూడిన జట్టుని పాకిస్థాన్ గత జూన్‌లో ప్రకటించింది. అయితే.. ఇంగ్లండ్ టూర్‌కు టీమ్‌ను పంపే ముందు వారికి కరోనా వైరస్ పరీక్షలు చేయించగా.. పది మందికి పాజిటివ్‌గా తేలింది. దాంతో.. వారిని మినహాయించి మిగిలిన వారందరినీ ఇంగ్లండ్‌కు పంపిన పీసీబీ చికిత్స తర్వాత రెండు సార్లు కరోనా నెగటివ్ వచ్చిన 9 మంది క్రికెటర్లను పంపించింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications
ప్యూన్ ఉద్యోగ వేటలో అంతర్జాతీయ క్రికెటర్!