For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ప్యూన్ ఉద్యోగ వేటలో అంతర్జాతీయ క్రికెటర్!

Former India Physically Challenged Cricketer Dinesh Sain Seeks Peons Job

సోనేపట్‌: నిన్నటిదాకా అతను అంతర్జాతీయ స్థాయి క్రికెటర్‌.. ఇప్పుడేమో పొట్టకూటి కోసం ఫ్యూన్ ఉద్యోగమైనా ఇవ్వండని వేడుకుంటున్న నిరుపేద. సాధారణంగా దేశవాళీ క్రికెట్‌ మ్యాచ్‌ ఆడినా సౌకర్యవంతమైన జీవితాన్ని గడపగలిగే అవకాశమున్న ఈ రోజుల్లో.. అంతర్జాతీయస్థాయి ఆటగాడయ్యుండి పేదరికంలో మగ్గుతున్నాడా? అంటే.. ఇది నిజం. ఎందుకంటే.. అతను దివ్యాంగ క్రికెటర్‌ కాబట్టి. హరియాణా రాష్ట్రంలోని సోనేపట్‌కు చెందిన 35 ఏళ్ల దినేష్‌ సెయిన్‌ పుట్టుకతోనే పోలియో బాధితుడు. ఓ కాలు చచ్చుబడినా.. తనదైన ప్రతిభను ప్రదర్శిస్తూ జాతీయ దివ్యాంగుల జట్టులో చోటు దక్కించుకున్నాడు.

భారత కెప్టెన్‌గా..

భారత కెప్టెన్‌గా..

2011-2019 మధ్య 9 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. 2015లో బంగ్లాదేశ్ వేదికగా జరిగిన ఫైవ్ నేషన్ సిరీస్‌లో 8 వికెట్లు తీసి అత్యధిక వికెట్ల తీసిన బౌలర్‌గా గుర్తింపుపొందాడు. తన హయాంలో కొన్ని మ్యాచ్‌లకు జాతీయ జట్టు కెప్టెన్‌గా కూడా వ్యవహరించాడు. జాతీయ జట్టుకు సేవలందించినా.. దినేశ్‌కు ఆర్థిక కష్టాలు మాత్రం తీరలేదు. ప్రస్తుతం భార్య, రెండేళ్ల కుమారుడితో కలిసుంటున్న 35 ఏళ్ల దినేష్‌.. తన కుటుంబాన్ని ఆదుకునేందుకు జాతీయ డోపింగ్‌ నిరోధక సంస్థ (నాడా)లో గుమాస్తా (ప్యూన్‌) ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నాడు.

కుటుంబ పోషణకు..

కుటుంబ పోషణకు..

‘గతంలోనూ జిల్లా కోర్టులో గుమాస్తా ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నా.. ఎంపిక కాలేకపోయా. అప్పుడు ఇంటర్వ్యూ చేసిన ఆఫీసరే ఇప్పుడు చేశాడు. ఫ్యూన్ జాబ్‌కు ఎందుకు ట్రై చేస్తున్నావని ప్రశ్నించాడు. క్రికెట్ కెరీర్‌ను కొనసాగించాలని సూచించాడు. కుటుంబాన్ని పోషించడానికి నాకెలాంటి ఆదాయం లేదని, ఉద్యోగం అత్యవసరమని చెప్పా. నాకు ఏడాది కొడుకున్నాడని, వారి పోషణ కోసం ఈ ఉద్యోగం కావాలని తెలిపా.

కిరాణా షాపుతో..

కిరాణా షాపుతో..

గతంలో పోస్ట్‌మాన్ ఉద్యోగానికి కూడా అప్లే చేసా. కానీ రాలేదు. ప్రస్తుతం ఓ చిన్న కిరాణా షాపు నడిపిస్తూ జీవనాధారం పొందుతున్నా. నా కుటుంబ పోషణకు ఇది ఏమాత్రం సరిపోవడం లేదు.. ఈసారైనా ఉద్యోగం లభిస్తే ఆసరా దొరుకుతుందని ఆశిస్తున్నా.'అని ఐటీఐ క్వాలిఫికేషన్ ఉన్న దినేష్ మిడ్‌డే దినపత్రికతో మాట్లాడుతూ తన బాధను పంచుకున్నాడు.

కార్పోరేట్ కంపెనీలు ఆదుకోవాలి..

కార్పోరేట్ కంపెనీలు ఆదుకోవాలి..

కార్పోరేట్ కంపెనీలు దివ్యాంగ క్రికెటర్లకు ఉద్యోగాలివ్వాలని ఆలిండియా దివ్యాంగ క్రికెటర్ల అసోసియేషన్(ఏఐసీఏపీసీ) ప్రెసిడెంట్ కర్సన్ ఘవిర్ కోరాడు. ‘భారత్‌కు ప్రాతినిథ్యం వహించిన దివ్యాంగ క్రికెటర్లకు స్థాయికి తగ్గ ఉద్యోగాలు ఇవ్వాలి. దేశంలో ఉన్న కార్పోరేట్ కంపెనీలు ముందుకు రావాలి. మేం కూడా కార్పోరేట్ కంపెనీలను కలిసి విజ్ఞప్తి చేస్తా. కానీ ఈ విపత్కర కాలంలో ముందకొచ్చి మానవతాదృక్పథాన్ని చాలుకోవాలని కోరుతున్నా'అని కర్సన్ తెలిపారు.


ఈ సూపర్ లీగ్‌ ఎవరికన్నా అర్థమవుతుందా? ఐసీసీపై మండిపడ్డ ఇంగ్లండ్ మాజీ కెప్టెన్


Story first published: Wednesday, July 29, 2020, 9:41 [IST]
Other articles published on Jul 29, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+