
రోహిత్‌లా ఆడాలని ఉంది..
‘భారత ఓపెనర్ రోహిత్ శర్మ నాకు ఆదర్శం. అతడి బ్యాటింగ్ చాలా బాగుంటుంది. ఫార్మాట్‌తో సంబంధం లేకుండా ప్రత్యర్థి బౌలర్లపై అతడు నిర్దాక్షిణ్యాంగా విరుచుకుపడుతాడు. భవిష్యత్తులో నేను కూడా అలాగే ఆడాలనుకుంటున్నా. మూడు ఫార్మాట్లలో గేమ్‌ను అద్భుతంగా ఒడిసిపట్టుకుంటాడు.
రోహిత్ క్రీజులోకి రాగానే ముందుగా కుదురుకునేందుకు ప్రయత్నిస్తాడు. ఆ తర్వాత అర్ధ సెంచరీ, సెంచరీ, డబుల్ సెంచరీ ఇలా లక్ష్యాలు పెట్టుకుంటూ ముందుకు సాగుతాడు. తనదైన ఆటతో జట్టుకు విజయాన్నందిస్తాడు. అతను రియల్ మ్యాచ్ విన్నర్. నేను కూడా ఇలాగే పాక్ జట్టుకు మంచి ఆరంభాలు ఇవ్వాలనుకుంటున్నా'అని హైదర్ చెప్పుకొచ్చాడు.

అండర్-19 ప్రపంచకప్‌లో అదరగొట్టి..
గత కొంతకాలంగా ఆకట్టుకుంటున్న హైదర్ అలీ.. ఈ ఏడాది సౌతాఫ్రికా వేదికగా జరిగిన అండర్-19 ప్రపంచకప్‌లో భారత్‌తో జరిగిన సెమీ ఫైనల్లో హాఫ్ సెంచరీతో మెరిశాడు. తనదైన ఆటతో పీసీబీ పెద్దల దృష్టిని ఆకర్షించాడు. గతేడాది జరిగిన ఏసీసీ ఎమర్జింగ్ టీమ్స్ కప్‌లో అద్భత ప్రదర్శన కనబర్చాడు.
తన ఆటతీరుతో పీసీబీ ఎమర్జింగ్ ప్లేయర్ 2020-21 కాంట్రాక్టును అందుకున్నాడు. తాజాగా ఇంగ్లండ్ పర్యటకు ఎంపికై.. అంతర్జాతీయ అరంగేట్రానికి సిద్దమయ్యాడు.

కోహ్లీతో పోలికా...
ఇక తనను టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీతో పోల్చాడంపై హైదర్ అలీ వ్యతిరేకించాడు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. పాక్ క్రికెట్‌కు హైదర్ అలీ రూపంలో కోహ్లీ దొరికాడంటూ మాజీ క్రికెటర్ రమీజ్ రాజా చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టాడు. తనను కోహ్లితో పోల్చవద్దంటూ విన్నవించాడు. కేవలం తమ దేశానికి చెందిన బాబర్ అజామ్‌తో పోల్చితేనే బాగుంటుందన్నాడు. ‘బాబర్ అజామ్ మంచి షాట్లు ఆడతాడు. అతనిలా షాట్లు ఆడాలని అనుకుంటూ ఉంటా. ప్రాక్టీస్‌లో ఎక్కువగా బాబర్‌ను అనుకరిస్తా. అంతేకానీ కోహ్లిలా ఉండాలని అనుకోవడం లేదు. ఎవరితోనూ పోలికను పెద్దగా ఇష్టపడను.'అని హైదర్ అలీ చెప్పుకొచ్చాడు.

నెలాఖరులో ఇంగ్లండ్ పయనం..
ఆగస్టు-సెప్టెంబరు మధ్యలో ఇంగ్లండ్, పాక్ జట్ల మధ్య మూడు 3 టెస్ట్‌లు, 3 టీ20లు జరగనున్నాయి. ఇందుకోసం 29 మంది క్రికెటర్లు, 14 మంది అధికారుల పాక్ బృందం ఈ నెలాఖరులో ఇంగ్లండ్‌కు బయల్దేరనుంది. ప్రత్యేక చార్టెడ్ ఫ్లైట్‌లో పాక్ ఆటగాళ్లను తరలించనున్నారు. 14 రోజుల క్వారంటైన్ అనంతరం బయో సెక్యూర్ వాతావరణంలో పాక్ జట్టు ఔట్ డోర్ ట్రైనింగ్ మొదలుపెట్టనుంది.


Click it and Unblock the Notifications

చెనా స్పాన్సర్లతో ఐఓఏ కటీఫ్.. కుదరదన్న బీసీసీఐ!