ఒక్క మ్యాచ్ ఆడకుండానే సెమీస్‌కు చేరిన పాకిస్తాన్!
Asian Games 2026: 2026 ఆసియా క్రీడల పురుషుల క్రికెట్ పోటీల్లో ఓ వింత సంఘటన చోటుచేసుకుంది. స్టేడియంలోకి దిగి ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండానే పాకిస్తాన్ పురుషుల క్రికెట్ జట్టు సెమీస్‌లో అడుగుపెట్టింది.
అసలేం జరిగిందంటే?
జపాన్‌లోని నిషిన్ నగరంలో ఉన్న కొరోగి స్పోర్ట్స్ పార్క్ వేదికగా సోమవారం పాకిస్తాన్, హాంగ్‌కాంగ్ జట్ల మధ్య తొలి క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ జరగాల్సి ఉంది. అయితే ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా కనీసం టాస్ కూడా పడకుండానే మ్యాచ్ పూర్తిగా రద్దయింది.

పాకిస్తాన్ ఎలా అర్హత సాధించింది?
ఆసియా క్రీడల నిబంధన ప్రకారం క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ వర్షార్పణమైతే, రిజర్వ్ డే లేనందున మెరుగైన ఐసీసీ టీ20 ర్యాంకింగ్ ఉన్న జట్టును విజేతగా ప్రకటిస్తారు. ఐసీసీ అంతర్జాతీయ ర్యాంకింగ్స్ ఆధారంగా భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక జట్లకు నేరుగా క్వార్టర్ ఫైనల్స్‌లో ప్రవేశం లభించింది. గ్రూప్-బీలో రెండో స్థానంలో నిలిచి అర్హత సాధించిన హాంగ్‌కాంగ్ జట్టు, వర్షం కారణంగా మైదానంలో పోరాడే అవకాశం కూడా లేకపోవడంతో టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది.
సెమీఫైనల్ షెడ్యూల్
పాకిస్తాన్ తమ సెమీఫైనల్ మ్యాచ్‌ను అక్టోబర్ 1న ఆడనుంది. ఈ టోర్నమెంట్ కాంస్య, స్వర్ణపతకాల(ఫైనల్) పోరు అక్టోబర్ 3న జరుగుతుంది. మరోవైపు భారత్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరగాల్సిన రెండో క్వార్టర్ ఫైనల్ కూడా వర్షం ముప్పును ఎదుర్కొంటోంది. ఒకవేళ ఆ మ్యాచ్ కూడా వర్షంతో రద్దయితే అధిక ర్యాంకింగ్ కలిగిన టీమిండియా కూడా నేరుగా సెమీస్‌కు చేరుకుంటుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


