Asian Games 2026: ఎవరీ అభయ్ సింగ్? స్క్వాష్ సిల్వర్ అందించిన స్టార్ ఎవరో తెలుసా?
Asian Games 2026: 2026 ఆసియా క్రీడలలో 9వ రోజున భారత స్క్వాష్ క్రీడాకారుడు అభయ్ సింగ్ పురుషుల సింగిల్స్ విభాగంలో చిరస్మరణీయ ప్రదర్శన చేసి రజత పతకాన్ని సొంతం చేసుకున్నాడు. ఫైనల్ పోరులో మలేషియాకు చెందిన టాప్ సీడ్ క్రీడాకారుడు ఎన్గ్ ఈన్ యోవ్ తో తలపడిన అభయ్.. 0-3(9-11, 5-11, 5-11) తేడాతో ఓటమి పాలైనప్పటికీ భారత్‌కు చారిత్రాత్మక రజతాన్ని అందించాడు.
హోరాహోరీగా సాగిన ఫైనల్ పోరు
ఫైనల్ మ్యాచ్ తొలి గేమ్‌లో అభయ్ సింగ్ అద్భుతమైన టైమింగ్, యాంగిల్డ్ షాట్లతో ప్రత్యర్థికి గట్టి పోటీ ఇచ్చాడు.ఒకానొక దశలో 7-8తో వెనుకబడినప్పటికీ పోరాడినా, చివరికి మలేషియా ఆటగాడు 11-9తో తొలి గేమ్‌ను దక్కించుకున్నాడు. రెండో గేమ్‌లో ప్రారంభ ఆధిక్యం సాధించిన తర్వాత ఎన్గ్ ఈన్ యోవ్ ఒత్తిడి పెంచి 11-5తో గెలిచి 2-0 ఆధిక్యంలోకి వెళ్లాడు. ఇక మూడో గేమ్‌లో అభయ్ పుంజుకుని 4-2తో ముందంజ వేసినప్పటికీ.. ప్రత్యర్థి పుంజుకుని 11-5తో గేమ్‌తో పాటు స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు.

ఇండియాకు దక్కిన చారిత్రాత్మక విజయం
ఫైనల్లో స్వర్ణం చేజారినప్పటికీ.. టోర్నీ పొడవునా అభయ్ సింగ్ చూపిన ప్రదర్శన అత్యంత స్ఫూర్తిదాయకంగా నిలిచింది. ముఖ్యంగా సెమీఫైనల్స్ లో పాకిస్తాన్‌కు చెందిన మహమ్మద్ ఇర్ఫాన్ ను 3-0తో చిత్తు చేసి ఫైనల్‌కు చేరడం విశేషం. 2026 ఆసియా క్రీడలలో స్క్వాష్ విభాగంలో ఇండియాకు ఈ రజత పతకం ఓ ప్రధాన మైలురాయిగా నిలిచింది.
ఎవరీ అభయ్ సింగ్?
తమిళనాడులోని చెన్నైకి చెందిన 28 ఏళ్ల అభయ్ సింగ్, భారత స్క్వాడ్‌లోని అగ్రశ్రేణి ఆటగాళ్లలో ఒకడు. చిన్నతనంలోనే స్క్వాష్ పట్ల ఆకర్షితుడైన అభయ్ సింగ్.. జూనియర్ స్థాయిలో నంబర్ 1 స్థానాన్ని కైవలం చేసుకున్నాడు. పీఎస్ఏ టూర్ లో అనేక టైటిళ్లను గెలుచుకున్న అభయ్.. ఆసియా గేమ్స్, కామన్వెల్త్ గేమ్స్, వరల్డ్ టీమ్ ఛాంపియన్ షిప్‌లలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు. 2024లో ఆయన క్రీడా రంగానికి చేసిన సేవలకు గాను భారత ప్రభుత్వం అర్జున అవార్డుతో సత్కరించింది. నిలకడైన ప్రదర్శనలతో అంతర్జాతీయ స్థాయిలో భారత్ పేరును నిలబెడుతున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


