Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అక్తర్ చెప్పేది శ్రీరంగ నీతులు.. చేసేది చెత్త పనులా?

Pakistan Former Cricketer Shoaib Akhtar Trolled For Cycling In Islamabad Amid Lockdown
Shoaib Akhtar Says Criticism On Yuvraj Singh & Harbhajan Singh Is Inhuman

ఇస్లామాబాద్: గత రెండు, మూడు రోజులుగా ఏదో టాపిక్‌‌తో వార్తల్లో నిలుస్తున్న పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ సోషల్ మీడియా వేదికగా తీవ్ర ట్రోలింగ్‌కు గురయ్యాడు. కరోనా మహమ్మారి ప్రపంచాన్ని గజగజ వణికిస్తున్న తరుణంలో చాలా దేశాలు లాక్‌డౌన్ విధించిన విషయం తెలిసిందే. అయితే లాక్ డౌన్ నిబంధనలను పాటిస్తూ.. ఇళ్లలోనే ఉండాలని సెలబ్రిటీలందరూ సోషల్ మీడియా వేదికగా అభిమానులకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్తర్ కూడా గత కొన్ని రోజులుగా ఇటు సోషల్ మీడియా వేదికగా.. అటు టీవీ చానెళ్లలో మాట్లాడుతూ 'ఇంట్లోనే ఉంటూ భద్రంగా ఉండండి'అని సూచించాడు.

లాక్‌డౌన్ నిబంధనలను స్ట్రిక్ట్‌గా పాటించాలని ప్రజలకు చెప్పిన అక్తరే వాటిని ఉల్లంఘించాడు. ఇప్పుడే ఇదే అభిమానులకు తీవ్ర ఆగ్రహానికి గురిచేసింది. దీంతో వారు సోషల్ మీడియా వేదికగా ఈ రావల్పిండి ఎక్స్‌ప్రెస్‌ను ఓ ఆట ఆడుకుంటున్నారు. చెప్పేది శ్రీరంగ నీతులు.. చేసేది మాత్రం చెత్త పనులంటూ ఘాటుగా వ్యాఖ్యానిస్తున్నారు.

ఇంతకీ అక్తర్ చేసిన తప్పేంటంటే..?

లాక్‌డౌన్ వేళ ఇంట్లో ఉండాల్సిన అక్తర్ రోడ్లపైకి వెళ్లి షికార్‌ చేశాడు. జన సంచారం లేని ఇస్లామాబాద్‌ రోడ్లపై సైకిల్‌తో చక్కర్లు కొట్లాడు. పైగా తాను చేసే ఈ చక్కని పనిని తన స్నేహితుడితో వీడియో తీయించుకున్నాడు. అంతటితో ఆగకుండా సోషల్ మీడియా వేదికగా ఆ వీడియోను పంచుకొని విమర్శలపాలయ్యాడు. పైగా ఆ వీడియోకు ‘నా అందమైన ఇస్లామాబాద్ నగరంలో సైక్లింగ్ చేస్తున్నా. ఆహ్లాదకరమైన వాతవారణంలో జనసంచారం లేని రోడ్లపై నా బెస్ట్ వర్కౌట్'అని క్యాప్షన్‌గా పేర్కొన్నాడు.

అక్తర్‌ను ఆడుకున్న నెటిజన్లు..

అక్తర్‌ను ఆడుకున్న నెటిజన్లు..

ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఈ పాక్ మాజీ పేసర్‌పై విమర్శలతో విరుచుకుపడ్డారు. ‘అక్తర్‌.. ఇది నువ్వు సైక్లింగ్‌ చేయడానికి సరైన సమయం కాదు. నువ్వు కూడా చాలా మంది తరహాలో నిబంధనల్ని అతిక్రమించావ్‌. స్టేహోమ్‌.. స్టే హెల్తీ సూత్రాన్ని మరిచావ్' అని ఒకరు విమర్శించగా, ‘ నువ్వు చాలా సెల్ఫిష్‌ అక్తర్‌.. జనాలు ప్రాణాలు కోల్పోతుంటే నువ్వు ఎంజాయ్‌ చేస్తున్నావ్‌. సెలబ్రెటీలు అనేవారు ఆదర్శవంతంగా ఉండాలి. వారే మాటల్ని ప్రజలు పాటిస్తారు. మరి నువ్వు వారికి ఇచ్చే సందేశం ఏమిటి. కోవిడ్‌-19తో ప్రజలు ఇంటికే పరిమితమైతే నువ్వు ఇలా రైడ్లు చేస్తావా. ఒక రోల్‌ మోడల్‌గా ఉండాల్సిన నువ్వు.. ఈ అనవసరపు ఎంజాయ్‌మెంట్‌ ఏమిటి'అని గట్టిగానే ప్రశ్నించారు.

ఇక తనను ఆరాధ్య ధైవంగా భావించే ఫ్యాన్స్ కూడా అక్తర్ చేసిన ఈ పనిని తప్పుబట్టారు. ‘నువ్వా నా ఫేవరెట్‌ బౌలర్‌. ఇలా నిన్ను చూడటం బాధిస్తుంది. లాక్‌డౌన్‌ నిబంధనల్ని అతిక్రమించి కరోనా కట్టడికి ఎలా సహకరిస్తున్నావ్‌' అని ప్రశ్నించారు. ‘ఇప్పుడు ప్రజలంతా నిన్ను గుడ్డిగా ఫాలో అయ్యి బయటకు వస్తే పరిస్థితి ఏమిటి. వారంతా కరోనా బారిన పడాలని నీ ఆలోచనా' అని మండిపడ్డారు.

కెప్టెన్ అంటే ధోనీ.. పది మ్యాచుల్లో విఫలమైనా చోటు ఉంటుంది: ఆసీస్ మాజీ క్రికెటర్

కరోనా విరాళల కోసం..

కరోనా విరాళల కోసం..

ఇక అంతకు ముందు కరోనా విరాళల కోసం భారత్-పాక్ సిరీస్ నిర్వహించాలని అక్తర్ ప్రతిపాదించాడు. ఇక ఈ రావల్పిండి ఎక్స్ ప్రెస్ చేసిన ఈ ప్రతిపాదనపై భారత్ నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ప్రస్తుత పరిస్థితుల్లో క్రికెటర్ల ప్రాణాలు పనంగా పెట్టి మ్యాచ్‌‌లు నిర్వహించాల్సిన కర్మ భారత్‌కు పట్టలేదని టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ మండిపడగా.. అక్తర్ ప్రతిపాదన చాలా కామెడీగా ఉందని ఐపీఎల్ చైర్మెన్ రాజీవ్ శుక్లా అభిప్రాయపడ్డాడు. ఇక కపిల్ వ్యాఖ్యలకు అక్తర్ కౌంటరిస్తూ.. తన ప్రతిపాదనను సరిగ్గ అర్దం చేసుకోలేదని, అతిత్వరలోనే తన ప్రతిపాదన కార్యరూపం దాల్చుతుందని ఆశాభావం వ్యక్తం చేశాడు.

Story first published: Monday, April 13, 2020, 14:01 [IST]
Other articles published on Apr 13, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+