Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సచిన్ విధ్వంసం సృష్టించినా భారత్ ఓడింది.. కానీ కప్ గెలిచింది!!

On This Day Sachin Tendulkar summoned Desert Storm Against Australia in Sharjah

హైదరాబాద్: దిగ్గజ క్రికెటర్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగినా.. భారత్‌కు ఓటమి తప్పలేదు. అయినా ఆ ముక్కోణపు సిరీస్‌ భారతే గెలుచుకుంది. అదేంటి ఓడిన తర్వాత కప్ ఏలా గెలిచిందనుకుంటున్నారా? అయితే మీరు ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళ్లాల్సిందే.

22 ఏళ్ల క్రితం..

22 ఏళ్ల క్రితం..

సరిగ్గా 22 ఏళ్ల క్రితం ఇదే రోజు (1998, ఏప్రిల్ 22) ఆస్ట్రేలియాను సచిన్ తన విధ్వంసకర బ్యాటింగ్‌తో ఓ ఆట ఆడుకున్నాడు. దుబాయ్ వేదికగా భారత్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా మధ్య కొకకోలా షార్జాకప్‌లో భాగంగా జరిగిన ఈ మ్యాచ్‌లో మాస్టర్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 131 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సర్లతో 143 పరుగులతో వీరవిహారం చేశాడు.

కానీ తర్వాతి బ్యాట్స్‌మన్ రాణించకపోవడంతో భారత్‌కు ఓటమి తప్పలేదు. కానీ మెరుగైన రన్ రేట్ కారణంగా ఫైనల్‌కు చేరింది. నాలుగు లీగ్ మ్యాచ్‌ల్లో భారత్, న్యూజిలాండ్ చెరొక విజయమే సాధించడంతో రన్ రేట్ కీలకమైంది. దీంతో ఆసీస్‌తో జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్ భారత్ కీలకమైంది.

భారత్‌కు భారీ లక్ష్యం..

భారత్‌కు భారీ లక్ష్యం..

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 284 పరుగులు చేసింది. మైఖెల్ బెమాన్(101) సెంచరీతో చెలరేగగా.. మార్క్ వా (81) హాఫ్ సెంచరీతో రాణించాడు. అనంతరం ఆటకు ఇసుక తుఫానుతో 25 నిమిషాల అంతరాయం కలగడంతో భారత్ లక్ష్యాన్ని 46 ఓవర్లలో 276కు కుదించారు. రన్‌రేట్ మెరుగై భారత్ ఫైనల్‌కు చేరాలంటే 46 ఓవర్లలో 237 పరుగులు చేయాలి.

 ఓడినా.. రన్‌రేట్‌తో..

ఓడినా.. రన్‌రేట్‌తో..

ఇక్క‌డే స‌చిన్ త‌న విశ్వ‌రూపాన్ని చూపెట్టాడు. ఆసీస్ బౌల‌ర్లు షేన్ వార్న్‌, డామియ‌న్ ప్లె‌మింగ్, ‌మైఖెల్ కాస్ప్రోవిచ్‌లను ఓ ఆట ఆడుకున్నాడు. అతని విధ్వంసతో భారత్ గెలుస్తుందని అందరూ భావించినా.. మాస్టర్ ఔటయ్యాక పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. ఒత్తిడికి తలొగ్గిన భారత్ 46 ఓవ‌ర్ల‌లో 250 ప‌రుగులే చేసింది. కానీ రన్‌రేట్‌కు కావాల్సిన పరుగులు అప్పటికే అధిగమించడంతో ఫైనల్‌కు చేరింది.

అప్పుడు ఫామ్‌లో ఉన్నా సెలెక్ట్ చేయలేదు: పార్దివ్ పటేల్

ఫైనల్లో సచిన్ మెరవడంతో..

ఫైనల్లో సచిన్ మెరవడంతో..

ఆస్ట్రేలియాతోనే జరిగిన ఫైనల్లో సచిన్(134) మరో సెంచరీతో చెలరేగడంతో అజారుద్దీన్ నేతృత్వంలోని భారత్ షార్జాకప్‌ను ముద్దాడింది. పరుగుల వరద పారించిన సచిన్‌కు ప్లేయ‌ర్ ఆఫ్ ది సిరీస్‌ దక్కింది. ఈ సిరీస్ అనంతరం ఆసీస్ దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ స‌చిన్ వ‌ల్ల‌ త‌న‌కు నిద్ర‌లేని రాత్రులు గ‌డిపానన్నాడు.

Story first published: Wednesday, April 22, 2020, 15:40 [IST]
Other articles published on Apr 22, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+