ఏప్రిల్ 15: సచిన్, రిచర్డ్స్‌కు స్పెషల్ డే.. ఎందుకో తెలుసా?

హైదరాబాద్: క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, వీవీ రిచర్డ్స్‌కు ఏప్రిల్ 15 ప్రత్యేకమైన రోజు. తమ క్రికెట్ కెరీర్‌లో ఎన్నో మైలు రాళ్లు అందుకున్న ఈ లెజెండరీ బ్యాట్స్‌మెన్.. ఈ దినం కూడా అభిమానులకు మరవలేని జ్ఞాపకలు మిగిల్చారు. సరిగ్గా 9 ఏళ్ల క్రితం భారత దిగ్గజం ఐపీఎల్ సెంచరీ బాదితే.. 34 ఏళ్ల క్రితం విండీస్ వీరుడు టెస్ట్‌ల్లో వేగవంతమైన శతకాన్ని నమోదు చేశాడు.

సచిన్ సెంచరీ.. ముంబై ఓటమి
సరిగ్గా 9 ఏళ్ల క్రితం 2011, ఏప్రిల్ 15 మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్.. ఐపీఎల్‌లో సెంచరీ కరువును తీర్చుకున్నాడు. అప్పటికే అంతర్జాతీయ క్రికెట్‌లో సెంచరీల రారాజుగా నిలిచిన మాస్టర్.. ఐపీఎల్ మాత్రం శతకం చేయడానికి మూడేళ్లు తీసుకున్నాడు.
కొచ్చి టస్కర్స్ కేరళతో జరిగిన లీగ్ మ్యాచ్‌లో 66 బంతుల్లోనే 100 పరుగులు చేసి సచిన్ సత్తా ఏంటో తెలియజేశాడు. ఆ మ్యాచ్‌లో సచిన్‌కు డేవిస్ జాకబ్స్, అంబటి రాయుడులు మంచి సహకారం అందించారు. అయితే ఈ మ్యాచ్‌లో మంబై ఓడిపోవడం గమనార్హం. కాగా సచిన్ తన ఐపీఎల్ కెరీర్‌లో 78 మ్యాచ్‌లాడి 2334 పరుగులు చేశాడు. ఇందులో 13 అర్థ సెంచరీలు, ఒక సెంచరీ ఉన్నాయి. సచిన్ టెండూల్కర్ 2013లో ఐపీఎల్‌కు వీడ్కోలు పలికాడు.
వలస కూలీల గోస చూస్తే కడుపు తరుక్కుపోతుంది: మహ్మద్ షమీ

టెస్టుల్లో వన్డే బ్యాటింగ్..
ఇక మరొక అద్బుతం 1986లో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో చోటుచేసుకుంది. ఐదో టెస్టులో మొదటి ఇన్నింగ్స్‌లో కేవలం 26 పరుగులు చేసిన వివ్ రిచర్డ్స్ రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం పూనకం వచ్చినట్లుగా ఆడాడు. వన్డే మ్యాచ్‌ను తలపిస్తూ సాగిన ఇన్నింగ్స్‌లో 58 బంతుల్లోనే 110 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. అతని దాటికి ఇంగ్లండ్ ముంగిట 401 పరుగుల విజయలక్ష్యం వచ్చి చేరింది.

ఇంగ్లండ్ క్లీన్ స్వీప్..
అయితే విండీస్ భీకర బౌలింగ్ దాటికి 170 పరుగులకే ఆలౌట్ అయిన ఇంగ్లండ్ మ్యాచ్‌తో పాటు 0-5 తేడాతో సిరీస్ కోల్పోయింది.ఈ మ్యాచ్ తన కెరీర్‌లో ఎప్పటికి గుర్తుండిపోతుందని రిచర్డ్స్ ఇప్పటికే చాలా ఇంటర్య్వూల్లో చెప్పుకొచ్చాడు. విండీస్ దిగ్గజం తన కెరీర్ మొత్తం ఆద్యంతం దూకుడుగానే ఆడాడు.
121 టెస్టుల్లో 8540 పరుగులు చేసిన రిచర్డ్స్ వన్డేల్లో 6721 పరుగులు చేశాడు. కాగా, టెస్టుల్లో రిచర్డ్స్ వేగవంతమైన శతకం రికార్డును న్యూజిలాండ్ ఆటగాడు మెక్‌కలమ్ బద్దలుకొట్టాడు. 2016లో క్రైస్ట్‌చర్చ్ వేదికగా ఆస్ట్రేలియాపై జరిగిన టెస్టులో 54 బంతుల్లోనే మెక్‌కలమ్ శతకాన్ని పూర్తి చేసుకున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications