Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రోహిత్ సెంచరీతో చెలరేగిన వేళ.. పాక్‌ను పాతరేసిన భారత్!

On this day Rohit Sharmas belligerent 140 helps India crush Pakistan in 2019 World Cup

హైదరాబాద్: ఐసీసీ ప్రపంచకప్‌లలో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌‌పై భారత్‌దే పై చేయి. ఇప్పటి వరకూ దాయాది జట్టుతో తలపడిన అన్ని మ్యాచ్‌ల్లోనూ టీమిండియానే విజయం సాధించింది. ఇక గతేడాది ఇదే రోజు(జూన్ 16) ఇంగ్లండ్ వేదికగా జరిగిన పోరులోనూ కోహ్లీసేన అద్భుత విజయాన్నందుకుంది.హిట్‌మ్యాన్‌ రోహిత్‌శర్మ సెంచరీతో చెలరేగడంతో.. మెగాటోర్నీలో దాయాదీపై భారత్ వరుసగా ఏడు విజయాన్ని నమోదు చేసింది.

ధావన్ లేకున్నా..

ధావన్ లేకున్నా..

ఆస్ట్రేలియాతో జరిగిన తొలి మ్యాచ్‌లో గాయపడ్డా ధావన్ టోర్నీ మొత్తానికి దూరమైనా.. కేఎల్ రాహుల్‌తో కలిసి రోహిత్ ఇన్నింగ్స్ ప్రారంభించాడు. అద్భుత ప్రదర్శన ఈ ఇద్దరూ పాక్‌పై మంచి శుభారంభాన్నిఅందించారు. అనంతరం కెప్టెన్‌ కోహ్లీ ధాటిగా ఆడడంతో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ ప్రత్యర్థికి భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.

భారీ భాగస్వామ్యం..

భారీ భాగస్వామ్యం..

టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న పాక్‌ తొలుత ఫీల్డింగ్ ఎంచుకోగా బరిలోకి దిగిన భారత ఓపెనర్లు పాక్ బౌలర్లను ఓ ఆట ఆడుకున్నారు. తొలి వికెట్‌కు రోహిత్‌(140), రాహుల్‌ (57) 136 పరుగులతో భారీ భాగస్వమ్యాంతో మంచి శుభారంభాన్ని అందించారు. రియాజ్‌ బౌలింగ్‌లో రాహుల్‌ ఔటయ్యాక.. హిట్‌మ్యాన్‌తో కెప్టెన్‌ కోహ్లీ(77) జతకట్టాడు. వీళ్లిద్దరూ పాక్‌ బౌలర్లపై విరుచుకుపడ్డారు. ధాటిగా ఆడుతూ చెమటలు పట్టించారు. చివర్లో వికెట్లు కోల్పోవడంతో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లకు 336 పరుగులు చేసింది.

ఆదిలోనే షాక్..

అనంతరం భారీ లక్ష్య చేధనకు దిగిన పాకిస్థాన్‌‌కు యువ ఆల్‌రౌండర్ విజయ్‌శంకర్‌ ఆదిలోనే షాకిచ్చాడు. ఓపెనర్‌ ఇమామ్‌ ఉల్‌ హక్‌(7)ను వికెట్లముందు బోల్తా కొట్టించి పెవిలియన్‌కు పంపాడు. తర్వాత ఫఖర్‌ జమాన్‌(62), బాబర్‌ అజామ్‌(48) బాధ్యతాయుతంగా బ్యాటింగ్‌ చేస్తూ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు.

వీరిద్దరూ రెండో వికెట్‌కు సెంచరీ భాగస్వామ్యం జోడించారు.

మలుపు తిప్పిన కుల్దీప్..

117 పరుగుల వద్ద అర్ధ శతకానికి చేరువలో ఉన్న బాబర్‌ను కుల్దీప్‌ బౌల్డ్‌ చేశాడు. ఆ తర్వాత పాక్‌ 12 పరుగుల తేడాలో మరో మూడు వికెట్లు కోల్పోయింది. ఫఖర్‌(68), మహ్మద్‌ హఫీజ్‌(9), షోయబ్‌ మాలిక్‌(0) వరుసగా ఔటయ్యారు. తర్వాత పాక్‌ కెప్టెన్‌ సర్ఫరాజ్‌(12) వికెట్లు పడకుండా కాసేపు జాగ్రత్తగా ఆడాడు. చివరికి విజయ్‌ శంకర్‌ బౌలింగ్‌లో బౌల్డయ్యాడు. అప్పుడే వర్షం కురవడంతో ఆటను నిలిపివేశారు.

అనంతరం వర్షం తగ్గడంతో ఆటను 40 ఓవర్లకు కుదించి.. పాక్ లక్ష్యాన్ని 30 బంతుల్లో 136గా నిర్ధారించారు. ఇమద్‌ వసీం(46), షదబ్‌ ఖాన్‌(20) బ్యాటింగ్‌ చేసినా ఫలితం లేకపోయింది. నిర్ణీత 40 ఓవర్లో 6 వికెట్లు కోల్పోయి 212 పరుగులు మాత్రమే చేయడంతో డక్‌వర్త్‌లూయిస్‌ పద్ధతిలో భారత్‌ 89 పరుగులతో భారీ విజయాన్నందుకుంది.

అండర్‌వేర్‌లో టిష్యూ పేపర్లు పెట్టుకొని ఆడిన సచిన్!

Story first published: Tuesday, June 16, 2020, 19:41 [IST]
Other articles published on Jun 16, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+