36 ఏళ్ల క్రితం క్రికెట్ చరిత్రలో ఇదే రోజు..!!

హైదరాబాద్: సరిగ్గా 36 ఏళ్ల క్రితం ఇదే రోజు (1984, ఏప్రిల్ 13) భారత క్రికెట్ చరిత్రో ఓ చిరస్మరణీయ తేదీగా మిగిలిపోయింది. దుబాయ్ వేదికగా జరిగిన తొలి ఆసియా కప్ టైటిల్‌ను సునీల్ గావస్కర్ నేతృత్వంలో భారత జట్టు గెలుచుకుంది. అది కూడా దాయదీ పాకిస్థాన్‌తో జరిగిన ఫైనల్లో 54 పరుగులతో విజయం సాధించి తొలి టైటిల్‌ను ముద్దాడింది.
తొలి టోర్నీ.. తొలి కప్ మనదే..
భారత్, పాకిస్థాన్,శ్రీలంక మూడు దేశాలే పాల్గొన్న ఆ తొలి ఆసియాకప్‌లో 8 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచిన గావస్కర్ సేన.. ఫైనల్లో కూడా గెలిచి విజేతగా నిలిచింది. పాకిస్థాన్‌తో జరిగిన టైటిల్ ఫైట్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 46 ఓవర్లలో 4 వికెట్లకు 188 పరుగులు చేసింది. సురిందర్ కన్నా 56 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. గావస్కర్ 36 పరుగులతో పర్వాలేదనిపించాడు. అనంతరం ఛేజింగ్‌కు దిగిన పాకిస్థాన్ 40 ఓవర్లలో 134 పరుగులకే కుప్పకూలి 54 రన్స్‌తో ఓటమిపాలైంది. భారత బౌలర్లలో రోజర్ బిన్నీ, రవిశాస్త్రి మూడు వికెట్లు పడగొట్టారు.
గుర్తు చేసిన ఐసీసీ..
అయితే ఇదే విషయాన్ని గుర్తు చేస్తూ ఐసీసీ ట్వీట్ చేసింది. ‘1984లో ఇదే రోజు షార్జాలో భారత్ తొలి ఆసియాకప్‌ను ముద్దాడింది. 8 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచిన భారత్.. ఫైనల్లో పాకిస్థాన్‌ను 54 పరుగులతో మట్టికరిపించింది. సునీల్ గావస్కర్ భారత జట్టుకు సారథ్యం వహించాడు.'అని నాటి మ్యాచ్ ఫొటోలను షేర్ చేసింది.

ఆసియాకప్‌లో భారత్‌కు తిరుగు లేదు..
ఇప్పటి వరకు 14 ఎడిషన్లు ఆసియాకప్ జరగ్గా.. అత్యధికంగా భారత్ ఏడు సార్లు విజేతగా నిలిచింది. తర్వాత శ్రీలకం 5 సార్లు గెలుపొందంగా.. పాకిస్థాన్ రెండు సార్లు విజేతగా నిలిచింది. ఇక 2018లో జరిగిన సీజన్‌లో బంగ్లాదేశ్‌ను ఓడించి భారత్ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇక ఈ ఏడాది జరగాల్సిన ఆసియా కప్‌కు కరోనా సెగ తగిలింది. ఒకవైపు ఐపీఎల్.. మరో వైపు టీ20 ప్రపంచకప్‌తో ఈ టోర్నీ జరగడంపై నీలినీడలు కమ్ముకున్నాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications
అక్తర్ చెప్పేది శ్రీరంగ నీతులు.. చేసేది చెత్త పనులా?