క్రికెట్ గాడ్ అరంగేట్రానికి 31 ఏళ్లు.. ఓ పిల్లవాడా ఇంటికి వెళ్లి పాలు తాగిరా..!

హైదరాబాద్: సచిన్ టెండూల్కర్.. ఈ పేరు వింటేనే ఏదో తెలియని వైబ్రేషన్స్.! అతను బ్యాటింగ్‌కు దిగితే పూనకమే! 24 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో ఎన్నో ఆటు పోట్లు ఎదుర్కొన్న మాస్టర్ బ్లాస్టర్ క్రికెట్‌కే వన్నెతెచ్చాడు. వన్డేల్లో అసాధ్యమైన డబుల్ సెంచరీని సుసాధ్యం చేశాడు. 100 సెంచరీలతో ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచాడు. క్రికెటంతా తనే ఓ చరిత్రగా మిగిలి 'భారత రత్నం'అయ్యాడు. మైదానంలో తిరుగులేని శక్తిగా.. ప్రపంచ క్రికెట్ ముఖ చిత్రంగా నిలిచిన సచిన్.. 31 ఏళ్ల క్రితం (1989, నవంబర్ 15) ఇదే రోజు అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. భీకర పేస్ లైనప్ కలిగిన పాకిస్థాన్ జట్టుపై 16 ఏళ్ల పసిప్రాయంలో సచిన్ తన తొలి మ్యాచ్ ఆడాడు.

తడబడ్డ సచిన్..
కరాచీ వేదికగా జరిగిన ఫస్ట్ టెస్ట్‌లో అవకాశం అందుకున్న సచిన్.. వసీం అక్రమ్, వకార్ యూనిస్ బౌలింగ్‌లో తడబడ్డాడు. 24 బంతులు ఆడిన మాస్టర్ ఇందులో సగం బంతులను వదిలేసాడు. చివరకు 12 పరుగులే చేసి వెనుదిరిగాడు. అయితే రెండో టెస్ట్‌లో టాపార్డర్ విఫలమైన వేళ ఓపికగా ఆడిన సచిన్ 59 పరుగులు చేశాడు. ఈ ఫస్ట్ హాఫ్ సెంచరీతో తన ఆత్మవిశ్వాసం అమాంతం పెరిగిపోయిందని మాస్టర్ తన బయో బుక్‌లో పేర్కొన్నాడు.

ముక్కు పచ్చడైంది..
ఇక నాలుగో టెస్ట్‌లో వకార్ యూనిస్ వేసిన బౌన్సర్‌ను తప్పుగా అంచనా వేసిన మాస్టర్ తీవ్రంగా గాయపడ్డాడు. అత్యంత వేగంతో దూసుకొచ్చి రాకాసి బౌన్సర్ నేరుగా అతని ముక్కును తాకింది. దాంతో జెర్సీ అంతా రక్తమయమైంది. సచిన్ పరిస్థితిని చూసిన ఓ పాకిస్థాన్ అభిమాని ‘ఓ పిల్లవాడా ఇంటికి వెళ్లి పాలు తాగిరా'అనే ప్లకార్డ్ ప్రదర్శించాడు. అయినా పట్టుదలతో బ్యాటింగ్ చేసిన సచిన్ 57 రన్స్ చేశాడు. 38 పరుగులకే 4 వికెట్లు పోయిన దశ నుంచి తన హాఫ్ సెంచరీతో జట్టును గట్టెక్కించాడు.

8 మ్యాచ్‌ల తర్వాత సెంచరీ..
1989లో అరంగేట్రం చేసిన సచిన్‌కు ఫస్ట్ సెంచరీ చేయడానికి 8 టెస్టుల వరకు ఆగాల్సి వచ్చింది. 1990, ఆగస్టు 14న ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్ రెండో
సచిన్ సెంచరీతో కదం తొక్కాడు. తద్వారా 17 ఏళ్ల వయసులోనే సెంచరీ చేసిన అత్యంత పిన్నవయస్కుడి రికార్డు నెలకొల్పాడు. ఆ మ్యచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ జట్టు 519 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత్.. నాటి కెప్టెన్ మమ్మద్ అజారుద్దీన్( 179), సచిన్( 68) రాణించడంతో 432 పరుగుల చేసింది. తర్వాత ఇంగ్లండ్ 320 పరుగులు చేయడంతో భారత్ ముందు 407 పరుగుల విజయలక్ష్యం నమోదైంది. ఇక రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ దిగిన సచిన్ 225 నిమిషాల పాటు క్రీజులో ఉండి, 189 బంతుల్లో 119 పరుగులు చేశాడు. దీంతో భారత్ 343/6 చేసి మ్యాచ్‌ను డ్రాగా ముగించింది.

పాలు తాగాలన్న పసివాడే..
ఇక పాలు తాగిరావాలని ఎగతాళి చేయబడ్డ ఆటగాడే ప్రపంచ దిగ్గజ బౌలర్లందరికీ ముచ్చెమటలు పట్టించాడు. క్రీజులో నిలబడి తన బ్యాటింగ్‌తో చుక్కలు చూపించాడు. ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే వంద శతకాలు బాదిన ఏకైక క్రికెటర్‌గా నిలిచాడు. అత్యధికంగా ఆరుసార్లు ప్రపంచకప్ ఆడిన క్రికెటర్‌గా కూడా ఈ పసివాడే. అంతర్జాతీయ టెస్టుల్లో 200 మ్యాచ్‌లు ఆడిన ఒకేఒక్క మొనగాడు.. 15000 రన్స్ చేసిన ధీరుడు కూడా పసిప్రాయంలో అరంగేట్రం చేసిన సచినే. ఇక 2012 డిసెంబర్‌లో వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించిన సచిన్.. 2013 అక్టోబర్‌లో టీ20లకు, 2013 నవంబర్ 13న అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు.
India vs Australia: భారత్‌తో టెస్ట్ సిరీస్.. ఏకాగ్రత కోసం ఆస్ట్రేలియా యువ క్రికెటర్ ఏం చేశాడంటే?
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications