For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

బర్త్‌డే బాయ్ బెన్‌స్టోక్స్‌కు చుక్కలు చూపిస్తున్న కోహ్లీ ఫ్యాన్స్!

On Ben Stokes birthday, Indian fans bring up Virat Kohli in greetings

న్యూఢిల్లీ: ఈ రోజు (జూన్ 4, గురువారం) 29 పుట్టిన రోజు జరుపుకుంటున్న ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ బెన్‌స్టోక్స్‌కు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అభిమానులు చుక్కలు చూపిస్తున్నారు. బెన్‌స్టోక్స్ వికెట్ పడిన సమయంలో విరాట్ కోహ్లీ ఓ అసభ్య పదాన్ని వినియోగించిన వీడియోను షేర్ చేస్తూ మరీ అతనికి కోహ్లీ అభిమానులు బర్త్‌డే విషెస్ చెప్తున్నారు.

తరుచూ విమర్శలు..

ఇక 2019 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ చేతిలో ఓటమికి చిన్న బౌండరీల కారణమని కోహ్లీ చెప్పిన మాటలను బెన్ స్టోక్స్ తన బుక్‌లో తప్పుబట్టాడు. అంతేకాకుండా ఆ మ్యాచ్‌లో గెలవాలనే కసి భారత్‌లో కనిపించలేదని వివాదస్పద రీతిలో రాసుకొచ్చాడు. దీనిపై ఇప్పటికే ఆగ్రహంగా ఉన్న ఫ్యాన్స్.. సమయం చూసుకొని ఆడుకుంటున్నారు. ఇక మైదనాంలో కూడా విరాట్ కోహ్లీ, బెన్‌స్టోక్స్ మధ్య సుదీర్ఘకాలంగా ఆధిపత్య పోరు జరుగుతోంది. ఫార్మాట్‌ ఏదైనా ఇప్పటికీ బెన్‌స్టోక్స్ వికెట్ పడితే మైదానంలో కోహ్లీ సంబరాలు పతాక స్థాయిలో ఉంటాయి. మరోవైపు బెన్‌స్టోక్స్ కూడా కోహ్లీపై తరుచూ విమర్శలు గుప్పిస్తుంటాడు.దీంతో స్టోక్స్‌ తీరుపై గత కొంతకాలంగా ఆగ్రహంగా ఉన్న విరాట్ అభిమానులు.. తమదైన శైలిలో విషెస్ తెలుపుతున్నారు.

అసభ్య పందం వాడిన వీడియోను..

బెన్‌స్టోక్స్ వికెట్ పడిన సమయంలో విరాట్ కోహ్లీ ఓ అసభ్య పదాన్ని వినియోగించిన వీడియోని షేర్ చేస్తూ మరీ అతనికి కోహ్లీ అభిమానులు బర్త్‌డే విషెస్ చెబుతున్నారు. వాస్తవానికి విరాట్ కోహ్లీ వాడిన పదం బూతు కాదని గత ఏడాది వివరణ ఇచ్చిన బెన్‌స్టోక్స్.. నా పేరుని అందులో పలికాడని చెప్పుకొచ్చాడు. ‘ఇక నేను ట్వీటర్ అకౌంట్‌ను తొలగించాలేమో. ఇలాంటి ట్వీట్ మరోకటి నేను చూడదలుచుకోలేదు. విరాట్ ఆ వీడియోలో బెన్‌స్టోక్స్ అని పలికాడు. ఇప్పటి సరదగా ఉన్నా ఇక కోపం వస్తుంది'అని స్టోక్స్ గతేడాది ట్వీట్ చేశాడు. కానీ అది పక్కా అసభ్య పదమని అందరికీ స్పష్టంగా తెలుస్తోంది. అయితే.. పుట్టినరోజు నాడే మళ్లీ అదే పదాన్ని తెరపైకి తెచ్చిన భారత్ అభిమానులు విషెస్ చెప్పడం బెన్‌స్టోక్స్‌‌కు ఆగ్రహం తెప్పించే విషయమే.

వర్ణ వివక్షకు మేమూ బాధితులమే: భారత క్రికెటర్లు

సూపర్ పెర్ఫామెన్స్..

గతేడాది అద్భుత ప్రదర్శన కనబర్చిన బెన్‌స్టోక్స్.. 2020 విజ్డెన్ క్రికెటర్‌గా ఎంపికైన విషయం తెలిసిందే. అంతేకాకుండా ఇంగ్లండ్‌‌కు అందని ద్రాక్షగా ఉన్న ప్రపంచకప్‌ను తన అద్భుత ఆటతీరుతో ఆకట్టుకొని అందించాడు. ఆ తర్వాత యాషెస్ సిరీస్‌లోనూ తన జోరును కొనసాగించాడు. ముఖ్యంగా చివరి వికెట్‌తో పోరాడి అతను అందించి విజయం స్టోక్స్ కెరీర్‌కే హైలైట్. మొత్తంగా గత ఏడాది టెస్టుల్లో 821 పరుగులు చేసిన బెన్‌స్టోక్స్, వన్డేల్లో 719 పరుగులు చేశాడు. దీంతో 2019 ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద అవార్డు కూడా అందుకున్నాడు.

Story first published: Thursday, June 4, 2020, 13:12 [IST]
Other articles published on Jun 4, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+