Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ధోనీ వారుసడన్న పంత్ వాటర్ బాటిళ్లు అందిస్తుండు: నెహ్రా

Ashish Nehra Says Rishabh Pant Was Being Prepared to Replace MS Dhoni and now he is serving water

న్యూఢిల్లీ: భారత జట్టుకు సరైన 'కోర్ గ్రూప్' లేకపోవడంతోనే ఆస్ట్రేలియా, వెస్టిండీస్ జట్లలా క్రికెట్‌ను శాసించే స్థాయిని అందుకోలేకపోతున్నదని మాజీ పేసర్ ఆశిష్ నెహ్రా అభిప్రాయపడ్డాడు. ఆటగాళ్ల విషయంలో టీమ్‌మేనేజ్‌మెంట్ అయోమయానికి గురవుతుందని, ప్లేయర్లను తరుచూ మార్చకుండా.. కొంతకాలం పాటు వారికి అవకాశాలు ఇచ్చి మద్దతుగా నిలవాలని సూచించాడు. మంగళవారం మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రాతో ఇన్‌స్టాగ్రామ్ లైవ్ సెషన్‌లో మాట్లాడిన నెహ్రా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

 ఆస్ట్రేలియాను అందుకోలేం..

ఆస్ట్రేలియాను అందుకోలేం..

‘వరుసగా మూడు ప్రపంచకప్‌లు నెగ్గి 1996 ఫైనల్ చేరి ఇంటా, బయట 18-19 టెస్ట్‌లు గెలిచిన ఆస్ట్రేలియా జట్టు కంటే భారత్ చాలా దూరంలో ఉంది. ప్రస్తుత భారత్ ఆ స్థాయికి చేరుకోలేదని చెప్పలేం. కానీ, అందుకు కోర్ గ్రూప్ చాలా ముఖ్యం. డైనింగ్ టేబుల్‌పై ఎక్కువ వంటకాలు కనిపిస్తే ఏం తినాలో తెలియక అయోమయానికి గురవుతాం. కొన్నే అయినా రుచికరమైన వంటకాలే ముఖ్యం. మన దగ్గర టాలెంటెడ్ ప్లేయర్లు చాలా మంది ఉన్నారు. కానీ, వారికి సుదీర్ఘకాల మద్దతు అవసరం.

ఇప్పటికీ క్లారిటీ లేదు..

ఇప్పటికీ క్లారిటీ లేదు..

భారత వన్డే జట్టులో 5,6 స్థానలపై ఈ రోజుకూ స్పష్టత లేదు. ప్రస్తుతం కేఎల్ రాహుల్ ఐదో స్థానంలో ఆడుతున్నాడు. మరోవైపు ధోనీ వారుసుడు అనుకున్న పంత్ వాటర్ బాటిళ్లు మోస్తున్నాడు. వచ్చిన అవకాశాలని అతను చేజార్చుకున్నాడని నాకు తెలుసు. కానీ 22-23 ఏళ్లలోనే పంత్ సత్తా చూసి జట్టులోకి తీసుకున్నప్పుడు అతనికి మరిన్ని అవకాశాలు ఇవ్వాలి'అని నెహ్రా అభిప్రాయపడ్డాడు.

 అంత దూరం వెళ్లడం ఎందుకు?

అంత దూరం వెళ్లడం ఎందుకు?

టీ20 ప్రపంచకప్ దృష్ట్యా ఈ ఏడాది వన్డే క్రికెట్‌కు అంత ప్రాధాన్యత లేదన్న కెప్టెన్ విరాట్ కోహ్లీ వ్యాఖ్యలతో నెహ్రా విభేదించాడు. న్యూజిలాండ్ పర్యటనలో టీ20 సిరీస్‌ను 5-0తో క్లీన్ స్వీప్ చేసిన భారత్.. వన్డే సిరీస్‌లో మాత్రం 0-3తో వైట్ వాష్‌కు గురైంది. అయితే ఈ ఏడాది చివర్లో టీ20 ప్రపంచకప్ ఉండటంతో వన్డేలు అంత ముఖ్యం కాదని కోహ్లీ అన్నాడు. ‘ఆ విషయం గెలిచిన తర్వాత చెబితే వేరేలా ఉండేది. ఈ ఏడాది టీ20లు ముఖ్యం కాబట్టి వన్డేలను మేం పట్టించుకోం అనడం సరికాదు. వన్డేలు ముఖ్యం కాకపోతే అంత దూరం వెళ్లి ఆడడం ఎందుకు? కివీస్‌పై వన్డేలు నెగ్గేందుకు భారత్ ప్రయత్నించలేదని చెప్పాలనుకుంటున్నారా? కోహ్లీ వ్యాఖ్యలతో నేను ఏమాత్రం ఏకీభవించను.'అని నెహ్రా స్పష్టం చేశాడు.

 ఓ కేజీ వ్యాసెలిన్ ఇవ్వండి..

ఓ కేజీ వ్యాసెలిన్ ఇవ్వండి..

కరోనా నేపథ్యంలో బంతులపై ఉమ్మి రుద్దడం నిషేధించాలన్న డిమాండ్‌పై ఈ మాజీ పేసర్ వ్యంగ్యస్త్రాలు సంధించాడు. ‘అంపైర్లకు వ్యాసెలిన్ ఇచ్చి, 90 ఓవర్లలో ఒక కేజీ వ్యాసెలిన్ వాడొచ్చని బౌలర్లకు చెబుతారా? అని ఐసీసీని ప్రశ్నించాడు. ఈ విషయం కంటే వన్డేలను ఆసక్తికరంగా మార్చడంపై ఆలోచించాలని సూచించాడు.

ధోనీ, కోహ్లీ వెన్నుపోటు పొడిచారు.. యూవీ తండ్రి సంచలన వ్యాఖ్యలు!

Story first published: Wednesday, May 6, 2020, 12:24 [IST]
Other articles published on May 6, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+