Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

టెస్టుల్లో ఏదీ అంత ఈజీ కాదు: డబుల్ సెంచరీపై రిపోర్టర్‌కు రోహిత్ శర్మ ఝలక్

Nothing comes easy in Test cricket: Opener Rohit Sharma on new found success as red-ball opener

హైదరాబాద్: భవిష్యత్తులో తనపై విమర్శలు వచ్చినప్పటికీ... టెస్టుల్లో తన సహజసిద్ధమైన ఆటనే కొనసాగిస్తానని టీమిండియా టెస్టు ఓపెనర్‌ రోహిత్‌శర్మ అన్నాడు. శుక్రవారం ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో జట్టు మేనేజ్‌మెంట్ తన సామర్థ్యంపై పెట్టుకున్న నమ్మకమే తన ఆటను ముందుకు నడిపిస్తుందని ఈ సందర్భంగా రోహిత్ పేర్కొన్నాడు.

మీ ఆటతీరు కారణంగానే టెస్టుల్లో డబుల్ సెంచరీని సులభంగా సాధించారా? అన్న ప్రశ్నకు గాను రోహిత్ శర్మ "టెస్టు క్రికెట్‌లో ఏదీ అంత తేలికగా రాదు. టెస్టు కెరీర్‌ తొలినాళ్లలో నా సహజసిద్ధమైన బ్యాటింగ్‌ను మర్చిపోయి బౌలర్లను ఎక్కువ గౌరవించేవాడిని. అయితే, భవిష్యత్తులో ఎవరు నన్ను విమర్శించినా నేను నా షాట్లను ఆడుతూనే ఉంటాను" అని రోహిత్ చెప్పాడు.

జట్టు మేనేజ్‌మెంట్ ఏం చెప్పిందో నాకు తెలుసు

జట్టు మేనేజ్‌మెంట్ ఏం చెప్పిందో నాకు తెలుసు

"నేను నా ఆటకు మద్దతు ఇస్తూనే ఉంటాను. నాకో బాధ్యత అప్పగించి, జట్టు మేనేజ్‌మెంట్ ఏం చెప్పిందో నాకు తెలుసు. వరుసగా 10 ఇన్నింగ్స్‌లు నేను విఫలమానా పట్టించుకోను. జట్టు మెనేజ్‌మెంట్ మద్దతు చాలా ముఖ్యమైనది కనుక ఇది నన్ను ప్రభావితం చేయదు. ఒకవేళ నేను రాణిస్తే.. టీమిండియా టెస్టుల్లో ఆధిపత్యం చెలాయించే స్థితిలో ఉంటుంది" అని రోహిత్ తెలిపాడు.

టెస్టుల్లో ఓపెనింగ్ పాత్రను ఇవ్వడంపై

టెస్టుల్లో ఓపెనింగ్ పాత్రను ఇవ్వడంపై

టెస్టుల్లో ఓపెనింగ్ పాత్రను ఇవ్వడంపై రోహిత్ మాట్లాడుతూ టీమ్ మేనేజ్‌మెంట్ తన కోసం ముందు నుంచీ ప్రణాళికలు వేసుకున్నందున తాను సిద్ధంగా ఉన్నట్లు చెప్పాడు. "ఇది మంచి పురోగతి. కెప్టెన్, కోచ్ మరియు సెలెక్టర్లలు గత కొంతకాలంగా (టెస్టుల్లో ఓపెనర్‌గా) నా గురించి చర్చిస్తున్నట్లు చెప్పారు" అని రోహిత్ శర్మ తెలిపాడు.

పిచ్చి ప్రేలాపనతో పైశాచిక ఆనందం: ఇంజనీర్ 'చెత్త' వ్యాఖ్యలపై ఎమ్మెస్కే ఆగ్రహం

గొప్ప టెస్ట్ ఓపెనర్‌ల వీడియోలను చూశాను

గొప్ప టెస్ట్ ఓపెనర్‌ల వీడియోలను చూశాను

"మానసికంగా, నేను టెస్టు క్రికెట్ ఆడనప్పుడు నేను ఓపెనర్‌గా బరిలోకి దిగేందుకు సిద్ధమయ్యాను. ఇందుకోసం గొప్ప టెస్ట్ ఓపెనర్‌ల వీడియోలను చూశాను. నాకు మంచి వేదిక లభించిందని నేను నమ్ముతున్నాను. కానీ, ఆ అవకాశాన్ని వదలకుండా ఉండడం నా చేతుల్లో ఉంది" అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.

టీ20 ప్రపంచకప్‌ తర్వాతే నిర్ణయం.. క్రికెట్‌కు గుడ్‌ బై చెప్పొచ్చేమో?: స్టార్ క్రికెటర్

కెరీర్ ప్రారంభంలో మిడిలార్డర్ బ్యాట్స్‌మన్‌నే

కెరీర్ ప్రారంభంలో మిడిలార్డర్ బ్యాట్స్‌మన్‌నే

"నా వన్డే కెరీర్ ప్రారంభంలో కూడా నేను తొలుత మిడిలార్డర్ బ్యాట్స్‌మన్‌నే. భారత్ లాంటి ప్రదేశాల్లో బంతి పాతది అయ్యే కొద్దీ భారీ షాట్లు ఆడటం కష్టం. నాకు చాలా ఓవర్లు బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదని నేను చెప్పడం లేదు. ఓపెనర్‌గా మీరు ప్రారంభ దశలో ఉంటే, స్వదేశంలో లేదా విదేశాల్లో... సొంత తప్పిదం వల్లే బయటపడగలరు" అని రోహిత్ తెలిపాడు.

Story first published: Friday, November 1, 2019, 13:42 [IST]
Other articles published on Nov 1, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+