భారత్-న్యూజిలాండ్ సిరీస్‌లో నయా టెక్నాలజీ.. ఆ వివాదస్పద నిర్ణయాలకు చెక్!
క్రికెట్‌లో అంపైర్ల తప్పిదాలను తగ్గించే దిశగా మరో ముందడుగు పడింది. భారత్, న్యూజిలాండ్ మధ్య గురువారం ప్రారంభమయ్యే ఐదు టీ20ల సిరీస్‌లో కచ్చితమైన డీఆర్‌ఎస్ నిర్ణయాల కోసం సోనిక్ టెక్నాలజీని ఉపయోగించనున్నట్లు న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు అధికారికంగా ప్రకటించింది. ఈ నయా సాంకేతికతో డీఆర్‌ఎస్ నిర్ణయాలు మరింత కచ్చితంగా ఉండనున్నాయి.
Sonic టెక్నాలజీ అంటే..
ఈ సోనిక్ టెక్నాలజీని న్యూజిలాండ్‌కు చెందిన వర్చువల్ ఐ సంస్థ రూపొందించింది. సోనిక్ టెక్నాలజీ ఒక అత్యాధునిక ఆడియో అనాలిసిస్ టెక్నాలజీ. బ్యాటర్‌కు బంతి తగిలిందా లేదా అనే విషయాన్ని సౌండ్ ఆధారంగా విశ్లేషించి థర్డ్ అంపైర్‌కు స్పష్టమైన సమచారం అందిస్తుంది.

ఈ నయా సాంకేతికతో వివాదాస్పదమైన క్యాచ్‌ల విషయంలోనూ కచ్చితమైన నిర్ణయాలు తీసుకోవడం సాధ్యమవుతుంది. ఇప్పటికే బాల్-ట్రాకింగ్ టెక్నాలజీని రూపొందించిన వర్చువల్ ఐ సంస్థ.. ఇప్పుడు ఈ ఎడ్జ్-డిటెక్షన్ టెక్నాలజీతో పూర్తి స్థాయి డీఆర్‌ఎస్ సేవలను అందించనుంది.
అన్ని రకాలుగా పరీక్షించాం..
ఇప్పటికే ఈ టెక్నాలజీని విస్తృత స్థాయిలో పరీక్షించి ఆమోదం తెలిపారు. ఐసీసీ అనమతితో పలు సంస్థలతో దీని పనితీరును అంచనా వేసారు. ఈ ప్రక్రియకు బీసీసీఐ కూడా పూర్తి మద్దతు తెలిపిందని న్యూజిలాండ్ క్రికెట్ పేర్కొంది. ఐసీసీ అక్రిడిటేషన్, అనుమతులు ఉన్న సిరీస్‌లు, క్రికెట్ టోర్నీలో ఈ టెక్నాలజీని ఉపయోగించనున్నారు.
ఈ టెక్నాలజీని అన్ని విధాల పరీక్షించామని న్యూజిలాండ్ క్రికెట్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ గ్లెన్ క్రిచ్లీ అన్నారు. 'ఆటలో అంపైర్ల నిర్ణయాలు కచ్చితంగా ఉండటం చాలా ముఖ్యం. అందుకే ఈ టెక్నాలజీని అన్ని విధాల పరీక్షించాం. ఈ పరీక్షల ఫలితం పట్ల సంతోషంగా ఉన్నాం. ఇందుకు సహకరించిన ఐసీసీ, బీసీసీఐ, స్కై, వర్చువల్ ఐ సంస్థలకు కృతజ్ఞతలు.'అని క్రిచ్లీ తెలిపారు.
అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా..
అంతర్జాతీయ క్రీడల్లో అత్యున్నత ప్రమాణాలకు అనుగుణంగా, కచ్చితత్వానికి ప్రాధాన్యత ఇస్తూ మా బృందం ఈ టెక్నాలజీని అభివృద్ధి చేసిందని వర్చువల్ ఐ సీఈఓ బెన్ టేలర్ పేర్కొన్నాడు. 43 రోజుల పాటు సాగే ఈ పర్యటనలో భారత్ ఐదు టీ20లు, ఐదు వన్డేలు, రెండు టెస్ట్‌ల సిరీస్ ఆడనుంది. మరికాసేపట్లో జరిగే తొలి టీ20తో మొదలయ్యే ఈ సుదీర్ఘ పర్యటన డిసెంబర్ 1న రెండో టెస్టుతో ముగియనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


