Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అంబటి రాయుడిని కించపర్చిన సంజయ్ మంజ్రేకర్.. మండిపడుతున్న ఫ్యాన్స్!

Netizens trolls Sanjay Manjrekar After He calls Ambati Rayudu and Piyush Chawla pretty low profile cricketers

న్యూఢిల్లీ: టీమిండియా మాజీ క్రికెటర్, వివాదాస్పద కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ సోషల్ మీడియా వేదికగా మరోసారి తీవ్ర ట్రోలింగ్‌కు గురయ్యాడు. గతంలో తన వివాదాస్పద కామెంట్రీతో తీవ్ర విమర్శలకు గురైన ఈ భారత మాజీ క్రికెటర్.. తాజాగా తెలుగు తేజం, చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ప్లేయర్ అంబటి రాయుడిని కించపర్చేలా లోప్రొఫైల్ క్రికెటరని కామెంట్ చేసి అభిమానుల ఆగ్రహానికి గురయ్యాడు.

శనివారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన ఐపీఎల్ ఆరంభ మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన చెన్నై సూపర్ కింగ్స్ 5 వికెట్లతో గెలుపొందిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌లో అంబటి రాయుడు (48 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో 71) అద్భుత బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. 6 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును తన అనుభవపూర్వకమైన ఆటతో విజయతీరాలకు చేర్చాడు. అటు బౌలింగ్‌లో పియూష్ చావ్లా కూడా అద్భుత ప్రదర్శన కనబర్చాడు.

చెన్నై టీమ్ అద్భుతం..

దీంతో మ్యాచ్ ముగిసిన అనంతరం సంజయ్ మంజ్రేకర్ రాయుడు, పియూష్ చావ్లాలను ట్విటర్ వేదికగా కొనియాడాడు. ఈ క్రమంలోనే ఈ ఇద్దరిని లోప్రొఫైల్ క్రికెటర్లుగా పేర్కొన్నాడు. ‘లోప్రొఫైల్ క్రికెటర్లు పియూష్ చావ్లా, అంబటి రాయుడుల ఆటతీరు అద్భుతం. చావ్లా బంతితో సంచలన ప్రదర్శన కనబర్చాడు. ఐదు, 16వ ఓవర్‌లో అతని బౌలింగ్ సూపర్. రాయుడు బ్యాటింగ్‌లో మెరిసాడు. నాణ్యమైన షాట్స్‌తో తన ఐపీఎ‌ల్ కెరీర్‌లోనే ఓ బెస్ట్ ఇన్నింగ్స్ ఆడాడు. వెల్‌డన్ సీఎస్‌కే'అని ట్వీట్ చేశాడు.

లోప్రొఫైల్ కాదు.. అండర్ రేటేడ్ ఆటగాడు..

ఇక సంజయ్ పేర్కొన్న లోప్రొఫైల్ కామెంట్‌పై అభిమానులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా అంబటి రాయుడు ఫ్యాన్స్ సంజయ్ మంజ్రేకర్‌పై మండిపడుతున్నారు.‘సంజయ్.. అంబటి రాయుడు లోప్రొఫైల్ క్రికెటర్ కాదు.. తక్కువ అంచనా వేసిన ఆటగాడు.'అని ఒకరంటే.. ‘అవునా.. రాయుడు లో ప్రొఫైలా? ఈ ప్రొఫైల్స్ ఎవరు డిసైడ్ చేస్తరయ్యా?'అని ఇంకొకరు కామెంట్ చేశారు. ‘ప్రపంచకప్ గెలిచిన జట్టులో సభ్యుడైన ఆటగాడిని లోప్రొఫైల్ క్రికెటర్ అనడం విచిత్రం'అని మరొకరు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. రెండు ప్రపంచకప్‌లు గెలుచుకున్న భారత జట్టులో చావ్లా సభ్యుడు కాగా, రాయుడు 55 వన్డేల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు.

వేటు వేసినా బుద్ది రాలేదు..

ఈ వివాదస్పద వ్యవహారశైలితోనే భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) కామెంటేటర్‌గా సంజయ్ మంజ్రేకర్‌పై వేటు వేసింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2020 సీజన్ కామెంటేటర్ లిస్ట్‌ నుంచి అతన్నితప్పించింది. ఈ విషయంలో క్షమాపణలు కోరుతూ మంజ్రేకర్ బీసీసీఐకి అనేక మెయిల్స్, లేఖలు రాసినా భారత క్రికెట్ బోర్డు కరుణించలేదు. బుద్దిగా బోర్డు నిబందనల మేరకు నడుచుకుంటానని విన్నవించినా పట్టించుకోలేదు. దీంతో ఈ సీజన్‌కు మంజ్రేకర్ దూరమయ్యాడు. ఇప్పుడు ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ నెటిజన్లు మంజ్రేకర్‌పై మండిపడుతున్నారు. వేటువేసినా బుద్దిరాలేదని కామెంట్ చేస్తున్నారు.

జడేజా, హర్షా భోగ్లేపై నోరుపారేసుకొని

గతేడాది ప్రపంచకప్ సందర్భంగా రవీంద్ర జడేజాను ‘బిట్స్ అండ్ పీసెస్' ఆటగాడిగా అభివర్ణించి తీవ్ర విమర్శలు పాలైన మంజ్రేకర్.. ఆ తర్వాత ‘వాయిస్ ఆఫ్ ఇండియన్ క్రికెట్'గా పిలిచే హర్షా భోగ్లేను కూడా కించపరిచేలా మాట్లాడాడు. భోగ్లే ఫస్ట్ క్లాస్ క్రికెట్‌ కానీ, లిస్ట్ ఎ మ్యాచ్‌లు కానీ ఆడలేదని విమర్శించాడు. అప్పట్లో జడేజా మంజ్రేకర్ వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ‘నీ నోటి విరేచనాలను ఆపు'అని బదులిచ్చాడు. భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాతో కూడా మంజ్రేకర్ చివాట్లు తిన్నాడు. ఇలా తరుచూ ఏదో ఒకటి అంటూ తిట్లు తినడం మంజ్రేకర్ సరదానేమోనని అభిమానులు కామెంట్ చేస్తున్నారు.

దీపక్ చాహర్ మిస్ ఫీల్ట్.. గుస్సా అయిన ధోనీ (వైరల్ వీడియో)

Story first published: Sunday, September 20, 2020, 17:56 [IST]
Other articles published on Sep 20, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+