Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

MI vs SRH: సన్‌రైజర్స్ హైదరాబాద్ కొంప ముంచిన మూడు తప్పిదాలు!

3 mistakes committed by Sunrisers Hyderabad

షార్జా: రెండు వరుస విజయాలతో దూకుడు మీద కనిపించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ తమ జైత్రయాత్రను కొనసాగించలేకపోయింది. ముంబై ఇండియన్స్‌తో ఆదివారం జరిగిన ఫస్ట్ మ్యాచ్‌లో ఆరెంజ్ ఆర్మీ 34 పరుగులతో ఓటమిపాలైంది. కెప్టెన్ డేవిడ్ వార్నర్(44 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 60) రాణించినా ఫలితంలేకపోయింది. మరోవైపు ముంబై ఇండియన్స్ ధాటైన బ్యాటింగ్.. ఆ తర్వాత కట్టుదిట్టమైన బౌలింగ్‌తో రాణించి అద్భుత విజయాన్నందుకుంది.

గాయాలతో భువనేశ్వర్ కుమార్, ఖలీల్ అహ్మద్ దూరమవడం సన్‌రైజర్స్ బౌలింగ్‌ను బలహీనం చేయగా.. భారీ లక్ష్య ఛేదనలో మంచి భాగస్వామ్యాలు నమోదు కాకపోవడం విజయవకాశాలను దెబ్బతీసింది. ఇక డేవిడ్ వార్నర్ ఔటయ్యే వరకు రేసులో నిలిచిన హైదరాబాద్.. ముఖ్యంగా మూడు తప్పిదాలతో మూల్యం చెల్లించుకుంది.

 1. చివరి నాలుగు బంతుల్లో 20 పరుగులు..

1. చివరి నాలుగు బంతుల్లో 20 పరుగులు..

ఆరంభంలో కట్టుదిట్టంగా బౌలింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ మంచి శుభారంభాన్ని అందుకుంది. హిట్‌మ్యాన్ రోహిత్ శర్మను ఫస్ట్ ఓవర్‌లోనే పెవిలియన్ చేర్చింది. మిడిల్ ఓవర్‌లో రషీద్ ఖాన్ కట్టడిగా బౌలింగ్ చేయడంతో ఓ దశలో ముంబై 180 పరుగులకే పరిమితమవుతుందా? అనే సందేహం కలిగింది. కానీ డెత్ ఓవర్లలో అనుభవలేమి బౌలింగ్ అటాక్‌తో హైదరాబాద్ మూల్యం చెల్లించుకుంది. చివరి నాలుగు ఓవర్లలోనే ముంబై 59 పరుగులను పిండుకుంది. ముఖ్యంగా సిద్దార్థ్ కౌల్ వేసిన ఆఖరి ఓవర్‌లో కృనాల్ పాండ్యా ఆకాశమే హద్దుగా చెలరేగాడు. వరుసగా నాలుగు బంతుల్లో 6,4,4,6తో 20 పరుగులు పిండుకున్నాడు. దాంతో ముంబై 208 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఒక వేళ ముంబైని 195 రన్స్‌లోపే కట్టడి చేసుంటే హైదరాబాద్‌ విజయానికి మంచి అవకాశం ఉండేది.

2. మిడిలార్డర్ వైఫల్యం..

2. మిడిలార్డర్ వైఫల్యం..

చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో టాపార్డర్ విఫలమైన వేళ యువ ఆటగాళ్లు చెలరేగడంతో జట్టు మిడిలార్డ్ టచ్‌లోకి వచ్చినట్లు కనిపించింది. కానీ తాజా మ్యాచ్‌లో భారీ లక్ష్య చేధనలో ఆరెంజ్ ఆర్మీ మిడిలార్డర్ బలహీనత మరోసారి స్పష్టమైంది. భారీ లక్ష్య చేధనలో హైదరాబాద్ మంచి శుభారంభాన్ని అందుకున్నా.. దాన్ని కొనసాగించే బ్యాట్స్‌మెన్ మిడిలార్డర్, లోయరార్డర్‌లో లేకపోవడంతో మూల్యం చెల్లించుకుంది. డేవిడ్ వార్నర్ క్రీజులో ఉన్నంత సేపు హైదరాబాద్ చేతిలో ఉన్న మ్యాచ్.. అతని ఔట్ అనంతరం ఒక్కసారిగా ముంబై చేతిలోకి వెళ్లిపోయింది.

3. లాంగ్ ఇన్నింగ్స్ ఆడకపోవడం..

3. లాంగ్ ఇన్నింగ్స్ ఆడకపోవడం..

209 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించే క్రమంలో హైదరాబాద్ తమ ప్రణాళికలను సరిగ్గా అమలు పరచలేకపోయింది. రన్‌రేట్ మెయింటేన్ చేయాలని ధాటిగా ఆడిన టాపార్డర్.. తాము ఔటైతే పరిస్థితి ఏందనే లాజిక్‌ను మిస్సైంది. క్రీజులో సెటిల్ అయిన బ్యాట్స్‌మెన్ లాంగ్ ఇన్నింగ్స్‌లు ఆడకపోవడం, మంచి భాగస్వామ్యాలను నమోదు చేయకపోవడం హైదరాబాద్‌కు ప్రతికూలంగా మారాయి. డేవిడ్ వార్నర్ వికెట్ అనంతరం మిడిలార్డర్‌లో సెట్ అయిన బ్యాట్స్‌మెన్ లేకపోవడం.. జస్‌ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్ వంటి వరల్డ్ క్లాస్ బౌలర్లను ఎదుర్కొనే సత్తా ఉన్న ఆటగాళ్లు లేకపోవడం దెబ్బతీసింది. ఈ విషయాన్నే పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్‌లో డేవిడ్ వార్నర్ చెప్పుకొచ్చాడు. తదుపరి మ్యాచ్‌ల్లో రాణించాలంటే హైదరాబాద్ తమ బ్యాటింగ్ బలాన్ని పెంచుకోవాల్సిందే.

డికాక్ సూపర్ ఫిఫ్టీ..

డికాక్ సూపర్ ఫిఫ్టీ..

ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 208 రన్స్ చేసింది. క్వింటన్ డికాక్(39 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 67) హాఫ్ సెంచరీకి తోడుగా ఇషాన్ కిషాన్(31), హార్దిక్ పాండ్యా(28), కృనాల్ పాండ్యా(20) మెరుపులు మెరిపించారు. హైదరాబాద్ బౌలర్లలో సందీప్, కౌల్ రెండు వికెట్లు తీయగా.. రషీద్ ఖాన్ ఒక వికెట్ తీశాడు.

అనంతరం హైదరాబాద్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 174 రన్స్‌కే పరిమితమై ఓటమిపాలైంది. కెప్టెన్ డేవిడ్ వార్నర్(44 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 60) రాణించినా ఫలితంలేకపోయింది. ముంబై బౌలర్లలో బౌల్ట్, ప్యాటిన్సన్, బుమ్రా రెండేసి వికెట్లు తీయగా.. కృనాల్ పాండ్యా ఒక వికెట్ తీశాడు. కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ముంబై విజయంలో కీలక పాత్ర పోషించిన ట్రెంట్ బౌల్ట్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది.

Story first published: Sunday, October 4, 2020, 22:41 [IST]
Other articles published on Oct 4, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+