Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

విరాట్ కోహ్లీ బిడ్డపై జడేజా అనుచిత వ్యాఖ్యలు.. తన్ని తరిమేయాలన్న ఫ్యాన్స్!

Netizens slams Ajay Jadeja for his ‘worried about baby’ comment on Virat Kohli for dropping easy catches

సిడ్నీ: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై భారత మాజీ క్రికెటర్ అజయ్ జడేజా జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేశాడు. ఆస్ట్రేలియాతో బుధవారం జరిగిన రెండో టీ20లో భారత కెప్టెన్ ఓ క్యాచ్ నేలపాలు చేశాడు. ఆసీస్ తాత్కలిక కెప్టెన్ మాథ్యూ వేడ్ ఇచ్చిన సునాయస క్యాచ్ జారవిడిచిన కోహ్లీ.. ఆ వెంటనే బంతిని రాహుల్‌కు అందించి రనౌట్ చేశాడు. దీనిపై ఇన్నింగ్స్ బ్రేక్‌లో మాట్లాడిన అజయ్ జడేజా.. కోహ్లీ బిడ్డనుద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశాడు. సునాయస క్యాచ్‌లు వదిలేస్తున్న కోహ్లీ.. తన బిడ్డను ఎలా పట్టుకుంటాడోనని వివాదాస్పద రీతిలో కామెంట్ చేశాడు. 'భారత జట్టు గురించి నాకేం దిగులు లేదు. కానీ విరాట్ బిడ్డ గురించే ఆందోళనంతా'అని చెప్పుకొచ్చాడు.

ఇంకా ఏమన్నాడంటే..?

ఇంకా ఏమన్నాడంటే..?

ఇన్నింగ్స్ బ్రేక్‌లో విరాట్ క్యాచ్ జారవిడచడాన్ని విశ్లేషించిన జడేజా.. బెస్ట్ ప్లేయర్లకు కూడా ఓ దుర్దినం ఉంటుందన్నాడు. ‘కొన్నేళ్లుగా మైదానంలో విరాట్ ఫీల్డింగ్ చూస్తున్నాం. అతను ఎన్నో అద్భుత క్యాచ్‌లు అందుకున్నాడు. ఈ రోజు కూడా విరాట్ విషయంలో అదే జరిగింది. బంతిని అందుకునే క్రమంలో నియంత్రణ కోల్పోయాడు. దాంతో బంతి చేజారింది. అయితే క్యాచ్‌లు చేజారడం ఒకసారి మొదలైతే.. బొమ్మలాంటి బంతి కూడా బాంబులా దూసుకొస్తుంది.'అని సోనీ నెట్ వర్క్ చానెల్ షోలో చెప్పుకొచ్చాడు. కానీ ఈ వ్యాఖ్యలకు ముందే విరాట్ బిడ్డనుద్దేశించి జడేజా చేసిన కామెంట్ నెట్టింట వైరల్ అయింది.

 తన్ని తరిమేయండి..

తన్ని తరిమేయండి..

ఈ జుగుప్సాకరమైన వ్యాఖ్యలపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడిన జడేజాను ఆ టీవీ షో నుంచి తన్ని తరిమేయాలని డిమాండ్ చేస్తున్నారు. ‘కోహ్లీ, అతని బిడ్డను ఉద్దేశించి జడేజా చేసిన వ్యాఖ్యలు చాలా చీప్‌గా ఉన్నాయి. వెంటనే అతన్ని ఎక్స్‌ట్రా ఇన్నింగ్స్ షో నుంచి తన్ని తరమేయాలి'అని ఒకరు ట్వీట్ చేయగా.. మాజీ ఆటగాళ్లు కూడా అభిమానుల్లా మతిలేని కామెంట్స్ చేస్తున్నారని మరోకరు కామెంట్ చేశారు. ఇంత అన్ ప్రొఫెషనల్‌గా, వ్యక్తిగత జీవితాన్ని ప్రస్తావిస్తూ ఏలా కామెంట్ చేస్తారని ఇంకొకరు ప్రశ్నించారు.

టీ కొట్టు కాదురా.. అయ్యా..

టీ కొట్టు కాదురా.. అయ్యా..

‘నీ ఇష్టం వచ్చిన వ్యాఖ్యలు చేయడానికి అది టీ కొట్టు కాదురా.. అయ్యా. అదొక జాతీయ చానెల్. ఒళ్లు దగ్గరపెట్టుకొని మాట్లాడు'అని మరొక అభిమాని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ‘కోహ్లీ క్యాచ్‌లు జారవిడచడం ఎన్ని చూసినావ్ జడేజా.. నీవు నీ చెత్త వ్యాఖ్యలు'అంటూ మరొక అభిమాని మండిపడ్డాడు. కామెంటేటర్లంతా దిగ్గజాలనుకుంటున్నారని, చెత్త వ్యాఖ్యానంతో విసుగు తెప్పిస్తున్నారని మరో యూజర్ అసహనం వ్యక్తం చేశాడు.

ఈ మధ్య తరుచూ..

ఈ మధ్య తరుచూ..

ఇక కోహ్లీ క్యాచ్ జారవిడచడం కూడా ఇదే తొలిసారి కాదు. ఫస్ట్ టీ20లో కూడా విరాట్ సునాయస క్యాచ్‌ను నేలపాలు చేశాడు. ఐపీఎల్‌లోనూ విడిచిపెట్టాడు. వరల్డ్ క్లాస్ ఫీల్డర్‌గా ఏన్నో అద్భుత క్యాచ్‌లు అందుకున్న విరాట్ ఇలా క్యాచ్‌లు జారవిడచడం అందిర్ని ఆశ్చర్యపరిచింది. కానీ అంతమాత్రన అతను తన బిడ్డను పట్టుకోలేడా? జడేజా.. అతని చెత్త కామెంట్స్ కాకపోతే.! ఇక విరాట్ సతీమణి అనుష్క శర్మ జనవరిలో బిడ్డకు జన్మనివ్వనుంది. ప్రసవ సమయంలో ఆమెకు అండగా ఉండేందుకు కోహ్లీ.. ఇప్పటికే పెటర్నీటీ లీవ్ తీసుకున్నాడు. ఆసీస్‌తో ఫస్ట్ టెస్ట్ అనంతరం భారత్‌కు రానున్నాడు.

విరాట్ కోహ్లీ బాటలోనే రోహిత్ శర్మ.. గాయాలవ్వకుండా ఉండేందుకు కఠిన నిర్ణయం!

Story first published: Monday, December 7, 2020, 17:57 [IST]
Other articles published on Dec 7, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+