పాంటింగ్‌కు భయపడ్డావా? అశ్విన్ మన్కడింగ్ స్టంట్‌పై నెట్టింట పేలుతున్న జోక్స్, మీమ్స్!

దుబాయ్: ఢిల్లీ క్యాపిటల్స్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మైదానంలో చేసిన మన్కడింగ్ స్టంట్‌పై నెట్టంట జోకులు పేలుతున్నాయి. నెటిజన్లు ఫన్నీ మీమ్స్, కామెంట్స్, వీడియోలతో హల్‌చల్ చేస్తున్నారు. ఢిల్లీ క్యాపిటల్స్ కోచ్ రికీ పాంటింగ్ ఎఫెక్ట్ ఏమో లేక గతేడాది జరిగిన రచ్చ కారణంగానో కానీ రవిచంద్రన్ అశ్విన్ ఈ సారి మన్కడింగ్ (నాన్ స్టైకర్ ఎండ్‌లో బ్యాట్స్‌మన్ క్రీజ్ దాటినప్పుడు చేసే రనౌట్) చేయలేదు. కానీ తన చర్యతో నవ్వులు పూయించాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ)తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు ఓపెనర్ ఆరోన్ ఫించ్‌కు అశ్విన్ అదిరిపోయే ఝలక్ ఇచ్చాడు. దాంతో మైదానంలో నవ్వులుపూసాయి.
మన్కడింగ్ ఎందుకు చేయలేదు...?
గతేడాది ఐపీఎల్‌లో రాజస్థాన్ బ్యాట్స్‌మన్ జోస్ బట్లర్‌ను ‘మన్కడింగ్' ద్వారా ఔట్ చేసి రవిచంద్రన్ అశ్విన్ వివాదానికి తెరలేపాడు. అప్పుడు అశ్విన్ కింగ్స్ పంజాబ్ కెప్టెన్‌గా ఉన్నాడు. అప్పట్లో దీనిపై తీవ్ర దుమారం రేగింది. ఇది క్రీడా స్పూర్తికి విరద్దుమని మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు అశ్విన్‌పై ఆగ్రహం వ్యక్తం చేయగా.. తాను మాత్రం నిబంధనల్లో ఉన్నది చేసానని ఈ సీనియర్ స్పిన్నర్ సమర్దించుకున్నాడు. క్రీడా స్పూర్తికి విరుద్దమైతే నిబంధనల్లో నుంచి తీసేయండంటూ గట్టిగా కౌంటరిచ్చాడు. అప్పటి నుంచి మన్కడింగ్ అంటే అశ్విన్.. అశ్విన్ అంటే మన్కడింగ్‌లా మారిపోయింది. ఈ నిబంధనను తీసేయాలనే డిమాండ్ కూడా వ్యక్తమైంది.
పాంటింగ్‌కు భయపడ్డావా?
ఇక మన్కడింగ్‌ను తప్పుబట్టిన రికీ పాంటింగ్.. ఇది క్రీడాస్పూర్తిగా విరుద్దమని, తన కోచ్‌గా ఉన్నన్ని రోజులు దీన్ని అనుమతించనని లీగ్‌కు ముందు చెప్పాడు. ఈ విషయంపై అశ్విన్‌తో చర్చిస్తానన్నాడు. అయితే తాజాగా మన్కడింగ్ చేసే అవకాశం ఉన్నా అశ్విన్ వెనక్కి తగ్గడంతో ఎందుకు చేయలేదంటూ అభిమానులు అశ్విన్‌ను నిలదీస్తున్నారు. పాంటింగ్‌కు భయపడ్డావా? అని ప్రశ్నిస్తున్నారు. ఫించ్‌ను మన్కడింగ్ చేయకపోయే సరికి బట్లర్ తెగ ఫీలవుతున్నాడని ఫన్నీ మీమ్స్ ట్రెండ్ చేస్తున్నారు.
ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్..
ఇక మ్యాచ్ అనంతరం అశ్విన్ ట్విటర్ వేదికగా అందరికీ గట్టి హెచ్చరిక జారీ చేశాడు. 2020లో ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్ అని పేర్కొన్నాడు. మళ్లీ ఎవరైనా అలా క్రీజు వదిలి ముందుకు వెళితే తాను కచ్చితంగా ఔట్ చేస్తానని అధికారికంగా వెల్లడించాడు. అలాగే ఈ ట్వీట్‌లో రికీ పాంటింగ్, ఆరోన్ ఫించ్‌ను ట్యా్‌గ్ చేస్తూ తామంతా మంచి స్నేహితులమే అని పేర్కొన్నాడు. ‘ముందే చెబుతున్నా.. 2020లో ఇదే ఫస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. అధికారికింగా చెబతున్నా తర్వాత నన్ను నిందించవద్దు. పాంటింగ్, ఫించ్, నేను మంచి స్నేహితులం'అని ట్వీట్ చేశాడు.

మన్కడింగ్ అంటే ఏంటి?
క్రికెట్ నియమావళి 41.16 ప్రకారం నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న బ్యాట్స్‌మన్ క్రీజు వదిలి ముందుకు వెళితే.. ఆ సమయంలో అతడిని బౌలర్ రనౌట్ చేసే విధానాన్ని మన్కడింగ్ అంటారు. అయితే దీన్ని1947-48 ఆస్ట్రేలియా పర్యటనలో తొలిసారిగా భారత దిగ్గజ బౌలర్ వినూ మన్కడ్ చేయడంతో ఆయన పేరుమీదుగా మన్కడింగ్ ఔట్‌గా నిబంధనల్లో చేర్చారు. మన్కడ్ బౌలింగ్ చేస్తున్న సమయంలో ఆసీస్ బ్యాట్స్‌మన్ బిల్ బ్రౌన్ పదేపదే బంతి వేయకముందే క్రీజు వదిలి పరుగుకు ప్రయత్నించాడు. దీంతో పలుమార్లు మన్కడ్ అతన్ని వారించినా వినిపించుకోలేదు.
దీంతో బ్రౌన్ క్రీజు దాటిన తర్వాత మన్కడ్ అతన్ని రనౌట్ చేశాడు. క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా ఉన్న ఈ నిబందనకు భారత క్రికెట్ దిగ్గజం పేరును తొలిగించాలని క్రికెట్ నిబంధనలు రూపొందించే ఎంసీసీ (మెరిలిన్ క్రికెట్ క్లబ్)కి మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ సూచించాడు. అవసరమైతే తొలిసారిగా ఇలా ఔటైన బిల్ బ్రౌన్ పేరు మీదుగా బ్రౌన్డ్ అని పిలువాలంటూ గవాస్కర్ స్పష్టం చేశాడు.
RCB vs DC: బీమర్ రచ్చ.. సైనీ సారీ చెప్పాలని పట్టుబట్టిన పంత్!
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications