Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

విరాట్ కోహ్లీ ఫామ్‌లోకి వచ్చాడు జాగ్రత్త.. టాస్ ఓడితే ఇంగ్లండ్ పని అంతే!

Nasser Hussain Hails Joe Root, Says England Captain Can Break All Records

లండన్: ఫస్ట్ మ్యాచ్‌లో ఓడిన భారత జట్టు రెండో టెస్టులో పుంజుకొనే అవకాశం ఉందని ఇంగ్లండ్‌ మాజీ క్రికెటర్‌ నాజర్‌ హుస్సేన్‌ అన్నాడు. విరాట్‌ కోహ్లీ ఫామ్‌లోకి రావడంతో జాగ్రత్తగా ఉండాలని రూట్‌ సేనకు సూచించాడు. టాస్‌ ఓడితే రెండో టెస్టులో ఇంగ్లిష్‌ జట్టు గెలవడం కష్టమేనని అభిప్రాయపడ్డాడు. తొలి టెస్టులో కోహ్లీసేన 277 పరుగుల తేడాతో ఓడిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ జట్టుకు ఈ మాజీ క్రికెటర్ పలు సూచనలు చేశాడు. ఆసీస్ పర్యటనలో కూడా భారత్ ఇంత కన్నా దారుణంగా ఓడి.. నేలకు కొట్టిన బంతిలా పుంజుకుందని గుర్తు చేశాడు. తాజాగా స్కై స్పోర్ట్స్‌తో మాట్లాడిన నాజర్ హుస్సేన్.. శనివారం నుంచి ప్రారంభం కానున్న సెకండ్ టెస్ట్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

నేలకు కొట్టిన బంతిలా..

నేలకు కొట్టిన బంతిలా..

'టీమిండియా బలంగా పుంజుకుంటుందనే అంశాన్ని ఇంగ్లండ్‌ దృష్టిలో పెట్టుకోవాలి. ఆస్ట్రేలియాలోనూ తొలి టెస్టులో భారత్‌ ఓడింది. 36 పరుగులకే ఆలౌటైనా తర్వాత బలంగా పుంజుకుంది. రెండో టెస్టులో టాస్‌ ఓడితే ఇంగ్లండ్‌కు గెలుపు అవకాశాలు కష్టమవుతాయి. అయితే తొలి టెస్టులో గెలుపు కోసం కోహ్లీసేన సాధ్యమైనంతగా పోరాడింది. భారత పర్యటనలో ఇంగ్లండ్‌ 4-0తో క్లీన్‌స్వీప్‌ అవుతుందని చాలామంది అంచనా వేసారు. పర్యాటక జట్టుకు ఎలాంటి అవకాశం ఉందన్నారు. భారత్‌ సైతం ఆట పరంగా గొప్పగా కనిపించింది. ఆసీస్‌‌పై గెలవడం, విరాట్‌ తిరిగిరావడంతో అంతా అలాగే అంచనా వేసారు.

జాగ్రత్తగా ఉండాలి..

జాగ్రత్తగా ఉండాలి..

'ఈ విజయం ఇంగ్లండ్‌ను సరైన స్థానంలో నిలబెట్టింది. వారు అత్యుత్తమంగా ఆడారు. తొలి బంతి నుంచి ఆఖరి వరకు పట్టుదలతో ఉన్నారు. ఇదే జోరును వారిప్పుడు కొనసాగించాలి. ఫామ్‌లోకి వచ్చిన విరాట్ కోహ్లీతో జాగ్రత్తగా ఉండాలి. మరీ ముఖ్యంగా భారత్ ఓటమి దెబ్బతిన్నది. గెలవాలనే కసితోనే బరిలోకి దిగుతుంది. దానికి తగ్గట్లు ప్రణాళికలు రచించాలి. జేమ్స్ అండర్సన్‌కు రెస్ట్ ఇచ్చి స్టువర్ట్ బ్రాడ్‌ను తీసుకురావాలి. బెయిర్ స్టోను తుది జట్టులోకి తీసుకోవాలి'అని నాజర్ హుస్సేన్ చెప్పుకొచ్చాడు.

రెండు కళ్లు చాలవు..

రెండు కళ్లు చాలవు..

స్పిన్‌ను బాగా ఆడే తమ దేశ అత్యుత్తమ ఆటగాడు రూట్‌ అని, టెస్టుల్లో ఇంగ్లండ్‌ బ్యాటింగ్‌ రికార్డులన్నీ అతను బద్దలుకొడతాడని ఈ ఇంగ్లండ్ మాజీ కెప్టెన్‌ అభిప్రాయపడ్డాడు. 'ఇంగ్లండ్‌ దిగ్గజ ఆటగాళ్లలో కచ్చితంగా రూట్‌ ఒకడు. బహుశా అన్ని ఇంగ్లండ్‌ బ్యాటింగ్‌ రికార్డులను అతను బద్దలు కొడతాడని అనుకుంటున్నా. అలిస్టర్‌ కుక్‌ పేరిట ఉన్న 161 మ్యాచ్‌ల రికార్డును, అత్యధిక పరుగులనూ దాటేసే వీలుంది. రూట్‌కు ఇప్పుడు 30 ఏళ్లే. ఆల్‌టైమ్‌ ఇంగ్లండ్‌ బ్యాటింగ్‌ దిగ్గజాల జాబితాలో కుక్, గ్రహమ్‌ గూచ్, పీటర్సన్‌ సరసన రూట్‌ ఉంటాడు. స్పిన్‌ను ఆడడంలో అతనే అత్యుత్తమం. అతనాడే స్వీప్‌ షాట్లు చూసేందుకు రెండు కళ్లు చాలవు'' అని హుస్సేన్‌ అన్నాడు.

India vs England: భారత్ గెలవాలంటే.. రోహిత్ శర్మతో సహా ఆ ఇద్దరిపై వేటు వేయాలి!

Story first published: Thursday, February 11, 2021, 11:54 [IST]
Other articles published on Feb 11, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+