Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

గుడ్‌ బాల్ సిక్సర్‌‌గా వెళ్లినా.. ధోనీ చప్పట్లతో బౌలర్‌ను అభినందిస్తాడు: ముత్తయ్య మురళీధరన్

Muttiah Muralitharan Says MS Dhoni would clap for the bowler when a good ball was hit for a six

చెన్నై: టీమిండియా మాజీ కెప్టెన్, సీనియర్ వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీ‌పై శ్రీలంక దిగ్గజ స్పిన్నర్ ముత్తయ్య మురళిధరన్ ప్రశంసల జల్లు కురిపించాడు. అతని విలక్షణమైన నాయకత్వం, నిరాడంబర తత్వం ధోనీని శిఖరాన నిలబెట్టిందన్నాడు. మహీ బౌలర్లకు పూర్తి స్వేచ్చనిస్తాడని, మంచి బంతి సిక్స్‌గా వెళ్లిన చప్పట్లతో బౌలర్‌ను అభినందిస్తాడని తెలిపాడు.

ఐపీఎల్‌లో ధోనీ సారథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ తరుఫున ఆడిన మురళీధరణ్.. మహీ కెప్టెన్సీని కొనియాడాడు. తాజాగా టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ యూట్యూబ్ చానెల్‌'డిఆర్‌ఎస్ విత్ యాష్‌ చాట్ షో'లో పాల్గోన్న ఈ శ్రీలంక వెటరన్ స్పిన్నర్ ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు.

పూర్తి స్వేచ్చనిస్తాడు..

పూర్తి స్వేచ్చనిస్తాడు..

‘ధోనీ ఖచ్చితంగా యువ సారథేనని నేను అంటాను. 2007 టీ20 ప్రపంచకప్‌లో జట్టును నడిపించడమే కాకుండా చాంపియన్‌గా నిలబెట్టాడు. అతని వ్యూహాలు, సిద్దాంతాలు బాగుంటాయి. ఫీల్డింగ్ సెట్ చేసుకునే విషయంలో బౌలర్లకే పూర్తి స్వేచ్చనిస్తాడు. అది వర్కౌట్ కాకుంటే వారిని అడిగి మరి ఫీల్డింగ్ మార్పులు చేర్పులు చేస్తాడు.

ఓ మంచి బాల్ సిక్సర్‌గా వెళ్లినా ధోనీ చప్పట్లతో బౌలర్‌ను అభినందిస్తాడు.

అంతేకాకుండా అది గుడ్‌బాల్ అని, బ్యాట్స్‌మన్ సిక్స్ కొట్టాడని పట్టించుకోవద్దని చెబుతాడు. బ్యాట్స్‌మెన్‌కు కూడా టాలెంట్ ఉంటుందని బౌలర్‌కు చెప్పి కావాల్సిన ధైర్యాన్నిస్తాడు. మరోవైపు ఏదైనా సూచనలు చేయాలంటే మహీ అందరిముందు చెప్పకుండా వ్యక్తిగతంగా కలిసి మాట్లాడతాడు. అతనికి ఏం కావాలో స్పష్టంగా వివరించి బౌలర్ల నుంచి అది రాబట్టుకుంటాడని తెలిపాడు.

ధోనీ సక్సెస్‌కు కారణం..

ధోనీ సక్సెస్‌కు కారణం..

ప్రశాంతంగా ఆలోచించే సామర్థ్యం, ఇతరుల సూచనలను గౌరవించే విధానం అతన్ని ఓ గోప్పనాయకుడిగా నిలబెట్టాయి. చివరకు అతను యువకుడిగా ఉన్నప్పుడు కూడా సీనియర్ల అభిప్రాయాలు గౌరవించేవాడు. వారందరి మాటలు ఓపిగ్గా విని ఫైనల్‌గా ఓ నిర్ణయం తీసుకునేవాడు. ఆటగాళ్లలో ధోనీ మ్యాచ్‌ విన్నర్లను చూస్తాడు. ఆ ఫార్ములాతోనే ఐపీఎల్‌లో చెలరేగుతాడు. ఇలానే సారథ్యం వహిస్తూ సక్సెస్ అవుతున్నాడు'అని మురళి చెప్పుకొచ్చాడు.

పొట్టిగా ఉన్నానని..

పొట్టిగా ఉన్నానని..

ఈ స్పిన్‌ దిగ్గజం తొలుత ఫాస్ట్‌బౌలర్‌గా ఉండేవాడట. కానీ అండర్‌ 13 స్థాయిలో పొడుగ్గా లేనని తన కోచ్‌ ఫాస్ట్‌ బౌలింగ్‌కు పనికి రావని చెప్పాడట. ఫాస్ట్‌ బౌలర్‌ అవ్వాల్సిన తాను ఆ మాటతో స్పిన్‌ బౌలర్‌గా మారానని చెప్పాడు. అలాగే, సహజంగా ఆఫ్‌ స్పిన్నర్‌ అయిన తాను పాఠశాల స్థాయిలో ఆడేటప్పుడు లెగ్‌స్పిన్నర్‌గా కొనసాగినట్లు చెప్పాడు. అందుకు కారణం తమ స్కూల్లో అప్పటికే ఇద్దరు ఆఫ్‌స్పిన్నర్లు ఉన్నారని, తనకు అవకాశం వచ్చేందుకు వీలుగా బౌలింగ్‌ను మార్చుకున్నానని చెప్పాడు. అలా తాను ఆఫ్‌స్పిన్నర్‌ కంటే ముందు లెగ్‌స్పిన్నర్‌గానూ బౌలింగ్‌‌ చేసినట్లు వెల్లడించాడు.

చెన్నై తరఫున ..

చెన్నై తరఫున ..

మురళీధరన్‌ ప్రపంచంలోనే అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. టెస్టుల్లో 800 వికెట్లు, వన్డేల్లో 534 వికెట్లు తీసిన అతడు ఐపీఎల్‌లోనూ రాణించాడు. 66 మ్యాచ్‌ల్లో 63 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్ 2008 నుంచి 2010 వరకు చెన్నై సూపర్ కింగ్స్ తరఫున బరిలోకి దిగిన మురళీధరన్.. ధోనీ సారథ్యంలో 40 వికెట్లు పడగొట్టాడు.

పేకాట ఆడండి.. గిటార్ నేర్చుకోండి.. ఐపీఎల్‌ను ఎంజాయ్ చేయండి: బ్రెట్‌లీ

Story first published: Monday, August 10, 2020, 13:57 [IST]
Other articles published on Aug 10, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+