న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పేకాట ఆడండి.. గిటార్ నేర్చుకోండి.. ఐపీఎల్‌ను ఎంజాయ్ చేయండి: బ్రెట్‌లీ

Brett Lee tells IPL-bound players Learn guitar, play some cards to maintain bio-secure bubble

న్యూఢిల్లీ: కరోనాతో ఆగిపోయిన ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2020 సీజన్‌ యూఏఈ వేదికగా సెప్టెంబర్ 19 నుంచి ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. కరోనా నేపథ్యంలో అత్యంత కట్టుదిట్టమైన భద్రతా వలయంలో ఈ లీగ్ నిర్వహించేందుకు భారత క్రికెట్ నియంత్రణమండలి సన్నదమవుతుంది. ఈ క్యాష్ రిచ్‌లీగ్‌లో పాల్గొనే ఆటగాళ్లంతా కచ్చితంగా బయో సెక్యూర్ బబుల్ నిబంధనలు పాటించాల్సిందే.

విసుగు రాకుండా..

విసుగు రాకుండా..

ఈ నేపథ్యంలోనే ఆటగాళ్లంత హోటల్లోనే ఎక్కువగా గడపాల్సి ఉంటుంది. బయటకు వెళ్లడానికి వీలుండదు. దాదాపు రెండు నెలల పాటు అలా గడపాలంటే వాళ్లకు విసుగు రావచ్చు. దాన్ని దూరం చేసుకోవడానికి ఆ సమయంలో గిటార్‌ నేర్చుకోవాలని, పేకాట ఆడాలని ఆస్ట్రేలియా మాజీ పేసర్‌ బ్రెట్‌ లీ ప్లేయర్లకు సూచిస్తున్నాడు. తాజాగా స్టార్ స్పోర్ట్స్ క్రికెట్ కనెక్టెడ్ షోలో పాల్గొన్న అతను పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.

 ఎవరూ తప్పు చేయరు..

ఎవరూ తప్పు చేయరు..

‘ముందుగా ఆరోగ్యం కాపాడుకోవడం కోసం భౌతిక దూరంతో పాటు కరోనా నిబంధనలన్నింటినీ ఆటగాళ్లు పాటించాలి. కాబట్టి ఏ క్రికెటర్‌ కూడా నిబంధనలు అతిక్రమించి తప్పు చేస్తాడని నేననుకోవట్లేదు. వాళ్లు తమ జట్లు, అభిమానుల గురించి కూడా ఆలోచించాలి. ఎందుకంటే ఒకవేళ ఐపీఎల్‌ జరగకపోతే అదో విపత్తుగా మారేది కదా. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు క్రికెట్‌ను చూడాలనుకుంటున్నారు. ఇన్ని రోజలు వాళ్లు ఆ ఆనందానికి దూరమయ్యారు. కాబట్టి ఆటగాళ్లు బబుల్‌లోనే ఉంటూ అన్ని జాగ్రత్తలు పాటిస్తారనే నమ్మకముంది.

నేను గిటార్ వాయించేవాడిని..

నేను గిటార్ వాయించేవాడిని..

దాదాపు ఎనిమిది వారాలు లీగ్‌ జరగనుంది. దాని కోసం ఆటగాళ్లకు భారీగానే చెల్లించారు. కాబట్టి ఆ సమయాన్ని ఆస్వాదించండి. గిటార్‌ నేర్చుకోండి. నేనాడే రోజుల్లో నా హోటల్‌ గదిలో గిటార్‌ వాయించడాన్ని ఇష్టపడేవాణ్ని. నాకు బయటకు వెళ్లి గోల్ఫ్‌ ఆడాల్సిన అవసరం ఉండేది కాదు. అలాగే పేకాట ఆడండి'' అని లీ తెలిపాడు. రాక్‌ బాండ్‌ సిక్స్‌ అండ్‌ ఔట్‌ బృందం తరపున బ్రెట్‌ లీ గిటార్‌ వాయిస్తుంటాడు.

కుంబ్లే సరైనోడు..

కుంబ్లే సరైనోడు..

ఈ సీజన్‌ కోసం కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌కు అనిల్‌ కుంబ్లే రూపంలో సరైన కోచ్‌ దొరికాడని, ఆ జట్టు ట్రోఫీ గెలిస్తే చూడాలని ఉందని ఒకప్పుడు ఆ జట్టుకు ఆడిన లీ పేర్కొన్నాడు. ‘కింగ్స్ ఎలెవన్ టైటిల్ గెలవాల్సిన అవసరం ఉంది. అదో గొప్ప ఆటగాళ్లతో కూడిన అద్భుతమైన జట్టు. విజయానికి చేరువగా వచ్చి ఫలితాన్ని అందుకోలేకపోయింది. ఆ జట్టు చాంపియన్‌‌గా నిలిస్తే చూడాలని ఉంది. దాని కోసం నేను వెయిట్ చేస్తున్నా. ఈ ఫ్రాంచైజీకి ఆడటం చాలా సరదాగా ఉండేది'అని బ్రెట్‌లీ చెప్పుకొచ్చాడు. ఇక తన ఐపీఎల్ కెరీర్‌లో బ్రెట్‌లీ కింగ్స్ పంజాబ్‌తో పాటు కోల్‌కతా నైట్ రైడర్స్‌కు ఆడాడు.

అందుకే అంబటి రాయుడిని ప్రపంచకప్‌కు ఎంపిక చేయలేదు: మాజీ సెలెక్టర్ గగన్ ఖోడా

Story first published: Monday, August 10, 2020, 11:49 [IST]
Other articles published on Aug 10, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X