18 ఏళ్లుగా కలిసి ఆడుతున్నాం.. మైదానంలో నువ్వు లేకుండా ఆడటం బాధగా ఉంది: ముష్ఫికర్ భావోద్వేగం

హైదరాబాద్: తన జట్టు సహచర క్రికెటర్ షకీబ్ అల్ హసన్‌కు ఐసీసీ రెండేళ్ల నిషేధం విధించడం గురించి తెలుసుకున్న బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ ముష్ఫికర్ రహీమ్ ఉద్వేగానికి లోనయ్యాడు. ఈ మేరకు తన ఫేస్‌బుక్ పేజిలో ఓ పోస్టు పెట్టాడు. అందులో మైదానంలో నువ్వు లేకుండా ఆడటం గురించి ఆలోచించడం చాలా విచారకరమని పేర్కొన్నాడు.
ముష్ఫికర్ తన ఫేస్‌బుక్‌లో "వయసు సమానం.. అంతర్జాతీయ క్రికెట్‌లో గత 18 ఏళ్లగా కలిసి క్రికెట్ ఆడుతున్నాం ... మైదానంలో నువ్వు లేకుండా ఆడటం గురించి ఆలోచించడం కూడా చాలా బాధగా ఉంది. నువ్వు త్వరలోనే ఛాంపియన్‌గా తిరిగి వస్తారని ఆశిస్తున్నాను. నీకు నా మద్దతుతో పాటు బంగ్లాదేశ్ మొత్తం అండగా ఉంది" అని పోస్టు పెట్టాడు.

బుకీ తనను సంప్రదించిన విషయాన్ని
ఓ బుకీ తనను సంప్రదించిన విషయాన్ని షకీబ్ ఐసీసీ అవినీతి నిరోధక శాఖకు తెలపకపోవడంతో అతడిపై రెండు సంవత్సరాల పాటు నిషేధం విధిస్తున్నట్లు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) మంగళవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. రెండు సంవత్సరాల పాటు ఎటువంటి క్రికెట్ ఆడకుండా ఐసీసీ నిషేధం విధించింది.
రెండేళ్ల పాటు నిషేధం: బంగ్లా క్రికెటర్ షకీబ్-బుకీ వాట్సాప్ సంభాషణను విడుదల చేసిన ఐసీసీ

ఏడాది సస్పెన్షన్ తర్వాత క్రికెట్ ఆడొచ్చు
ఇందులో ఏడాది సస్పెన్షన్ తర్వాత క్రికెట్ ఆడొచ్చని వెల్లడించింది. 2017 బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్(బీపీఎల్) సందర్భంగా నవంబర్‌లో తొలిసారి భారత బుకీ దీపక్ అగర్వాల్ షకీబ్‌ను సంప్రదించగా ఆ తర్వాత 2018 జనవరిలో ఒకసారి, ఏప్రిల్‌లో ఐపీఎల్లో మరోసారి సంప్రదించాడు. ఈ విషయాలను షకీబ్ ఐసీసీ అవినీతి నిరోధక శాఖకు చెప్పలేదు.

ఐసీసీ విచారణలో
అయితే, ఐసీసీ విచారణలో యాంటీ కరప్షన్ కోడ్‌లోని మూడు చార్జ్‌లను ఉల్లంఘించినట్లు షకీబ్ దర్యాప్తు అధికారుల ముందు అంగీకరించడంతో మంగళవారం షకీబ్‌కు శిక్షను ఖరారు చేసింది. దీంతో నవంబర్ 3 నుంచి ఆరంభమయ్యే భారత్ పర్యటనకు దూరమయ్యాడు. ఈ పర్యటనలో భాగంగా బంగ్లాదేశ్ 3 టీ20లు, 2 టెస్టులు ఆడనుంది.
తొలి డే/నైట్ టెస్టుకు ఆతిథ్యం: ఈడెన్ గార్డెన్స్ చరిత్ర, గణాంకాలు, ఆడిన చిరస్మరణీయ మ్యాచ్‌లివే!

భారత పర్యటనతో పాటు టీ20 వరల్డ్‌కప్‌కు దూరం
ఈ సిరిస్ మొత్తానికి షకీబే కెప్టెన్‌గా వ్యవహారించాల్సి ఉంది. ఇప్పుడు అతడి స్థానంలో ముష్ఫికర్ రహీమ్ టెస్టులు, మొసాదిక్ హుస్సేన్ టీ20లకు నాయకత్వం వహించనున్నారు. భారత పర్యటనతో పాటు షకీబ్ వచ్చే ఏడాది జరిగే ఐపీఎల్ సీజన్‌తో పాటు ఆస్ట్రేలియా వేదికగా అక్టోబర్ 18 నుంచి నవంబర్ 15 వరకు జరిగే టీ20 వరల్డ్‌కప్‌కు దూరమయ్యాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications