Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

తొలి డే/నైట్ టెస్టుకు ఆతిథ్యం: ఈడెన్ గార్డెన్స్ చరిత్ర, గణాంకాలు, ఆడిన చిరస్మరణీయ మ్యాచ్‌లివే!

Eden Gardens to host Indias first day-night Test: Check out Eden Gardens history, stats, memorable matches & more

హైదరాబాద్: భారత టెస్టు క్రికెట్లో ఓ సరికొత్త ఇన్నింగ్స్‌. టీమిండియా భారత్‌లో తొలి డే/నైట్ టెస్టు ఆడబోతోంది. నవంబర్‌ 22 నుంచి 26 వరకు భారత్-బంగ్లాదేశ్‌ జట్ల మధ్య జరిగే రెండో టెస్టును ఫ్లడ్‌లైట్ల వెలుతురులో పింక్‌బాల్‌తో నిర్వహించేందుకు రంగం సిద్ధమైంది. డే/నైట్ టెస్టుకు బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు (బీసీబీ)ను బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ ఒప్పించిన సంగతి తెలిసిందే.

కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో డే/నైట్‌ టెస్టు మ్యాచ్‌లో భాగంగా ఆట మధ్యాహ్నం ఒంటి గంట 30 నిమిషాల నుంచి ప్రారంభం కానుంది. డే/నైట్ టెస్టును అభిమానులకు మరింత చేరువ చేసేందుకు గాను టికెట్ల ధరను కనిష్టంగా రూ. 50 నుంచి విక్రయిస్తామని 'క్యాబ్‌' సెక్రటరీ అవిషేక్‌ దాల్మియా తెలిపాడు. భారత్‌లో తొలి డే/నైట్‌ టెస్టుకు ఆతిథ్యమివ్వబోతోన్న ఈడెన్‌ గార్డెన్స్‌కు విశేషమైన చరిత్ర ఉంది. ఆ చరిత్రను ఒక్కసారి పరిశీలిద్దాం....

ఈడెన్ గార్డెన్స్ చరిత్రను ఒక్కసారి చూస్తే!

ఈడెన్ గార్డెన్స్ చరిత్రను ఒక్కసారి చూస్తే!

* ఈ స్టేడియం జనవరి 5, 1934 న ప్రారంభించబడింది. ఆసియాలోనే అతి పురాతన టెస్ట్ వేదికగా నిలిచింది.

* ఈ స్టేడియంలో ఇప్పటివరకు 41 టెస్టులు, 30 వన్డేలు మరియు 7 టి20లకు ఆతిథ్యమిచ్చింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో కోల్‌కతా నైట్ రైడర్స్ సొంత గ్రౌండ్.

* ఈ స్టేడియంలో టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు వీవీఎస్ లక్ష్మణ్(1217). అత్యధిక వికెట్లు తీసింది హర్భజన్ సింగ్ - 46

* ఈ స్టేడియంలో వీవీఎస్ లక్ష్మణ్, మహ్మద్ అజాహరుద్దీన్ ఐదు సెంచరీలు సాధించారు.

* 2014లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ శర్మ అత్యధిక వన్డే స్కోరు 264ను ఈ స్టేడియంలోనే సాధించాడు.

* కపిల్ దేవ్, చేతన్ శర్మల తర్వాత వన్డేల్లో హ్యాట్రిక్ సాధించిన మూడో భారత బౌలర్‌గా కుల్దీప్ యాదవ్ నిలిచాడు. 2017లో ఆస్ట్రేలియాతో జరిగిన ఈ మ్యాచ్‌లో కుల్దీప్ ఈ ఘనత సాధించాడు.

ఇంగ్లాండ్ బయట వరల్డ్‌కప్ పైనల్‌కు ఆతిథ్యమిచ్చిన తొలి గ్రౌండ్

1987లో ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్‌కి ఈడెన్ గార్డెన్స్ ఆతిథ్యమిచ్చింది. అలెన్ బోర్డర్ నాయకత్వంలోని ఆస్ట్రేలియా జట్టు తొలిసారి వన్డే వరల్డ్‌కప్‌ను సొంతం చేసుకుంది. క్రికెట్ మక్కాగా భావించే లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ బయట జరిగిన తొలి వరల్డ్‌కప్ ఫైనల్ ఇదే. అంతకముందు లార్డ్స్ వరుసగా 1975, 1979, 1983 వరల్డ్‌కప్ పైనల్స్‌కు ఆతిథ్మమిచ్చింది.

మొదటి ఆసియా టెస్టు ఛాంపియన్‌షిప్ మ్యాచ్‌కు ఆతిథ్యం

మొదటి ఆసియా టెస్టు ఛాంపియన్‌షిప్ మ్యాచ్‌కు ఆతిథ్యం

మొదటి ఆసియా టెస్టు ఛాంపియన్‌షిప్ మ్యాచ్‌ ఈడెన్ గార్డెన్స్ వేదికగానే జరిగింది. ఈ మ్యాచ్‌లో కొన్ని అద్భుతమైన ప్రదర్శనలు నమోదయ్యాయి. 1999లో జరిగిన ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ జట్టు విజేతగా నిలిచింది. క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్‌లకు పాకిస్థాన్ మాజీ పేసర్ వేసిన బంతులు క్రికెట్ అభిమానులకు ఇప్పటికీ గుర్తే.

డే/నైట్ టెస్టుకు ఆతిథ్యం

డే/నైట్ టెస్టుకు ఆతిథ్యం

భారత్‌, బంగ్లాదేశ్‌, ఐర్లాండ్, ఆప్ఘనిస్థాన్ తప్ప టెస్టు హోదా ఉన్న అన్ని దేశాలూ డే/నైట్‌ టెస్టులు ఆడాయి. 2015లో ఆస్ట్రేలియా-న్యూజిలాండ్‌ మధ్య ఫ్లడ్‌లైట్ల వెలుతురులో గులాబి బంతులతో తొలి డే/నైట్‌ టెస్టు జరిగింది. ఆ తర్వాత భారత్‌‌లో గతేడాది ప్రయోగాత్మకంగా దులీప్‌ ట్రోఫీ ఫైనల్‌ను డే/నైట్‌లో నిర్వహించారు. అయితే, పింక్ బాల్స్ అంత నాణ్యంగా లేవనే కారణంతో బీసీసీఐ డే/నైట్‌ టెస్టు ప్రతిపాదనలను తిరస్కరిస్తూ వస్తుంది. గత ఏడాది చివర్లో ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌లో భాగంగా ఓ మ్యాచ్‌ను డే/నైట్‌లో ఆడాలని క్రికెట్‌ ఆస్ట్రేలియా కోరినా బీసీసీఐ అందుకు అంగీకరించలేదు. అయితే గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడయ్యాక మళ్లీ డే/నైట్‌ టెస్టు ప్రతిపాదన తెరపైకి వచ్చింది. భారత్ పర్యటనలో బంగ్లాదేశ్‌ టీ20, టెస్ట్ సిరీస్ ఆడనుంది. ఇరు జట్లు 22 నుంచి రెండో టెస్టు కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా తొలి డే/నైట్ టెస్టు ఆడతాయి.

Story first published: Wednesday, October 30, 2019, 12:50 [IST]
Other articles published on Oct 30, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+