రెండేళ్ల పాటు నిషేధం: బంగ్లా క్రికెటర్ షకీబ్-బుకీ వాట్సాప్ సంభాషణను విడుదల చేసిన ఐసీసీ

హైదరాబాద్: బంగ్లాదేశ్ టెస్టు, టీ20 కెప్టెన్ షకీబ్ ఉల్ హాసన్‌పై రెండు సంవత్సరాల పాటు నిషేధం విధిస్తున్నట్లు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) మంగళవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. రెండు సంవత్సరాల పాటు ఎటువంటి క్రికెట్ ఆడకుండా ఐసీసీ నిషేధం విధించింది. ఇందులో ఏడాది సస్పెన్షన్ తర్వాత క్రికెట్ ఆడొచ్చని వెల్లడించింది.
2018 జనవరిలో బంగ్లాదేశ్, శ్రీలంక, జింబాబ్వే ముక్కోణపు టోర్నీ సందర్భంగా ఓ బుకీ మ్యాచ్ ఫిక్సింగ్ చేయమని షకీబ్‌కు ఓ అద్భుతమైన ఆఫర్ ఇచ్చాడు. తనను బుకీ కలిసి ఆఫర్ ఇచ్చిన విషయాన్ని ఐసీసీ అవినీతి నిరోధక మరియు భద్రతా విభాగానికి (ఎసిఎస్‌యు) షకీబ్ నివేదించలేదు. దీంతో ఆర్టికల్ 2.4.4 ప్రకారం షకీబ్‌పై అభియోగాలు నమోదయ్యాయి.
2018 ఐపీఎల్ సందర్భంలో 2018 ఏప్రిల్ 26న సన్‌రైజర్స్ హైదరాబాద్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మ్యాచ్ సందర్భంగా బుకీలు సంప్రదించడాన్నీ వెల్లడించకపోవడంతో మరో అభియోగం నమోదైంది. విచారణలో యాంటీ కరప్షన్ కోడ్‌లోని మూడు చార్జ్‌లను ఉల్లంఘించినట్లు షకీబ్ దర్యాప్తు అధికారుల ముందు అంగీకరించడంతో మంగళవారం షకీబ్‌కు శిక్షను ఖరారు చేసింది.
తాజాగా షకీబ్ ఉల్ హసన్, అనుమానిత భారత బుకీ దీపక్ అగర్వాల్ మధ్య చోటు చేసుకున్న సంభాషణ టైమ్‌లైన్‌ను ఐసీసీ విడుదల చేసింది. ఆ సంభాషణను ఒక్కసారి చూద్దాం...

ముక్కోణపు సిరిస్‌కు ఎంపిక
# ఈ ఏడాది జనవరి 2018లో బంగ్లాదేశ్, శ్రీలంక, జింబాబ్వే జట్ల మధ్య జరిగిన ముక్కోణపు సిరిస్‌లో ఆడేందుకు షకీబ్‌ను సెలక్టర్లు ఎంపిక చేశారు. ఈ సిరిస్ జరుగుతున్న సమయంలో షకీబ్, దీపక్ అగర్వాల్‌కు మధ్య వాట్సాప్ సంభాషణ చోటు చేసుకుంది.
# 19 జనవరి 2018న షకీబ్‌ను అభినందిస్తూ అగర్వాల్ నుంచి వాట్సాఫ్ మేసేజ్ వచ్చింది. ఆరోజు మ్యాచ్‌లో షకీబ్ మ్యాన్ ఆఫ్ మ్యాచ్ అవార్డు గెలిచాడు. ఆ తర్వాత మెసేజ్‌లో "నువ్వు ఇలాగే కలిసి వర్క్ చేస్తావా? లేక ఐపీఎల్ వరకు ఆగాలా?" అని అందులో ఉంది.

కోడ్ భాషగా "వర్క్" అనే పదం
# పైన పేర్కొన్న మేనేజ్‌లో "వర్క్" అనే పదానికి అర్ధం. డ్రెస్సింగ్ రూమ్‌లో ఏమేమి జరుగుతుందో అందుకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు దీపక్ అగర్వాల్‌కు అందించే సూచన అన్నమాట.
# బుకీ అయిన దీపక్ అగర్వాల్ తనతో వాట్సాప్ ద్వారా చాటింగ్ చేసిన విషయాన్ని షకీబ్ ఐసీసీ ఏసీయుతో పాటు ఏ ఇతర యాంటీ కరప్షన్ అథారిటీకి తెలియజేయలేదు.
# 23 జనవరి 2018న షకీబ్‌కు దీపక్ అగర్వాల్ నుండి మరొక వాట్సాప్ మేసేజ్ వచ్చింది. అందులో మిస్టర్ అగర్వాల్ జట్టుకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకునేందుకు "బ్రో ఈ సిరీస్‌లో ఏదైనా ఉందా?" అని అడిగాడు. దీనికి బదులుగా షకీబ్ అవుననే సమాధామనిచ్చాడు.

ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు
# 26 ఏప్రిల్ 2018న, కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో జరిగిన ఐపిఎల్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు తరఫున షకీబ్ ఉల్ హాసన్ ఆడాడు. ఈ మ్యాచ్‌కి ముందు అగర్వాల్ నుంచి షకీబ్ వాట్సప్ మెసేజ్‌ను అందుకున్నాడు. అందులో ఆ ఆటగాడు ఈ మ్యాచ్‌లో ఆడుతున్నాడా లేదా అనే తనకు చెప్పాలని ఉంది.
# అనంతరం అగర్వాల్ తన వాట్సప్ మేసేజ్‌లో బిట్ కాయిన్స్, డాలర్ అకౌంట్స్ గురించి మాట్లాడటంతో పాటు షకీబ్ డాలర్ అకౌంట్ డిటేల్స్ అడిగాడు. ఆ తర్వాత షకీబ్‌ను ముందుగా కలవాలని కోరుకున్నట్లు అగర్వాల్ తన వాట్సాప్ సందేశంలో పేర్కొన్నాడు. 26 ఏప్రిల్ 2018న సందేశాలు తొలగించబడి ఉన్నాయి.

ధృవీకరించిన షకీబ్
# ఈ తొలగించిన సందేశాలలో జట్టులోని సమాచారాన్ని మిస్టర్ అగర్వాల్ అడిగినట్లు షకీబ్ ధృవీకరించారు. అగర్వాల్ మోసపూరితమైనవాడని తాను భావించానని, ఈ సంభాషణల తరువాత అతడు ఒక బుకీ అని తాను భావించినట్లు షకీబ్ సైతం ధృవీకరించాడు.
# 26 ఏప్రిల్ 2018న అగర్వాల్ ఒక బుకీ అని షకీబ్ ధృవీకరించుకున్నప్పటికీ అతడు ఏసియు లేదా ఇతర అవినీతి నిరోధక అధికారులకు నివేదించక పోవడం విశేషం. దీంతో ఆర్టికల్ 2.4.4 ప్రకారం షకీబ్‌పై అభియోగాలు నమోదయ్యాయి. దీంతో షకీబ్‌పై ఐసీసీ విచారణకు అదేశించింది.

బుకీ నుంచి ఏం తీసుకోలేదు
# ఈ విచారణలో అగర్వాల్ విధానాలను అంగీకరించలేదని, అతడి నుంచి తాను ఏం ఆశించలేదని షకీబ్ ACUకి చెప్పాడు. ప్రత్యేకించి, అగర్వాల్ కోరిన సమాచారం ఏదీ అతనికి ఇవ్వలేదని అన్నాడు. అతడి నుంచి తాను డబ్బు లేదా బహుమతులు లాంటి వాటిని అంగీకరించలేదని స్పష్టం చేశాడు.
# మరి షకీబ్‌పై ఐసీసీ ఎందుకు రెండేళ్ల నిషేధం విధించంటే... ఐసీసీ నిబంధనల ప్రకారం ఎవరైనా బుకీ ఓ ఆటగాడిని కలవాలని ప్రయత్నిస్తే అతడు ముందుగా ఏసియు లేదా యాంటీ కరప్షన్ అథారిటీకి తెలిపాలి. షకీబ్ అలా చేయలేదు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications