For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Mumbai Indians హ్యాట్రిక్ కొట్టెనా? రోహిత్ సేన బలాలు, బలహీనతలు.. జట్టు పూర్తి వివరాలు!

Mumbai Indians: Strength, Weakness, Top Players, Playoffs Chances and Prediction ahead of IPL 2021
IPL 2021 : Mumbai Indians SWOT Analysis | Will MI Win IPL Hat-Trick Titles ? || Oneindia Telugu

హైదరాబాద్: ఆరంభంలో ఇబ్బంది పడడం.. మధ్యలో పుంజుకోవడం.. చివర్లో చెలరేగి ఆడడం... ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్‌)‌లో ముంబై ఇండియన్స్‌‌ శైలి‌ ఇది. ఆటలోనే కాదు టైటిల్స్‌‌ నెగ్గడంలోనూ ఆ జట్టు తీరు అదే. తొలి‌ ఐదు సీజన్లలో ఒకేసారి ఫైనల్‌‌ వరకూ వచ్చిన ముంబై.. తర్వాతి ఏనిమిది సీజన్లలో ఏకంగా ఐదు టైటిల్స్‌‌ నెగ్గింది. ఈ ఐదు ట్రోఫీలు‌ రోహిత్‌‌ శర్మ సారథ్యంలోనే రావడం విశేషం. దిగ్గజ‌ మహేంద్ర సింగ్‌‌ ధోనీ తర్వాత అంతటి ప్రశాంతంగా ఉండే కెప్టెన్‌‌గా పేరు తెచ్చుకున్న హిట్‌‌మ్యాన్‌‌ బ్యాటింగ్‌‌లో జట్టును ముందుండి నడిపిస్తున్నాడు.

క్షిష్ట పరిస్థితుల్లో అద్భుత కెప్టెన్సీతో అండగా నిలుస్తున్నాడు. గత‌ సీజన్‌‌లో పూర్తిగా ఆధిపత్యం చెలాయించి‌ ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించిన ముంబై రికార్డు స్థాయిలో ఐదోసారి విజేతగా నిలిచింది. ఈ సారి కూడా అదే జోరు కొనసాగించాలని భావిస్తోంది. బలమైన టీమ్‌, కెప్టెన్‌‌, గొప్ప సహాయక సిబ్బంది‌తో హాట్ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది. మరి, ఆ జట్టు మరోసారి చాంపియన్‌గా నిలిచి హ్యాట్రిక్ కొడుతుందో లేదో చూడాలి. ఓసారి ఆ జట్టు బలలాలు, బలహీనతలపై లుక్కెద్దాం.

టాపార్డర్ బలం..

టాపార్డర్ బలం..

ముంబై ఇండియన్స్ టాపార్డర్ ఎప్పుడూ బలంగానే ఉంటుంది. గత సీజన్‌లో తుది జట్టులో అవకాశం దక్కని ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాట్స్‌మన్ క్రిస్‌‌ లిన్‌ ఈసారి బరిలోకి దిగే అవకాశం ఉంది. క్వింటన్ డికాక్ ఐపీఎల్ ఫస్టాఫ్‌‌కు దూరం కానున్న నేపథ్యంలో లిన్.. రోహిత్‌తో కలిసి ముంబై ఇన్నింగ్స్‌‌ ఆరంభించే అవకాశం ఉంది. ఇక ఫస్ట్ డౌన్‌లో ఎప్పటిలానే సూర్యకుమార్ యాదవ్ రానున్నాడు. ఈ ముగ్గురిలో ఏ ఒక్కరు నిలిచినా అవతలి టీమ్‌‌ బౌలర్లకు మూడినట్టే.

రోహిత్‌‌ కూల్‌‌ కెప్టెన్సీ జట్టు‌కు అదనపు బలం. క్లిష్ట పరిస్థితుల్లోనూ అతను ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకోగలడు. వరల్డ్‌‌ బెస్ట్‌‌ టీ20 బౌలర్లలో ఒకడైన జస్‌ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్, వరల్డ్‌‌ క్లాస్‌‌ ఆల్‌‌రౌండర్లైన హార్దిక్ పాండ్యా, కీరన్‌‌ పొలార్డ్‌‌ అండ ముంబై సొంతం. సూర్యకుమార్​, ఇషాన్‌‌ కిషన్‌‌ రూపంలో భారత యువ ఆటగాళ్ల‌ మద్దతు‌ కూడా ఉంది. అలాగే హెడ్‌‌ కోచ్‌‌ జయవర్ధనే, మెంటార్​ సచిన్‌‌​, క్రికెట్‌‌ ఆపరేషన్స్‌‌ డైరెక్టర్​ జహీర్​ ఖాన్, బౌలింగ్‌‌ కోచ్‌‌ షేన్‌‌ బాండ్‌‌ తదితరుల గైడెన్స్‌‌ గేమ్‌‌ప్లాన్‌‌ విషయంలో రోహిత్‌‌కు ఉపయోగపడనుంది.

బలహీనతలు..

బలహీనతలు..

ఈ సీజన్‌‌ భారత్‌లోనే జరుగుతుండటంతో స్పిన్నర్లు కీలక పాత్ర పోషించనున్నారు. అయితే ముంబై జట్టులో స్పెషలిస్ట్ స్పిన్నర్లు లేరు. ఈ సీజన్ వేలంలో పీయూష్ చావ్లాను తీసుకున్నా.. అతను ఏమేరకు రాణిస్తాడో చూడాలి. గత సీజన్‌లో చెన్నై తరఫున బరిలోకి దిగిన చావ్లా తీవ్రంగా నిరాశపరిచాడు. ఇక రాహుల్‌‌ చహర్​, కృనాల్‌‌ పాండ్యా ఉన్నా.. వీరిని వికెట్‌‌ టేకింగ్‌‌ బౌలర్లకంటే రన్‌‌ సేవింగ్‌‌ స్పిన్నర్లు అనొచ్చు. పేస్ బౌలింగ్‌లో బుమ్రా, బౌల్ట్ మినహాయిస్తే బెంచ్ బౌలర్లను నమ్ముకోలేని పరిస్థితి. దాంతో భారమంతా బుమ్రా, బౌల్ట్‌లపైనే ఉంటుంది. క్వింటన్ డికాక్ దూరం కానుండటం కూడా ఆ జట్టు బ్యాటింగ్‌పై ప్రభావం చూపనుంది. గత సీజన్లో ఒక్క మ్యాచ్ కూడా ఆడని క్రిస్ లిన్‌ను నమ్మలేం. ఇక కరోనా కారణంగా టోర్నీని 6 వేదికలకే పరిమితం చేయడంతో ముంబై ఇండియన్స్ తమ హోం గ్రౌండ్ వాంఖడేకు దూరం కానుంది. ఇది ఆ జట్టుపై ప్రభావం చూపనుంది.

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలను కలిపింది క్వారంటైన్: బీసీసీఐ

ప్లేఆఫ్స్ అంచనా

ప్లేఆఫ్స్ అంచనా

ఎప్పట్లాగే ముంబైపై భారీ అంచనాలున్నాయి. దానికి తగ్గట్లే అది బలమైన జట్టు కూడా. ఐదు టైటిళ్లు నెగ్గడం, ఆరు ఫైనల్స్‌‌ ఆడిన అనుభవం ఉంది కాబట్టి కీలక మ్యాచ్‌‌ల్లో సత్తా చాటగలదు. బ్యాటింగ్, బౌలింగ్‌లో ఆ జట్టు బలంగా ఉంది. దాంతో ఈ సారి కూడా ప్లే ఆఫ్స్‌‌కు చేరుకోగల సామర్థ్యం ఉంది. ఆ జట్టు హార్డ్ హిట్టర్ కీరన్ పొలార్డ్, హార్దిక్ పాండ్యా మంచి ఫామ్‌లో ఉన్నారు. పొలార్డ్ ఇటీవలే 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టి వరల్డ్ రికార్డు క్రియేట్ చేశాడు. మరే జట్టులో లేని ఆటగాళ్లు ముంబై సొంతం. వారు స్థాయికి తగ్గట్లు రాణిస్తే ముంబైకి తిరుగుండదు.

ముంబై జట్టు‌

ముంబై జట్టు‌

బ్యాట్స్‌‌మెన్‌‌: రోహిత్‌‌ శర్మ (కెప్టెన్‌‌), క్రిస్‌‌ లిన్‌‌, సూర్యకుమార్​ యాదవ్‌‌, అన్మోల్‌‌ప్రీత్‌‌ సింగ్‌‌, సౌరభ్‌‌ తివారీ

వికెట్‌‌ కీపర్స్‌‌: క్వింటన్‌‌ డికాక్‌‌, ఇషాన్‌‌ కిషన్‌‌, ఆదిత్య తారె

ఆల్‌‌రౌండర్స్‌‌: హార్దిక్‌‌ పాండ్యా, కీరన్‌‌ పొలార్డ్‌‌, కృనాల్‌‌ పాండ్యా, అనుకూల్ రాయ్‌‌‌

బౌలర్స్‌‌: జస్‌ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్, రాహుల్ చాహర్, జయంత్ యాదవ్, ధావల్ కులకర్ణి,మొహ్సిన్ ఖాన్, ఆడమ్ మిల్నే, నాథన్ కౌల్టర్‌నీల్‌, పియూష్ చావ్లా, జేమ్స్ నీషమ్, యధ్వీర్ చారక్, మార్కో జాన్సెన్, అర్జున్ టెండూల్కర్

Story first published: Tuesday, March 30, 2021, 20:05 [IST]
Other articles published on Mar 30, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+