వికెట్ కీపర్ రేసులో మరో యువ ఆటగాడు.. ఇదే జోరు కనబరిస్తే ధోనీ వారసుడతనే: ఎమ్మెస్కే ప్రసాద్

న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్మెంట్‌తో వికెట్ కీపర్ స్థానానికి ఖాళీ ఏర్పడింది. ధోనీ వారుసుడిగా చాలా అవకాశాలందుకున్న యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్ ఆరంభంలో అదరగొట్టిన ఆ తర్వాత పూర్తిగా తేలిపోయాడు. నిరాశజనక ప్రదర్శనతో చివరకు జట్టులోనే చోటు కోల్పోయాడు. ఈ క్రమంలో కేఎల్ రాహుల్‌ను కీపర్‌గా ప్రయోగించగా అతను ఆ అవకాశాన్ని రెండు చేతులతో అందుకున్నాడు. అటు వికెట్ల వెనుకాల ఇటు బ్యాట్స్‌మన్‌గా అదరగొట్టాడు.తాజా ఐపీఎల్ 2020 సీజన్‌లో తనదైన శైలిలో చెలరేగాడు. ఇక విధ్వంసకర ఇన్నింగ్స్‌లు ఆడే సంజూ శాంసన్‌కు పెద్దగా అవకాశాలు రాకున్నా.. వచ్చిన వాటిని అందిపుచ్చుకోలేకపోయాడు. పైగా ఈ ఐపీఎల్‌లో కూడా తన పాత కథనే రిపీట్ చేశాడు. రెండు, మూడు మ్యాచ్‌లు మినహా మిగతా వాటిలో దారుణంగా విఫలమయ్యాడు.

ఇషాన్ కూడా..
ప్రస్తుతానికైతే ఆస్ట్రేలియా టూర్‌లోని పరిమిత ఓవర్ల సిరీస్‌కు కేఎల్ రాహుల్‌ను కీపర్‌గా ఎంపిక చేసిన సెలెక్టర్లు అతనికి బ్యాకప్‌గా సంజూ శాంసన్‌ను తీసుకున్నారు. రిషభ్ పంత్ టెస్ట్‌లకే పరిమితమయ్యాడు. అయితే వీరికి తోడుగా ఐపీఎల్ 2020 సీజన్‌లో సూపర్ పెర్ఫామెన్స్ కనబర్చిన ముంబై ఇండియన్స్ ఆటగాడు ఇషాన్ కిషన్ కూడా కీపర్ రేసులో ఉన్నాడని టీమిండియా మాజీ చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ అన్నాడు. ఇదే ప్రదర్శనను కొనసాగిస్తే అతి త్వరలోనే భారత జట్టులోకి వస్తాడని తెలిపాడు.

ఇదే జోరు కొనసాగితే..
‘ఐపీఎల్ 2020లో ఇషాన్ కిషన్‌ది పాకెట్ డైనమెట్ యాక్షన్. ముంబై జట్టులో అతను నాలుగో స్థానంలో నిలకడగా రాణించాడు. రోహిత్ శర్మ దూరమైన మ్యాచ్‌ల్లో ఓపెనర్‌గా బరిలోకి అద్భుత ప్రదర్శన కనబర్చాడు. మొత్తంగా మ్యాచ్ గమనానికి అనుగుణంగా ఆడటంలో తిరుగులేదని అతను నిరూపించుకున్నాడు. దాంతో.. ఇప్పుడు టీమిండియా వన్డే, టీ20 వికెట్ కీపర్/ బ్యాట్స్‌మెన్ స్థానానికి ఇషాన్ గట్టి పోటీదారుడిగా నిలిచాడు. బ్యాటింగ్‌లో ఇదే జోరును కొనసాగిస్తూ.. వికెట్ కీపింగ్‌లోనూ సత్తాచాటగలిగితే ఇషాన్ తప్పకుండా టీమిండియాకి ఆడతాడు'అని ఎమ్మెస్కే ప్రసాద్ జోస్యం చెప్పాడు.

ఇస్మార్ట్ ఇషాన్..
ఐపీఎల్ 2020 సీజన్‌లో 14 మ్యాచ్‌లాడిన ఇషాన్ కిషన్ 145.76 స్ట్రైక్‌రేట్‌తో ఏకంగా 516 పరుగులు చేశాడు. 30 సిక్సర్లతో సీజన్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. అలానే అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్ జాబితాలో ఐదో స్థానంలో నిలిచాడు. ఇండియా-ఎకు రెగ్యూలర్‌గా ఆడే ఇషాన్.. దేశవాళీ క్రికెట్‌లో జార్ఖండ్ తరఫున ఆడుతాడు. అదే జార్ఖండ్ నుంచి వచ్చిన ధోనీ వరల్డ్ క్లాస్ ప్లేయర్‌గా ప్రశంసలు అందుకోగా.. అతని వారుసుడిగా ఇషాన్ అవకాశాలను అందుకుంటాడో లేదో చూడాలి.
అప్పుడే స్టీవ్ స్మిత్‌కు మళ్లీ కెప్టెన్సీ.. అది అవకాశం ఉంటేనే!
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications